Danny First Strike: నాకు బీచ్ అన్నా అమ్మాయి బ్యాక్ అన్నా చాలా ఇష్టం.. బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్‌గా డానీ ఫస్ట్ స్ట్రైక్

Danny First Strike Released: 'నాటకం', 'కళింగ' చిత్రాల సక్సెస్‌ఫుల్ కాంబో ఆశిష్ గాంధీ, కళ్యాణ్‌జీ గోగణ కలయికలో వస్తున్న లేటెస్ట్ బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'డానీ'. తాజాగా రిలీజ్ అయిన డానీ ఫస్ట్ స్ట్రైక్ టీజర్.. బోల్డ్ డైలాగ్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో అట్రాక్ట్ చేస్తోంది.

Published on: Sep 19, 2026, 10:45:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu Bold Crime Thriller Movie Danny First Strike Released: టాలీవుడ్‌లో 'నాటకం', 'కళింగ' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ కాంబినేషన్‌లో మరో ఆసక్తికర చిత్రం సిద్ధమవుతోంది.

నాకు బీచ్ అన్నా అమ్మాయి బ్యాక్ అన్నా చాలా ఇష్టం.. బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్‌గా డానీ ఫస్ట్ స్ట్రైక్
నాకు బీచ్ అన్నా అమ్మాయి బ్యాక్ అన్నా చాలా ఇష్టం.. బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్‌గా డానీ ఫస్ట్ స్ట్రైక్

డానీ ఫస్ట్ స్ట్రైక్ రిలీజ్

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ పతాకాలపై రిజ్వాన్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'డానీ'. బోల్డ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన డానీ సినిమా నుంచి మేకర్స్ తాజాగా 'ఫస్ట్ స్ట్రైక్' (టీజర్) విడుదల చేశారు.

యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే డైలాగ్స్

రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న డానీ సినిమా గ్లింప్స్ మాస్, యూత్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతకుమించి ఇందులో హీరో చెప్పిన డైలాగ్స్ మరింత హైలెట్ అవుతున్నాయి. అయితే, టాలీవుడ్‌లో ఇటీవల రా అండ్ రస్టిక్ కాన్సెప్ట్‌లకు, క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్న రొమాంటిక్ థ్రిల్లర్లకు మంచి ఆదరణ లభిస్తోంది.

బోల్డ్ కంటెంట్‌తో

ఈమాస్ ప్రేక్షకులు కోరుకునే యాక్షన్, యూత్‌ను ఆకర్షించే బోల్డ్ కంటెంట్‌ను సరిగ్గా మిక్స్ చేస్తే బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. ఆ దారిలోనే 'డానీ' కథాంశాన్ని ఎంచుకున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

బోల్డ్ డైలాగ్స్.. సెగలు రేపే యాక్షన్!

తాజాగా విడుదల చేసిన డానీ ఫస్ట్ స్ట్రైక్‌లో హీరో ఆశిష్ గాంధీ, హీరోయిన్ మధ్య వచ్చే సంభాషణలు చాలా బోల్డ్‌గా సాగాయి. "నువ్వు బీచ్‌కి ఎప్పుడూ ఒంటరిగా వస్తావా?" అని అమ్మాయి అడుగుతుంది. దానికి "నేను బీచ్‌కి రావాలంటే కచ్చితంగా అమ్మాయి ఉండాల్సిందే" అని హీరో అంటాడు.

హీరోయిన్ గ్లామరస్ సీన్స్

అప్పుడు "ఏ.. ఎందుకు" అని హీరోయిన్ అడుగుతుంది. అందుకు "నాకు బీచ్ అన్నా.. అమ్మాయి బ్యాక్ అన్నా చాలా ఇష్టం" అని హీరో ఇచ్చే రిప్లై మాస్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. అలాగే, బీచ్ నేపథ్యంలో తెరకెక్కించిన హీరోయిన్ గ్లామరస్ సీన్స్, ఆ వెంటనే వచ్చే పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ సౌండ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

హిట్‌ కాంబోపై పెరిగిన అంచనాలు

రస్టిక్ లుక్‌లో ఆశిష్ గాంధీ నటన, స్క్రీన్ ప్రజెన్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. ఆశిష్ గాంధీ, కళ్యాణ్‌జీ గోగణల కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు 'నాటకం', 'కళింగ' చిత్రాలు గుర్తుకొస్తాయి. ప్రతిసారి ఒక కొత్త తరహా కథాంశంతో వచ్చి మెప్పించిన ఈ జోడీ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైంది.

గ్రాండ్‌గా విజువల్స్

సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. ఏకే ఆనంద్ కెమెరా పనితనం విజువల్స్‌ను గ్రాండ్‌గా చూపించగా, ఎడిటర్ మణికాంత్ కట్ చేసిన షాట్స్ రేసీగా ఉన్నాయి.

అక్టోబర్ నెలలో డానీ రిలీజ్

సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ డానీ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఖుషి సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, త్వరలోనే పాటలు, ట్రైలర్‌కు సంబంధించిన ఇతర అప్‌డేట్లను వెల్లడించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More