OTT Telugu: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- గర్భిణీలను మాత్రమే చంపే సైకో- 8 రేటింగ్- కానీ, అదొక్కటే మైనస్!
OTT Telugu Crime Thriller Cmantham Streaming: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ Cమంతం స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గర్భిణీలను మాత్రమే టార్గెట్ చేసి దారుణంగా చంపే సైకో కిల్లర్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఐఎమ్‌డీబీలో పదికి 8 రేటింగ్ సాధించిన సీమంతం ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
OTT Telugu Crime Thriller Cmantham Released: ఓటీటీ వేదికలు ప్రతి వారం ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విభిన్న కథాంశాలతో వచ్చే చిన్న చిత్రాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పెద్ద దిక్కుగా మారుతున్నాయి.

ఓటీటీలో మంచి ఆదరణ
థియేటర్లలో ఆదరణ దక్కకపోయినా, ఓటీటీలో మాత్రం వీక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న తక్కువ బడ్జెట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే Cమంతం (Cmantham). ఇటీవలే సీమంతం ఓటీటీలోకి ప్రీమియర్‌కు వచ్చేసింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
వజ్రయోగి, శ్రేయ భారతి ప్రధాన పాత్రల్లో నటించిన సీమంతం చిత్రానికి సుధాకర్ పాని దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, పెద్ద నటీనటులు లేకపోవడం, సరైన ప్రమోషన్లు లోపించడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం పదికి ఏకంగా 8 రేటింగ్ సొంతం చేసుకుని సత్తా చాటింది సీమంతేం మూవీ.
6 నెలల తర్వాత ఓటీటీలోకి
థియేటర్ రన్‌లో ప్రేక్షకులకు దూరమైన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ద్వారా భారీస్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని చూస్తోంది. సుమారు 6 నెలల తర్వాత సీమంతం ఓటీటీలోకి వచ్చేసింది. ఇది ఒక సీరియల్ సైకో కిల్లర్ స్టోరీ. కేవలం గర్భిణీలను మాత్రమే టార్గెట్ చేసుకుని దారుణంగా చంపుతుంటాడు ఓ సైకో. ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు ప్రెగ్నెంట్ మహిళలనే చంపుతున్నాడు, సైకోను పట్టుకున్నారా అనేదే కథ.
గర్భిణీల హత్యల చుట్టూ
నగరంలో వరుసగా జరుగుతున్న కొన్ని రహస్య హత్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తాయి. దారుణమైన విషయం ఏంటంటే, ఈ హంతకుడు కేవలం గర్భిణీ స్త్రీలను మాత్రమే టార్గెట్ చేసుకుని హత్యలు చేస్తుంటాడు. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తారు. ఎంత ప్రయత్నించినా హంతకుడి జాడ దొరకకపోవడంతో, కేసు దర్యాప్తు పూర్తిగా అగమ్యగోచరంగా మారుతుంది.
ప్రైవేట్ డిటెక్టివ్ ఎంట్రీ..
పోలీసులు చేతులెత్తేసిన ఈ కేసును ఒక ప్రైవేట్ డిటెక్టివ్ తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతడు రంగంలోకి దిగిన తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? కేవలం గర్భిణీలనే ఎందుకు చంపుతున్నాడు? ఈ ఘోరాల వెనుక ఉన్న అసలు మోటివ్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో డిటెక్టివ్‌కు షాకింగ్ నిజాలు ఎదురవుతాయి.
ఉత్కంఠ రేపే మలుపులు
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ కథాంశం ప్రేక్షకులను ఆఖరి వరకు ఉత్కంఠకు గురిచేసేలా దర్శకుడు సుధాకర్ పాని తెరకెక్కించారు. తెలుగు క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో ఇదొక మంచి ఎంపిక కావచ్చు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఇక సీమంతం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. రెండు రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్‌లో సీమంతం ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో సీమంతం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
అదొక్కటే మైనస్
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు కూడా సీమంతం సినిమాను అద్దె విధానంలో డబ్బులు చెల్లించి చూడాల్సిందే. తెలుగు క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి అదొక్కటే మైనస్. అయితే, కొన్ని రోజుల తర్వాత రెంటల్ విధానాన్ని ఎత్తేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


