Netflix OTT Sequel Movie Chor Nikal Ke Bhaga 2: డిజిటల్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టిన సూపర్ హిట్ హీస్ట్ థ్రిల్లర్ 'చోర్ నికల్ కే భాగా' (Chor Nikal Ke Bhaaga) మళ్లీ ఓటీటీలోకి సందడి చేసేందుకు సిద్ధమైంది. 2023లో ఓటీటీ రిలీజ్ అయి హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ భారీ వ్యూస్ సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది.
డిసెంబర్ 17 నుంచి

'చోర్ నికల్ కే భాగా 2' పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 17 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 23న అంటే ఇవాళ అధికారికంగా వెల్లడించింది. తెలుగు ప్రేక్షకులకు 'నువ్విలా', 'గౌరవం' సినిమాలతో సుపరిచితురాలైన యామీ గౌతమ్, యువ నటుడు సన్నీ కౌశల్ ఈ రెండో భాగంలోనూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఆకాశం నుంచి నడిసంద్రం వైపు..
తొలి భాగంలో ఆకాశంలో ఎగిరే విమానంలో వజ్రాల దోపిడీ నేపథ్యంలో కథ నడవగా, ఈసారి దర్శకుడు అజయ్ సింగ్ కథా వేదికను నడిసంద్రంలోని ఓ విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌కు మార్చారు. అమూల్యమైన ఓ పురాతన కిరీటాన్ని దొంగిలించే క్రమంలో తలెత్తే ఊహించని పరిణామాలు, ఉత్కంఠభరిత మలుపులతో ఈ సీక్వెల్ సాగనుంది.
"దొంగ మళ్లీ తప్పించుకుని పారిపోవడానికి సిద్ధమయ్యాడు. మీరు సిద్ధమేనా?" అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. 'స్త్రీ 2', 'ఛావా' వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మాడ్డాక్ ఫిల్మ్స్ (Maddock Films) ఈ సీక్వెల్‌ను నిర్మించింది.
తొలి భాగంలో రా (RAW) అధికారి పర్వేజ్ షేక్ పాత్రలో ఆకట్టుకున్న శరద్ కేల్కర్ ఈ సినిమాలోనూ తన మార్క్ నటనతో అలరించనున్నారు. వీరితో పాటు 'బందిష్ బండిట్స్' ఫేమ్ శ్రేయా చౌదరి కొత్తగా ఈ బృందంలో చేరారు. ఆమె పాత్ర కథలో కీలక మలుపు తిప్పనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తొలి భాగంలో ఏం జరిగిందంటే?
{{/usCountry}}తొలి భాగంలో రా (RAW) అధికారి పర్వేజ్ షేక్ పాత్రలో ఆకట్టుకున్న శరద్ కేల్కర్ ఈ సినిమాలోనూ తన మార్క్ నటనతో అలరించనున్నారు. వీరితో పాటు 'బందిష్ బండిట్స్' ఫేమ్ శ్రేయా చౌదరి కొత్తగా ఈ బృందంలో చేరారు. ఆమె పాత్ర కథలో కీలక మలుపు తిప్పనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తొలి భాగంలో ఏం జరిగిందంటే?
{{/usCountry}}2023 మార్చి 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'చోర్ నికల్ కే భాగా' తొలి భాగం బాక్సాఫీస్ సినిమాలకు దీటుగా ఆదరణ పొందింది. ఇందులో యామీ గౌతమ్ నేహా గ్రోవర్ అనే ఎయిర్ హోస్టెస్‌గా, సన్నీ కౌశల్ ఆమె ప్రియుడు అంకిత్ సేథీగా నటించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అంకిత్, వాటి నుంచి బయటపడేందుకు విమానంలో తరలిస్తున్న వజ్రాలను దొంగిలించాలని పథకం వేస్తాడు. ప్రియుడి కోసం నేహా కూడా ఈ దోపిడీకి సహకరిస్తుంది.
అయితే వారు ఎక్కిన విమానం అనూహ్యంగా హైజాక్ కావడంతో కథ పూర్తిగా మారిపోతుంది. వజ్రాల దొంగతనం కాస్తా ప్రయాణికులు, హైజాకర్ల మధ్య ప్రాణసంకటంగా మారుతుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రా అధికారి పర్వేజ్ షేక్ (శరద్ కేల్కర్)కు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి.
అసలు హైజాక్ వెనుక నేహా వేసిన మాస్టర్ ప్లాన్, అంకిత్‌పై ఆమె ప్రతీకారం క్లైమాక్స్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఇంద్రనీల్ సేన్‌గుప్తా, బరున్ చందా కీలక పాత్రలు పోషించిన ఆ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులను విశేషంగా మెప్పించింది.
అంచనాలు పెంచుతున్న మైండ్ గేమ్
"చోర్ నికల్ కే భాగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను స్క్రీన్‌కు కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ ఊహకు అందేలా ఉన్నా, దాన్ని మలిచిన తీరు ఆకట్టుకుంటుంది" అని రివ్యూస్ వచ్చాయి.
తొలి భాగం చివర్లో నేహా తన పగ తీర్చుకుని తెలివిగా తప్పించుకున్న నేపథ్యంలో, ఇప్పుడు రెండో భాగంలో ఆమె మళ్లీ ఎలాంటి చిక్కుల్లో పడింది, క్రూయిజ్ షిప్‌లో కిరీటం దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. శరద్ కేల్కర్ పాత్ర ఈసారి నేహాకు అండగా నిలుస్తుందా లేక ఆమెను పట్టుకునేందుకు వేట కొనసాగిస్తుందా అనేది డిసెంబర్ 17న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తేలనుంది.
ABOUT THE AUTHOR
చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.