తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ కలెక్షన్ల రోజు 1: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బ్యూటిపుల్ హీరోయిన్ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా తేరే ఇష్క్ మే. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. తేరే మేరే ఇష్క్ ట్రైలర్ అభిమానులలో ఆసక్తి రేకెత్తించింది.
ధనుష్-ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్

తేరే మేరే ఇష్క్ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. లవ్ మ్యూజికల్ హిట్ మూవీస్ అయిన రాంజనా, ఆత్రంగి రే తర్వాత ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. భారీ అంచనాల నడుమ నవంబర్ 28న థియేటర్లలో తేరే మేర్ ఇష్క్ మూవీ విడుదలైంది.
పాజిటివ్ రివ్యూస్
తేరే మేరే ఇష్క్ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్, కృతి సనన్ కెమిస్ట్రీ అదిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. మంచి ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా తేరే ఇష్క్ మే పేరు తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో తేరే ఇష్క్ మే తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
తేరే ఇష్క్ మే తొలి రోజు కలెక్షన్స్
ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం తేరే ఇష్క్ మే సినిమాకు ఓపెనింగ్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 16.50 కోట్లుగా ఉన్నాయి. అంటే, ఇండియాలో తొలి రోజున తేరే ఇష్క్ మే రూ. 16.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఈ ఏడాది వచ్చిన రొమాంటిక్ సినిమాలు మంచి ఓపెనింగ్స్ అందుకున్నాయి.
సయ్యారా తర్వాత
భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రొమాంటిక్ డ్రామా మూవీ సయ్యారా తొలి రోజు ఇండియాలో రూ. 21.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రొమాంటిక్ చిత్రాల్లో ఈ మూవీనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా రికార్డ్ ఉంది. కానీ, తేరే ఇష్క్ మే ఇతర స్టార్ హీరోల సినిమాల రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది.
స్టార్ హీరోల సినిమాలు బ్రేక్
{{/usCountry}}భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రొమాంటిక్ డ్రామా మూవీ సయ్యారా తొలి రోజు ఇండియాలో రూ. 21.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రొమాంటిక్ చిత్రాల్లో ఈ మూవీనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా రికార్డ్ ఉంది. కానీ, తేరే ఇష్క్ మే ఇతర స్టార్ హీరోల సినిమాల రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది.
స్టార్ హీరోల సినిమాలు బ్రేక్
{{/usCountry}}కన్నప్ప నటుడు, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, హర్షద్ వార్సీ నటించిన జాలీ ఎల్ఎల్‌బీ 3 సినిమా తొలి రోజు రూ. 12 కోట్లు వసూలు చేసింది. అలాగే, అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ రూ. 10.70 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఓడించి ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ధనుష్ తేరే ఇష్క్ మే నిలిచింది.