Worms In Protein Powder: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు- రియల్ సింగంను ఆశ్రయించిన హీరోయిన్ బిపాషా బసు- మాకు ఏకైక ఆశ అంటూ!

Worms In Bipasha Basu Protein Powder: ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ బిపాషా బసు తాను కొనుగోలు చేసిన ప్రొటీన్ పౌడర్ డబ్బాలో పురుగులు వచ్చాయంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియల్ సింగంగా పేరు పొందిన మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ ఐఏఎస్ తుకారాం ముండేకు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు.

Published on: Sep 11, 2026, 06:29:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Worms In Bipasha Basu Protein Powder Raise Food Safety: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ఆహార కల్తీపై సంచలన ఆరోపణలు చేశారు. తాను కొత్తగా కొనుగోలు చేసిన ఐసోప్యూర్ (Isopure) ప్రోటీన్ పౌడర్ డబ్బా తెరిచి చూడగా అందులో చిన్న చిన్న పురుగులు సంచరిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు.

ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు- రియల్ సింగంను ఆశ్రయించిన హీరోయిన్ బిపాషా బసు- మాకు ఏకైక ఆశ అంటూ!
ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు- రియల్ సింగంను ఆశ్రయించిన హీరోయిన్ బిపాషా బసు- మాకు ఏకైక ఆశ అంటూ!

'రియల్ లైఫ్ సింగం'గా గుర్తింపు

ఈ తీవ్రమైన వ్యవహారంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కమిషనర్, 'రియల్ లైఫ్ సింగం'గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండేను బిపాషా బసు ట్యాగ్ చేసి తన ఆవేదన పంచుకున్నారు. ఈ వీడియోలో తన వేలిపై పురుగును చూపిస్తూ బిపాషా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

"మీరే మాకు ఏకైక ఆశ!"

"ఈ కొత్త డబ్బా నిండా చిన్న చిన్న పురుగులు పడుతున్నాయి. మనం కొనుగోలు చేసే ప్రతీ వస్తువులో కల్తీ లేకుండా శుభ్రమైన ఉత్పత్తులు అందాలంటే మీరే మాకు ఏకైక ఆశ" అని ఐఏఎస్ అధికారి తుకారాం ముండేను ఉద్దేశించి బిపాషా బసు ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు చూపిస్తూ బిపాషా బసు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు చూపిస్తూ బిపాషా బసు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

ఖరీదైన అంతర్జాతీయ బ్రాండ్లలోనూ పురుగులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫిట్‌నెస్ సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో, సినీ ప్రముఖులతో పాటు అనేక మంది యువకులు ప్రోటీన్ సప్లిమెంట్లను క్రమం తప్పకుండా వాడుతున్నారు. అయితే ఇంతటి ఖరీదైన అంతర్జాతీయ బ్రాండ్లలోనూ పురుగులు రావడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐఏఎస్ తుకారాం ముండేకు పెరుగుతున్న మద్దతు

మహారాష్ట్రలో ఆహార, ఔషధ కల్తీ రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్న కమిషనర్ తుకారాం ముండే వద్దకు ఈ తరహా ఫిర్యాదులు రావడం మొదటిసారి కాదు. గతంలో బుల్లితెర నటి శ్వేతా తివారీ కూడా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన డ్రింక్ క్యాన్‌తో పాటు బొద్దింక వచ్చిందంటూ వీడియో పోస్ట్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

టీమ్ తుకారం ముండే టీ షర్ట్ ధరించి

బాలీవుడ్ సీనియర్ బ్యూటీ, ఒకప్పటి తెలుగు హీరోయిన్ ప్రీతి జింటా ఏకంగా 'టీమ్ తుకారాం ముండే' అని రాసి ఉన్న టీ-షర్టు ధరించి ఆయనకు మద్దతు తెలపగా, ట్వింకిల్ ఖన్నా, డైసీ షా వంటి నటీమణులు కూడా తుకారాం ముండే కఠిన చర్యలను ప్రశంసించారు.

కుటుంబ జీవితంపై బిపాషా దృష్టి

మరోవైపు బిపాసా బసు ఇటీవల ఎల్లే (Elle) డిజిటల్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసి సందడి చేశారు. మాతృత్వం, తన కెరీర్ ఎంపికల గురించి ఆమె ఆ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.

2015లో చివరిసారిగా నటించిన బిపాషా బసు

2015లో వచ్చిన 'ఎలోన్' సినిమాలో చివరిసారిగా నటించిన బిపాషా బసు 2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకున్నారు. 2022లో ఈ దంపతులకు దేవి అనే కుమార్తె జన్మించింది. ప్రస్తుతం ఆమె కొత్త సినిమాలేవీ ప్రకటించకపోయినప్పటికీ, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిరంతరం అందుబాటులో ఉంటారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More