Dhanush Speech In Kara Movie Pre Release Event: తెలుగులోనూ ధనుష్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి ధనుష్ హీరోగా అలరించేందుకు వస్తున్న సినిమా కర. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా హీరోయిన్ మమితా బైజు నటించింది.
కర ప్రీ రిలీజ్ ఈవెంట్

కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన కర చిత్రానికి డైరెక్టర్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. కర సినిమాని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఏప్రిల్ 26) నాడు కర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
కర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, డైరెక్టర్స్ బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ విఘ్నేష్ రాజా, ఓటీటీ సినిమాపై హీరో ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఈ పేరు గుర్తు పెట్టుకోండి
ధనుష్ మాట్లాడుతూ .. "‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేష్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేష్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక ముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. ఓటీటీ సినిమా ‘పోరు తొళిల్’ చూసిన తరువాత విఘ్నేశ్ ఎనర్జీ నన్ను టచ్ చేసినట్టు అనిపించింది. అందుకే ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను" అని అన్నారు.
"ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ మూవీకి సపోర్ట్ చేసిన గణేష్ గారికి థాంక్స్. మమితా గారు అద్భుతమైన నటి. రవి కుమార్ సార్‌తో పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. నా ఫ్రెండ్ జీవీ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. ‘కుబేర’, ‘ఇడ్లీకొట్టు’ తరువాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను" అని ధనుష్ చెప్పారు.
పోరు తోళిల్ ఓటీటీ రిలీజ్
{{/usCountry}}"ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ మూవీకి సపోర్ట్ చేసిన గణేష్ గారికి థాంక్స్. మమితా గారు అద్భుతమైన నటి. రవి కుమార్ సార్‌తో పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. నా ఫ్రెండ్ జీవీ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. ‘కుబేర’, ‘ఇడ్లీకొట్టు’ తరువాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను" అని ధనుష్ చెప్పారు.
పోరు తోళిల్ ఓటీటీ రిలీజ్
{{/usCountry}}"‘కర’ ఎంతో క్వాలిటీతో రాబోతోంది. మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి, వెంకీ అట్లూరి, బుచ్చిబాబు గారికి థాంక్స్. ఏప్రిల్ 30న మా సినిమా రాబోతోంది. థియేటర్లో మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అని హీరో ధనుష్ కోరారు.
అయితే, ధనుష్ చెప్పిన పోర్ తోళిల్ సినిమా తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఆర్ శరత్ కుమార్, అశోక్ సెల్వన్ మెయిన్ లీడ్స్‌లో నటుడు శరత్ బాబు, నిఖిల విమల్, సునీల్ సుఖాడా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సోనీ లివ్‌లో పోర్ తోళిల్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 8 రేటింగ్ ఉంది.
రెహమాన్ గొప్పగా చెబుతారు
ఇక ఇదే కర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. "ధనుష్ గారిని చూసేందుకే ఈవెంట్‌కు వచ్చాను. కాళీపట్నంలో కర మాస్టర్ అని ఉండేవారు. ఆయన రచయితల కోసం ఎన్నో చేశారు. ఆయన పేరు ఈ మూవీకి పెట్టారు. రెహమాన్ గారు ధనుష్ గారి గురించి ఎంతో గొప్పగా చెబుతారు. ఏప్రిల్ 30న ‘కర’ మంచి విజయాన్ని సాధించాలి" అని కోరారు.