Dhanush: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, పాన్-ఇండియా స్టార్ ధనుష్ (Dhanush)పై మరోసారి తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. తన 43వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చెన్నైలో అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకునే క్రమంలో ధనుష్ మాట్లాడిన "పేదరికపు" మాటలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ధనుష్ వ్యాఖ్యలు

జూలై 28న ధనుష్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో అభిమానులు భారీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ధనుష్ మాట్లాడుతూ.. "జూలై 28 అనేది కేవలం ఒక సాధారణ తేదీ, ఒక సంఖ్య మాత్రమే. చిన్నప్పుడు స్కూల్లో నా తోటి పిల్లలు కలర్‌ఫుల్ డ్రెస్‌లు వేసుకుని చాక్లెట్లు పంచుతుంటే నాకు చాలా ప్రత్యేకంగా అనిపించేది.
నిజానికి నాకు 4వ తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు. మా అక్కని అడిగితే, ఆమె అమ్మానాన్నలను కనుక్కుని జూలై 28న నా బర్త్‌డే అని చెప్పింది. ఆ రోజుల్లో దీపావళి, పొంగల్‌కి తప్ప కొత్త బట్టలు కొనేవారు కాదు. కానీ ఎలాగోలా ఒప్పించి ఒక కలర్ డ్రెస్, ఆశ చాక్లెట్లు కొనుక్కుని స్కూల్‌లో పంచాను" అని ధనుష్ చెప్పాడు.
సోషల్ మీడియాలో సింపతీ ట్రోల్స్
ధనుష్ వ్యాఖ్యలు బయటకు రాగానే ఎక్స్ (ట్విట్టర్) తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో నెటిజన్లు ఈ స్టార్ హీరోను విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. గతంలో 'ఇడ్లీ కడై' (Idli Kadai) సినిమా ప్రమోషన్ల సమయంలో.. ఇడ్లీలు తినడానికి డబ్బులు లేక తాము చిన్నప్పుడు పువ్వులు అమ్మేవాళ్లమని ధనుష్ చెప్పిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
అప్పుడు ఇడ్లీలు
{{/usCountry}}ధనుష్ వ్యాఖ్యలు బయటకు రాగానే ఎక్స్ (ట్విట్టర్) తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో నెటిజన్లు ఈ స్టార్ హీరోను విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. గతంలో 'ఇడ్లీ కడై' (Idli Kadai) సినిమా ప్రమోషన్ల సమయంలో.. ఇడ్లీలు తినడానికి డబ్బులు లేక తాము చిన్నప్పుడు పువ్వులు అమ్మేవాళ్లమని ధనుష్ చెప్పిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
అప్పుడు ఇడ్లీలు
{{/usCountry}}"అప్పుడేమో ఇడ్లీల కోసం కష్టపడ్డానన్నావు.. ఇప్పుడేమో పుట్టినరోజు డ్రెస్సుల కోసం కష్టపడ్డానంటున్నావు. సాధారణ ప్రజలకు కనెక్ట్ అవ్వడానికి ఈ సింపతీ డ్రామాలు చెప్పమని నీకు ఎవరు సలహాలు ఇస్తున్నారు?" అంటూ ఓ నెటిజన్ ఘాటుగా ప్రశ్నించారు. తమిళ సినిమా పరిశ్రమలోని ఒక ప్రముఖ దర్శకుడు (కస్తూరి రాజా) కొడుకై ఉండి ప్రతిసారీ ఇలాంటి పేదరికపు కథలు అల్లడం ఏంటని తీవ్ర స్థాయిలో నిలదీస్తున్నారు.
ధనుష్ క్లారిటీ
గతంలో తన కుటుంబ ఆర్థిక స్థితిపై వచ్చిన విమర్శలపై ధనుష్ స్పందిస్తూ.. "నేను 1983లో పుట్టాను. మా నాన్న మొదటి సినిమా (ఎన్ రాసావిన్ మనసిలే) తీసింది 1991లో. ఆ రోజుల్లో నలుగురు పిల్లలను చదివించడం కుటుంబానికి పెద్ద భారంగా ఉండేది. మేం పాకెట్ మనీ కోసం కష్టపడాల్సి వచ్చేది. 1995 తర్వాతే మా కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది" అని గతంలో వివరణ ఇచ్చాడు.
సినిమాలతో బిజీ
ఇటీవల 'కర' (Kara) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ధనుష్.. ప్రస్తుతం 'ఓమ్ చాప్టర్ 1 - ఉధిరమ్: ది బ్లడ్ వుడ్' (OM Chapter 1 – Udhiram: The Blood Wood), 'తమిళ్ మురుగన్' (Thamizh Murugan) వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.
అయితే, దళపతి విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత ధనుష్ కూడా పబ్లిక్ ఈవెంట్లలో ఇలాంటి ఎమోషనల్ స్పీచ్‌లు ఇవ్వడం వెనుక భవిష్యత్తు రాజకీయ ఆశలు ఉన్నాయా అనే అనుమానాలను కూడా సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.