Rashmika Shahid Kriti Cocktail 2 Box Office Collection Day 1: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలైన రొమాంటిక్ డ్రామా సినిమా ‘కాక్‌టెయిల్ 2’ థియేటర్లలో అదిరిపోయే బోణీ కొట్టింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన (Mixed Reviews) వచ్చినప్పటికీ, ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు క్యూ కడుతున్నారు.
దేశవ్యాప్తంగా భారీ విడుదల.. తొలిరోజు కలెక్షన్స్ ఇవే

షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలయికలో వచ్చిన ఈ చిత్రం తొలిరోజే డబుల్ డిజిట్ మార్క్‌ను చాలా సులభంగా దాటేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా సుమారు 3000కు పైగా స్క్రీన్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఒక ప్రేమకథా చిత్రానికి ఈ స్థాయిలో స్క్రీన్లు కేటాయించడం చాలా పెద్ద విషయమనే చెప్పాలి.
శుక్రవారం (జూన్ 19) విడుదలైన కాక్‌టెయిల్ 2 సినిమా మొదటి రోజే ఇండియాలో ఏకంగా రూ.13.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా.. రూ. 16.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
1.6 లక్షలకుపైగా టికెట్స్ సేల్
ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం.. మొదటి రోజు కోసం 1.6 లక్షలకు పైగా కాక్‌టెయిల్ 2 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడయ్యాయి. దీని ద్వారా రూ.5.57 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. స్పాట్ బుకింగ్స్, బ్లాక్డ్ సీట్లను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య రూ.8 కోట్లను దాటింది.
మార్నింగ్ షోల కంటే ఈవెనింగ్, నైట్ షోలకు థియేటర్లలో అక్యూపెన్సీ (ప్రేక్షకుల సంఖ్య) బాగా పెరగడంతో తొలిరోజు నెట్ వసూళ్లు రూ.13 కోట్లను దాటాయి. ఇక వరల్డ్ వైడ్‌గా తొలి రోజు కాక్‌టెయిల్ 2 సినిమాకు రూ. 20.20 కోట్ల గ్రాస్ రాగా ఓవర్సీస్లో రూ. 4 కోట్లు వచ్చాయి.
పాత ‘కాక్‌టెయిల్’ రికార్డు బద్దలు.. కానీ!
{{/usCountry}}మార్నింగ్ షోల కంటే ఈవెనింగ్, నైట్ షోలకు థియేటర్లలో అక్యూపెన్సీ (ప్రేక్షకుల సంఖ్య) బాగా పెరగడంతో తొలిరోజు నెట్ వసూళ్లు రూ.13 కోట్లను దాటాయి. ఇక వరల్డ్ వైడ్‌గా తొలి రోజు కాక్‌టెయిల్ 2 సినిమాకు రూ. 20.20 కోట్ల గ్రాస్ రాగా ఓవర్సీస్లో రూ. 4 కోట్లు వచ్చాయి.
పాత ‘కాక్‌టెయిల్’ రికార్డు బద్దలు.. కానీ!
{{/usCountry}}అయితే మిశ్రమ టాక్ రావడంతో శని, ఆదివారాల్లో మౌత్ టాక్ (Word of Mouth) ఎలా ఉంటుందనే దాన్ని బట్టే సినిమా లాంగ్ రన్ ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణం 2012లో వచ్చిన ఒరిజినల్ ‘కాక్‌టెయిల్’ సినిమాకు ఉన్న క్రేజ్, అలాగే షాహిద్, కృతి, రష్మికల స్టార్ పవరేనని చెప్పాలి.
ఇంతియాజ్ అలీ కథ అందించగా, హోమి అదజానియా దర్శకత్వంలో వచ్చిన నాటి ‘కాక్‌టెయిల్’లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటి నటించారు. ఆ సినిమా తొలిరోజు రూ.10.47 కోట్లు వసూలు చేయగా.. ఇప్పుడు వచ్చిన సీక్వెల్ రూ.13.50 కోట్లతో ఆ రికార్డును దాటేసింది.
రూ. 125 కోట్ల గ్రాస్‌తో సంచలనం
నిజానికి, నాటి వసూళ్లను నేటి ద్రవ్యోల్బణంతో (Inflation) పోల్చి చూస్తే.. పాత సినిమా రికార్డును నిజమైన అర్థంలో అధిగమించడానికి ‘కాక్‌టెయిల్ 2’ కనీసం రూ.18 నుంచి 19 కోట్లు రాబట్టాల్సి ఉండేది. ఆ లెక్కన చూస్తే టికెట్ల అమ్మకాల పరంగా పాత సినిమానే కాస్త పైచేయి సాధించిందని చెప్పాలి. నాడు 2012లో విడుదలైన కాక్‌టెయిల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అప్పట్లో సంచలనం సృష్టించింది.
సరికొత్త కథతో ఫ్రాంచైజీ
హోమి అదజానియా దర్శకత్వం వహించిన ‘కాక్‌టెయిల్ 2’ కేవలం ఒక స్పిరిచువల్ సీక్వెల్ (కథతో సంబంధం లేని సిరీస్) మాత్రమే. అంటే పాత కథకు, ఈ కొత్త కథకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇది పూర్తిగా భిన్నమైన కథాంశం, సరికొత్త పాత్రలతో సరికొత్త ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రష్మిక మందన్నా నటన ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీకెండ్‌లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లు సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.