చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
Zee5 OTT: జీ5 ఓటీటీలోకి నేరుగా సరికొత్త సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ- 2 మిస్టరీల కథ, చూసేందుకు 5 కారణాలు- ఎప్పుడంటే?
Zee5 OTT Streaming Movie Dalimb: జీ5 ఓటీటీలోకి నేరుగా సరికొత్త సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దాలింబ్ స్ట్రీమింగ్ అవనుంది. రెండు మిస్టరీల కేసుతో సాగే ఈ థ్రిల్లర్ సినిమాను చూసేందుకు 5 ఇంట్రెస్టింగ్ కారణాలు ఉన్నాయి. మరి దాలింబ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Zee5 OTT Release Movie Dalimb: డిజిటల్ ఆడియెన్స్ కోసం మరో విభిన్న కథాంశాలతో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ సినిమానే దాలింబ్. ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో దాలింబ్ ఓటీటీ సినిమాకు ప్రియా అవెన్ దర్శకత్వం వహించారు.

దాలింబ్ ట్రైలర్ రిలీజ్
జితేంద్ర కుమార్, ప్రియ బాపట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ దాలింబ్ ట్రైలర్‌ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ముంబయి శివారు ప్రాంతాల్లోని మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఒక చిన్నారి అదృశ్యం కావడం, మానసిక చికిత్స కేంద్రం నుంచి ఓ వ్యక్తి తప్పించుకోవడం.. ఈ రెండు మిస్టరీల చుట్టూ కథ తిరుగుతుంది.
దాలింబ్ ట్విస్టులు
ఈ రెండు కేసుల దర్యాప్తు ఎలాంటి మలుపులు తీసుకుంది? ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో దాలింబ్ సినిమా సాగుతుంది. జితేంద్ర కుమార్ గతంలో ఎన్నడూ కనిపించని భిన్నమైన పాత్రలో నటించగా.. ప్రియ బాపట్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
సాధారణంగా కనిపించే ఇళ్ల వెనుక, మనకు పరిచయమైన పరిసరాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయనే అంశాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. పైకి కనిపించే జీవితాలకు, తెర వెనుక ఉన్న వాస్తవాలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో చూపించనుంది. భయం, ప్రేమ, నష్టం, అనిశ్చితి వంటి భావోద్వేగాల సమ్మేళనంతో దాలింబ్ ట్రైలర్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
రెండు మిస్టరీల చుట్టూ కథ..
‘దాలింబ్’లో ప్రధానంగా రెండు రహస్యాలు కీలకంగా ఉంటాయి. ఒక చిన్నారి కనిపించకుండా పోవడం, మానసిక చికిత్స కేంద్రం నుంచి ఓ వ్యక్తి పారిపోవడం.. ఈ రెండు ఘటనలతో కథ మొదలవుతుంది. వాటి వెనుక ఉన్న నిజాలను తెలుసుకునే క్రమంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.
సంబంధాలు, వ్యక్తిగత జీవితాలు, దాచిపెట్టిన రహస్యాలు కథలో కీలకంగా మారతాయి. మొదట సులభంగా కనిపించే ఈ కేసులు క్రమంగా సంక్లిష్టంగా మారి.. అసలు నిజం ఏమిటనే ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచుతాయి. వాస్తవం, అపోహల మధ్య సరిహద్దులు చెరిగిపోయేలా కథనం సాగుతుందని చిత్ర బృందం తెలిపింది.
‘దాలింబ్’ ప్రత్యేకతలు..
రెండు ఆసక్తికరమైన మిస్టరీలు: అదృశ్యమైన చిన్నారి, మానసిక చికిత్స కేంద్రం నుంచి తప్పించుకున్న వ్యక్తి.. ఈ రెండు ఘటనల చుట్టూ సాగే దర్యాప్తు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతుంది.
ఆలోచింపజేసే కథనం: సాధారణ థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ప్రేక్షకుల ఆలోచనలను ప్రశ్నించేలా, కథ ముగిసిన తర్వాత కూడా గుర్తుండిపోయేలా చిత్రాన్ని రూపొందించారు.
పైకి కనిపించేదే నిజం కాదు: మనకు పరిచయమైన వ్యక్తులు, పరిసరాల వెనుక ఎలాంటి జీవితాలు, రహస్యాలు దాగి ఉంటాయనే అంశాన్ని ఈ చిత్రం చర్చిస్తుంది.
సమయంతో పోరాటం: రెండు మిస్టరీలకు సమాధానాలు వెతికే క్రమంలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి.
విభిన్నమైన ప్రధాన పాత్రలు: జితేంద్ర కుమార్, ప్రియ బాపట్ గతంలో ఎన్నడూ పోషించని పాత్రల్లో కనిపించనున్నారు. వారి నటన కథకు మరింత బలాన్ని చేకూర్చనుంది.
దాలింబ్ ఓటీటీ రిలీజ్
ఇలా ఓటీటీలో దాలింబ్ సినిమాను చూసేందుకు 5 ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. జీ5లో దాలింబ్ ఓటీటీ రిలీజ్ అవనుంది. జీ5లో డిసెంబర్ 4 నుంచి దాలింబ ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

E-Paper
