OTT Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూడో సీజన్.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇదే
OTT Thriller: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సీజన్ 3 వచ్చేస్తోంది. ఈ తెలుగు సస్పెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఫస్ట్ రెండు సీజన్లు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు మూడో సీజన్ కు టైమ్ వచ్చిందంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది.
ఇటీవల కాలంలో ఓటీటీని షేక్ చేసిన తెలుగు వెబ్ సిరీస్ ల్లో ‘కానిస్టేబుల్ కనకం’ ముందు వరుసలో ఉంటుంది. మిస్టరీ సస్పెన్స్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఓటీటీని షేక్ చేసింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది.

కానిస్టేబుల్ కనకం సీజన్ 3
సూపర్ హిట్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం సీజన్ 3 రాబోతుంది. ఈ కొత్త సీజన్ పై ఈటీవీ విన్ అప్ డేట్ ఇచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఒరిజినల్ సినిమాలు, సిరీస్ లను ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ కనకం సీజన్ 3 గురించి కూడా క్రేజీ అప్ డేట్ ఇచ్చింది.
బిగ్గర్ కేస్
‘‘పెద్ద కేసు. పెద్ద రాక్షసుడు. పెద్ద విధి’’ అనే క్యాప్షన్ తో కానిస్టేబుల్ కనకం ఛాప్టర్ 3ని ఈటీవీ విన్ ఓటీటీ ఇవాళ (ఫిబ్రవరి 28) అనౌన్స్ చేసింది. విన్ జాతరలో భాగంగా ఈ సీజన్ 3ని ప్రకటించింది. ఛాప్టర్ 3కి ఖాల్ ఘాట్ అని పేరు పెట్టింది. ఇప్పుడీ అప్ డేట్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కానిస్టేబుల్ కనకం సీజన్ 3 కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కానిస్టేబుల్ కనకం సిరీస్ గురించి
ఊర్లో అమ్మాయిల మిస్సింగ్ తో మొదలై క్షుద్రపూజ, నరబలి, హత్య తదితర సంఘటనలతో సాగే కానిస్టేబుల్ కనకం సిరీస్ ఓటీటీ ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ఇప్పటికే ఓటీటీలో రిలీజైన సీజన్ 1, 2 అదరగొట్టాయి. 2025 ఆగస్టు 14న కానిస్టేబుల్ కనకం సీజన్ 1 ఓటీటీలో రిలీజైంది.
ఇందులో లేడీ కానిస్టేబుల్ గా వర్ష బొల్లమ్మ నటించింది. కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి అలియాస్ కనకంగా వర్ష కనిపించింది. అడవి గుట్టలోకి వెళ్లిన అమ్మాయిలు మిస్ అవుతుంటారు. ఇదే క్రమంలో కనకం ఫ్రెండ్ చంద్రిక (మేఘ లేఖ) కనిపించకుండా పోతుంది. ఆమెను వెతికే క్రమంలో ఊరి ప్రెసిడెంట్ (అవసరాల శ్రీనివాస్) చేసే క్షుద్ర పూజల గురించి కనకం బయటపెడుతుంది.
సీజన్ 2
అప్పటివరకూ కనిపించకుండా పోయిన అమ్మాయిలను క్షుద్రపూజ పేరిట ప్రెసిడెంట్ చంపేశాడని కనకం కనిపెడుతుంది. కానీ చంద్రిక జాడ మాత్రం తెలియదు. ఇక సీజన్ 2లో చంద్రికను వెతుక్కుంటూ వెళ్లిన కనకానికి ఓ ట్విస్ట్ ఎదురవుతుంది. చంద్రిక, సహస్ర ట్విన్స్ అని తెలుస్తుంది.
చంద్రికగా వచ్చిన సహస్రను ఆయా చంపేసిందని, ఆ ఆయానే కనకం తల్లి అనే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ తర్వాత ఆయా, ప్రెసిడెంట్ కలిసి కనకంపై రివేంజ్ తీర్చుకోవాలని చూస్తారు. రాబోయే కానిస్టేబుల్ కనకం సీజన్ 3లో ఇదే చూపించబోతున్నారని టాక్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


