చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా చేసిన కొత్త సినిమా "బొమ్మ హిట్". ఈ చిత్రాన్ని అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. బొమ్మ హిట్ చిత్రంతో రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొమ్మ హిట్ సినిమాలో పూజా యడం హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 20న పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అనంతరం మూవీ హైలైట్స్ గురించి ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం తెలిపారు.
ర్యాంబ్ ఇన్ లవ్ ఓటీటీ సిరీస్
ఈ కార్యక్రమంలో హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ.. "ఇది హీరోగా నాకు రెండో సినిమా. ఫస్ట్ ఫిలిం వర్క్స్ జరుగుతున్నాయి. నేను నటించిన ర్యాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది" అని తెలిపాడు.
సిచ్యువేషనల్ కామెడీతో
"బొమ్మ హిట్ సినిమా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సిచ్యువేషనల్ కామెడీతో వినోదాన్ని ఇస్తుంది. ఈ చిత్రంలో ఫన్‌తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది. ఈ మధ్య ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్‌ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా బొమ్మ హిట్ సినిమాను కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నా" అని హీరో అభినవ్ మణికంఠ ఆశించాడు.
కొత్త దర్శకుడినని
డైరెక్టర్ రాజేష్ గడ్డం మాట్లాడుతూ.. "బొమ్మ హిట్ మూవీతో నేను దర్శకుడిగా టాలీవుడ్‌లోకి వస్తుండటం సంతోషంగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ సంధ్యరాణి గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. నేను కొత్త దర్శకుడిని అని అనిపించడం లేదు" అని అన్నారు.
మంచి మెసేజ్ ఉంటుంది
"బొమ్మ హిట్ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌తో ఉంటుంది. ప్యాడింగ్ ఆర్టిస్టులు మా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సమ్మర్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం" అని దర్శకుడు రాజేష్ గడ్డం తెలిపారు.
బలమైన కథ ఇది
{{/usCountry}}"బొమ్మ హిట్ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌తో ఉంటుంది. ప్యాడింగ్ ఆర్టిస్టులు మా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సమ్మర్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం" అని దర్శకుడు రాజేష్ గడ్డం తెలిపారు.
బలమైన కథ ఇది
{{/usCountry}}నిర్మాత గుర్రాల సంధ్యారాణి మాట్లాడుతూ.. "మా అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా బొమ్మ హిట్ సినిమాను నిర్మిస్తున్నాం. దర్శకుడు రాజేష్ మంచి కథ చెప్పాడు. బలమైన ఈ కథను బాగా తెరకెక్కిస్తే తప్పకుండా హిట్ మూవీ అవుతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రేమకథతో పాటు
"ఇందులో హీరో హీరోయిన్స్ ప్రేమ కథతో పాటు తల్లిదండ్రులు, కొడుకు మధ్య ఉండే అనుబంధం ఆకట్టుకుంటుంది. టెక్నీషియన్స్, ఆర్టిస్టుల సపోర్ట్‌తో సక్సెస్‌పుల్‌గా మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తాం. బొమ్మ హిట్ సినిమాను హిట్ చేసి మరోసారి మీ ముందుకు వస్తాం" అని ప్రొడ్యూసర్ గుర్రాల సంధ్యారాణి పేర్కొన్నారు.