OTT Family: ఓటీటీలోకి ఫ్యామిలీ కామెడీ డ్రామా- అమృతం లాంటి సిరీస్, ఏమాత్రం దాగని సీక్రెట్స్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Chumbak OTT Streaming Trailer Released: ఇరుగుపొరుగుల గిల్లికజ్జాలు, మధ్యతరగతి కాలనీల్లో జరిగే సరదా ఘట్టాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న అమృతం లాంటి ఓటీటీ సిరీస్ చుంబక్. తాజాగా చుంబక్ ట్రైలర్‌ను విడుదల చేశారు. కాలనీలో ఏమాత్రం దాగని సీక్రెట్స్ కథగా వచ్చిన చుంబక్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
Chumbak OTT Streaming Trailer Released: కాలనీల్లో ఉండే ఇరుగుపొరుగు వారి ముచ్చట్లు, చిన్న విషయానికే పెద్ద రచ్చ చేసే అలవాట్లు, ఎంత గొడవపడినా కష్టమొస్తే ఒకరికొకరు నిలబడే బంధాల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త ఓటీటీ ఫ్యామిలీ కామెడీ సిరీస్ 'చుంబక్' (Chumbak).

చుంబక్ ట్రైలర్ రిలీజ్
తాజాగా ఈ ఓటీటీ సిరీస్ చుంబక్ ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేశారు. తెలుగులో 'అమృతం' లాంటి కాలనీ కామెడీలు, మధ్యతరగతి మనుషుల ఎమోషన్స్ ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా అదే తరహాలో ప్రతీ ఇంటా జరిగే హడావుడిని, ఇరుగుపొరుగు మనుషుల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాలను ఆవిష్కరిస్తూ ఈ సిరీస్‌ను మలిచారు.
చిన్న గొడవ.. కాలనీ అంతా హంగామా!
మన ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా కాలనీ మొత్తం క్షణాల్లో వ్యాపించడం, అనవసర సలహాలు ఇచ్చేందుకు పక్కింటి వాళ్లు సిద్ధంగా ఉండటం భారతీయ కుటుంబ వ్యవస్థలో భాగం. 'చుంబక్' కథాంశం కూడా ఇలాంటి వాతావరణంలోనే సాగుతుంది.
ఎవరెవరు ఎలా?
బుల్లితెర స్టార్ హీరో అర్జున్ బిజ్లానీ, హెల్లీ షా జంట కాస్త డ్రీమీ లవర్స్‌గా అలరిస్తుండగా, సుమీత్ వ్యాస్, మానసి పారేఖ్ దంపతుల మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ డ్రామా ఆకట్టుకుంటుంది. సీనియర్ నటి నీనా గుప్తా, దేవన్ భోజానీ కాంబినేషన్‌లో వచ్చే దంపతుల గిల్లికజ్జాలు, డెల్నాజ్ ఇరానీ కుటుంబం చేసే రచ్చ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఖిచ్డీ మేకర్స్ నుంచి వస్తున్న మరో నవ్వుల విందు
'ఖిచ్డీ', 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' వంటి ఎవర్ గ్రీన్ టీవీ కామెడీ షోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హ్యాట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ ఓటీటీ సిరీస్‌ను నిర్మించింది. ఆతిష్ కపాడియా రచన, దర్శకత్వంలో జమ్నాదాస్ (జెడి) మజేతియా, ఆతిష్ కపాడియా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.
చుంబక్ నటీనటులు
ఈ చుంబక్ ఓటీటీ సిరీస్‌లో నీనా గుప్తా, దేవన్ భోజానీ, సుమీత్ వ్యాస్, అర్జున్ బిజ్లానీ, సుమీత్ రాఘవన్, అమీరా దస్తూర్ లాంటి దిగ్గజాలు నటించారు. ఇలాంటి చుంబక్ ఓటీటీలోకి వచ్చేయనుంది. సెప్టెంబర్ 10 నుంచి చుంబక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
చుంబక్ ఓటీటీ స్ట్రీమింగ్
డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 10న ఈ చుంబక్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇండియా హెడ్ తాన్యా బామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కుటుంబాలన్నీ నవ్వుకునే కథలకు
"కుటుంబాలన్నీ కలిసి చూసి నవ్వుకునే కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మన పక్క ఇంట్లో లేదా మన ఇంట్లో రోజూ చూసే పాత్రల ఆధారంగా 'చుంబక్' సిరీస్‌ను తెరకెక్కించారు" అని తాన్యా బామి తెలిపారు.
చుంబక్‌పై నిర్మాతల కామెంట్స్
"ఏ రోజూ ఏ విషయాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోలేని (దాగని సీక్రెట్స్) ఒక కాలనీ కథే 'చుంబక్'. ఎంత గొడవలు పడినా చివరికి ఇరుగుపొరుగు వారే ఒక కుటుంబంలా మారతారు. ప్రతీ ఒక్కరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను, కాలనీ రోజులను గుర్తుచేసుకునేలా ఈ సిరీస్ ఉంటుంది" అని నిర్మాతలు జెడి మజేతియా, ఆతిష్ కపాడియా పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


