...
...
Next Story

Vijay Sangeetha Anirudh Reception: అనిరుధ్, కావ్య రిసెప్షన్‌‌లో దళపతి విజయ్, సంగీత- ఒకే వేడుకలో భార్యాభర్తలు- కానీ!

Thalapathy Vijay Sangeetha In Anirudh Kavya Reception: అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ రిసెప్షన్ చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. దళపతి విజయ్, ఆయన సతీమణి సంగీత ఈ వేడుకకు హాజరవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విడాకుల పిటిషన్ ఉపసంహరణ తర్వాత వీరిద్దరూ ఒకే వేడుకలో కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Published on: Nov 22, 2026, 11:21:29 IST
Advertisement

Thalapathy Vijay Sangeetha In Anirudh Kavya Reception: తమిళ సినీ, రాజకీయ రంగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన వేడుకల్లో ఒకటిగా నిలిచిన అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చెన్నైలో శనివారం (నవంబర్ 21) అట్టహాసంగా జరిగింది.

విజయ్, సంగీతలపై అందరి దృష్టి

అనిరుధ్, కావ్య రిసెప్షన్‌‌లో దళపతి విజయ్, సంగీత- ఒకే వేడుకలో భార్యాభర్తలు- కానీ!
అనిరుధ్, కావ్య రిసెప్షన్‌‌లో దళపతి విజయ్, సంగీత- ఒకే వేడుకలో భార్యాభర్తలు- కానీ!

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ వరకు అగ్ర తారలు, రాజకీయ ప్రముఖులు ఈ విందుకు తరలివచ్చారు. అయితే ఈ వేడుకలో అందరి దృష్టి సీఎం విజయ్, ఆయన భార్య సంగీతలపైనే నిలిచింది. ఒకే కార్యక్రమానికి హాజరైనప్పటికీ, వీరిద్దరూ విడివిడిగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నవ్వుతూ నూతన వధూవరులను ఆశీర్వదించిన సంగీత

చెన్నై వేదికగా జరిగిన ఈ రిసెప్షన్‌లో దళపతి విజయ్ భార్య సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్ న్యూస్ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్న వీడియోలో సంగీత ఎంతో ఉత్సాహంగా, చిరునవ్వుతో కనిపించారు.

ప్రకాశవంతమైన పసుపు రంగు చుడీదార్ ధరించిన ఆమె, వేడుక ప్రాంగణంలో బంధువులు, స్నేహితులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వేదికపైకి వెళ్లి నూతన దంపతులు అనిరుధ్, కావ్య మారన్‌లకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.

విజయ్ వెళ్లిన తర్వాత

మరోవైపు సీఎం విజయ్, సంగీత కంటే ముందే రిసెప్షన్ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఇదే వేడుకలో ఆయన రజనీకాంత్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌లను కలుసుకుని కాసేపు ముచ్చటించారు. విజయ్ వెళ్లిన తర్వాత సంగీత వేడుకకు రావడంతో, ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఎక్కడా కనిపించలేదు.

విడాకుల వివాదం నుంచి రాజీ వరకు..

అయితే ఆరు నెలల తర్వాత, అంటే 2026 ఆగస్టులో సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆ కేసు ముగిసిపోయింది. వివాదం సద్దుమణిగిన తర్వాత వీరిద్దరూ ఒకే వేడుకలో కనిపించడం ఇదే తొలిసారి.

విజయ్ వీరాభిమాని

1990వ దశకం చివర్లో విజయ్, సంగీత ప్రేమ ప్రయాణం మొదలైంది. శ్రీలంక మూలాలున్న సంగీత అప్పట్లో లండన్‌లో నివసించేవారు. 1996లో విడుదలైన విజయ్ సూపర్ హిట్ చిత్రం 'పూవే ఉనక్కాగ' చూసి ఆమె విజయ్‌కు వీరాభిమానిగా మారారు. ఆ అభిమానం కాస్తా ప్రేమగా మారడంతో 1998లో యూకేలో వీరు వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు.

అటు క్రికెట్, ఇటు సంగీతం

ఆ తర్వాత 1999లో చెన్నైలో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు జేసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్వాహకురాలిగా కావ్య మారన్ తెలుగు క్రికెట్ అభిమానులకు ఎంతో సుపరిచితురాలు కాగా, 'దేవర', 'జెర్సీ' వంటి చిత్రాలతో అనిరుధ్ తెలుగు యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks