Danny: హీరోపై పడుకుని కాలు మీద కాలేసుకున్న హీరోయిన్- రా అండ్ రస్టిక్ లవ్ డ్రామాగా డానీ- ఆకట్టుకునేలా రిలీజ్ డేట్ పోస్టర్
Danny Movie Release Date Poster Out 2026: 'నాటకం' సినిమాతో మెప్పించిన ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్ జీ గోగన కలయికలో వస్తున్న తాజా చిత్రం 'డానీ'. లవ్, క్రైమ్, మనుషుల వ్యసనాల చుట్టూ సాగే ఈ రస్టిక్ లవ్ థ్రిల్లర్ డ్రామా డానీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
Danny Movie Release Date Poster Out 2026: టాలీవుడ్లో ఊరమాస్ రస్టిక్ డ్రామాలకు, విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. 'నాటకం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త మాస్ అనుభూతిని అందించిన హీరో ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్ జీ గోగన కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది.

లవ్, క్రైమ్, ఎమోషన్స్‌తో డానీ
వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ టాలీవుడ్ చిత్రం 'డానీ'. ప్రేమ, క్రైమ్, తీవ్రమైన భావోద్వేగాల మేళవింపుగా వస్తున్న డానీ చిత్రాన్ని నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా తాజాగా ప్రకటించారు.
ఆకట్టుకుంటున్న 'ఫస్ట్ స్ట్రైక్'.. కాన్సెప్ట్ సైతం డిఫరెంట్!
ఇటీవల డానీ సినిమా నుంచి విడుదలైన 'ఫస్ట్ స్ట్రైక్' ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. సాధారణ ప్రేమకథల బాటలో కాకుండా, మనుషుల వ్యసనాలు లేదా అలవాట్లు వారి జీవిత గమనాన్ని ఎలా మారుస్తాయి? ప్రేమలో పడినప్పుడు వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే అంశాలను దర్శకుడు చాలా బోల్డ్‌గా ఆవిష్కరించారు.
'నాటకం' కాంబో మళ్లీ రిపీట్!
ఒక మనిషి జీవితంలో అలవాట్లు, ప్రేమ మధ్య జరిగే ఘర్షణను ఉత్కంఠభరితమైన క్రైమ్ నేపథ్యంతో జోడించి ఈ డానీ చిత్రాన్ని తెరకెక్కించారు. గతంలో ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగన కాంబినేషన్లో వచ్చిన 'నాటకం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి మాస్ టాక్ సొంతం చేసుకుంది.
డానీ మూవీ బ్యానర్స్
ఇప్పుడు అదే ఇంటెన్సిటీతో అంతకుమించిన కంటెంట్‌తో 'డానీ' మూవీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ పతాకాలపై రిజ్వాన్ ఈ డానీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొల్లి గోపాలకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు.
హీరోయిన్లుగా సేజల్ గుప్తా, సోనాల్ సింగ్
ఇకపోతే డానీ సినిమాలో ఆశిష్ గాంధీ సరసన సేజల్ గుప్తా, సోనాల్ సింగ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అజర్ ఖాన్ మరో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అంతేకాకుండా డానీ చిత్రానికి సాయి కార్తీక్ అందించే నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు.
ఇంటెన్సిటీ పెంచేలా సాయి కార్తీక్ సంగీతం
డానీ సినిమా సీన్లలోని ఇంటెన్సిటీని పెంచడంలో సాయి కార్తీక్ రీ-రికార్డింగ్ కీలక పాత్ర పోషిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఇక ఏకే ఆనంద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, మణికంఠ ఎడిటర్‌గా పనిచేశారు. ఖుషి, సుధాకర్ గోడ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
హీరోపై హీరోయిన్ పడుకుని
ఇదిలా ఉంటే, తాజాగా విడుదల చేసిన డానీ రిలీజ్ డేట్ పోస్టర్లో హీరో, హీరోయిన్ల లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉండి సినిమాపై అంచనాలను పెంచుతోంది. హీరోపై హీరోయిన్ వెల్లకిలా పడుకుని కాలు మీద కాలు వేసుకున్న ఈ పోస్టర్ యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. పక్కా ఊరమాస్, రస్టిక్ యాక్షన్ లవర్స్‌ను అలరించేలా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 13న థియేటర్లలో ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


