Wamiqa Gabbi BMW: ఆ హీరోయిన్లకు కనీసం స్కూటీ, సైకిల్ అయినా ఇప్పించండి.. నిర్మాతపై సినీ ప్రియుల విమర్శలు.. ఇంత అన్యాయమా?
DC BMW Gifts Row Wamiqa Gabbi Producer: డీసీ సినిమాలో హీరోయిన్లకు తక్కువ చూడటంపై సినీ ప్రియులు, వామికా గబ్బి ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీసీ నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిది మారన్‌పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఏమైందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
DC BMW Gifts Row Wamiqa Gabbi Producer: తమిళంలో క్లాసిక్ 'దేవదాస్' కథను సరికొత్త క్రైమ్ డ్రామాగా మలిచి తెరకెక్కించిన 'డీసీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న డీసీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ చిత్ర బృందానికి ఘనమైన నజరానా అందించింది.
కార్ల కానుక.. ఆనవాయితీగా సన్ పిక్చర్స్
సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ 'డీసీ' చిత్ర దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, హీరోగా నటించిన లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లకు సరికొత్త బీఎమ్‌డబ్ల్యూ (BMW) లగ్జరీ కార్ల తాళాలను స్వయంగా అందించారు.
జైలర్ సినిమా సమయంలోనూ
గతంలో రజినీకాంత్ 'జైలర్' సినిమా సాధించిన విజయానికి కూడా కళానిధి మారన్ ఇలాగే చిత్ర యూనిట్‌కు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చారు. తాజాగా కార్లను అందజేసిన వీడియోను సన్ పిక్చర్స్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో విమర్శల పర్వం
ఈ వేడుక వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు, ముఖ్యంగా హీరోయిన్ వామికా గబ్బి (Wamiqa Gabbi) అభిమానులు సన్ పిక్చర్స్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో 'చంద్ర' అనే బాధిత మహిళ పాత్రలో వామికా కనబరిచిన నటన సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతటి నటనతో మెప్పించిన హీరోయిన్‌కు ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడంపై సినీ ప్రియులు మండిపడుతున్నారు.
హీరోయిన్లకు కనీసం స్కూటీ, సైకిల్ అయిన ఇప్పించండి
"కనీసం ఆమెకు ఒక స్కూటీ అయినా కొనిచ్చి గౌరవించాల్సింది" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక నెటిజన్ సన్ పిక్చర్స్ పోస్ట్‌ను షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. మరొక నెటిజన్ స్పందిస్తూ.. "ఈ సినిమాలో నటించిన సంజన క్రిష్ణమూర్తి (Sanjana Krishnamoorthy)కి కనీసం సైకిల్ అయినా ఇస్తారా? బహుమతుల విషయంలో అందరినీ సమానంగా చూడాలి" అని ఘాటుగా స్పందించారు.
కథకు ప్రాణం పోసిన మహిళా నటులు
దేవదాసు కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో లోకేష్ కనగరాజ్ 'దాస్' అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించగా, వామికా గబ్బి 'చంద్ర'గా, సంజనా క్రిష్ణమూర్తి 'పార్వతి' అనే బార్ సింగర్‌గా కనిపించారు. అవినీతి వ్యవస్థపై, పోలీసుల అక్రమాలపై పోరాడే అంశాలతో అరుణ్ ఈ చిత్రాన్ని వైవిధ్యంగా మలిచారు.
డీసీ ఓటీటీ స్ట్రీమింగ్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీసీ చిత్రం రూ.103.06 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే, థియేటర్లలో అదరగొట్టిన డీసీ ఓటీటీలోకి కూడా ఇటీవలే వచ్చేసింది. సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్ట్స్‌లో డీసీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ వంటి 4 భాషల్లో డీసీ ఓటీటీ రిలీజ్ అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


