Haiku Pre Release Press Meet: తెలుగులో సూపర్ హిట్ సాధించిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి అపల్ల నటించిన తమిళ సినిమా హైకూ. ఈ సినిమాలో ఏగన్ హీరోగా చేయగా.. మరో హీరోయిన్గా ఫెమినా జార్జ్ నటించింది. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రొమాంటిక్ ఎంటర్టైనర్గా హైకూ మూవీని రూపొందించారు.
హైకూ ప్రీ రిలీజ్ ఈవెంట్

యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 23న హైకూ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం (అక్టోబర్ 17) హైదరాబాద్‌లో హైకూ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, డైరెక్టర్ రామ్ జగదీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. "ఈ సినిమా నా హార్ట్‌కి చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా కథ వినగానే బాగా నచ్చి వెంటనే ఓకే చేశా. లవ్‌లో ఉన్నా, రిలేషన్ షిప్లో ఉన్నా, మ్యారీడ్ కపుల్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. లవ్‌లో ఉన్న కాంప్లికేషన్స్ మొత్తం ఈ సినిమాలో చూస్తారు" అని అన్నారు.
నన్ను చాలా కూల్‌గా హ్యాండిల్ చేశారు
"ఏగన్ డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయనతో కలిసి పని చేయడం హ్యాప్పీగా అనిపించింది. నన్ను చాలా కూల్‌గా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. మా టీం మొత్తం కూడా ఎంతో సహకరిస్తూ పని చేశారు. ఇది నా ఫస్ట్ డెబ్యూ. మీరంతా అక్టోబర్ 23న థియేటర్లో ఎంజాయ్ చేయండి" అని కోరారు హీరోయిన్ శ్రీదేవి అపల్ల.
హీరో ఏగన్ మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి కొత్త. హైకూ సినిమా క్లోజ్ టు మై హార్ట్. బాగా కష్టపడి సినిమా చేశాము. ఈ సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సిద్దు కుమార్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ యువరాజ్ చిన్నస్వామి నాకు పదేళ్లుగా తెలుసు. ఇప్పుడే మేమిద్దరం కలిసి సినిమా చేశాము. 200 పర్సెంట్ హైదరాబాద్‌లో మళ్లీ హైకూ సక్సెస్ మీట్లో కలుద్దాం" అని చెప్పుకొచ్చారు.
కళ్లతో ఏ భాష అయినా మాట్లాడగలదు
{{/usCountry}}హీరో ఏగన్ మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి కొత్త. హైకూ సినిమా క్లోజ్ టు మై హార్ట్. బాగా కష్టపడి సినిమా చేశాము. ఈ సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సిద్దు కుమార్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ యువరాజ్ చిన్నస్వామి నాకు పదేళ్లుగా తెలుసు. ఇప్పుడే మేమిద్దరం కలిసి సినిమా చేశాము. 200 పర్సెంట్ హైదరాబాద్‌లో మళ్లీ హైకూ సక్సెస్ మీట్లో కలుద్దాం" అని చెప్పుకొచ్చారు.
కళ్లతో ఏ భాష అయినా మాట్లాడగలదు
{{/usCountry}}డైరెక్టర్ రామ్ జగదీష్ మాట్లాడుతూ.. "హైకూ తమిళ సినిమా ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. హైకూకి నా పర్సనల్ స్పెషల్ ఇంట్రెస్ట్ జాబిలీ (శ్రీదేవి). ఆమెకు ఇది తమిళ్ డెబ్యూ. ఆవిడ కళ్లతో ఏ భాష అయినా మాట్లాడగలదు. ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది. సినిమా అవుట్ పుట్ చాలా ప్లెసెంట్గా వచ్చింది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. ఆల్ ది బెస్ట్ టు టీమ్" అని చెప్పారు.
కాలేజ్ లైఫ్ బ్యూటిఫుల్ థింగ్స్
"ఈ కథ కచ్చితంగా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. ఇది ఒక సిన్సియర్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో కాలేజ్ లైఫ్‌లోని బ్యూటిఫుల్ థింగ్స్ చూపించారు. మనల్ని మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. స్పెషల్‌గా ఈ సినిమాను శ్రీదేవి కోసం చూడాలి. ఏగన్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ" అని రచయిత, నిర్మాత కోన వెంకట్ చెప్పారు.