తెలుగు ఓటీటీ రంగంలో వైవిధ్యమైన కంటెంట్‌తో దూసుకుపోతున్న ‘ఆహా’ నుంచి వచ్చిన తాజా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’. ఈ ఓటీటీ సిరీస్‌లోని మొదటి కేసు 'త్రీ హెడ్స్ కేసు' (Three Heads Case) ఇప్పుడు ముగింపుకు చేరుకుంది. 20 ఎపిసోడ్‌ల పాటు సాగిన ఈ సుదీర్ఘ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందో ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:

ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా నవ రాత్రులు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఆ స్టేషన్‌కు కావాలని పోస్టింగ్ వేయించుకుని ఏసీపీగా వస్తాడు వెట్రి మారన్ (అశ్విన్ కుమార్). అతను చాలా స్ట్రిక్ట్ అని, అవినీతి అంటే పడదని గొప్ప పేరు ఉంటుంది. అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేసే మాసాని (పద్మినీ కుమార్) అమ్మవారి భక్తురాలు.
ఈ క్రమంలో తెల్లారితే మూడు హత్యలు జరుగుతాయని పోలీసులకు తెలుస్తుంది. ఆ హత్యలు ఎవరివి?, అవి ఎవరు? ఎందుకు చేశారు? అసలు పోలీసులకు హత్యలు జరుగుతాయని ఎలా తెలిసింది? ఈ కేసును సాల్వ్ చేసేందుకు ఇద్దరు ఏసీపీలు ఎందుకు నియామకం అయ్యారు? ఈ కేసులో ఎవరెవరిని అనుమానించారు? బయటపడిన నిజాలు ఏంటీ? మరి కేసును చేధించారా? అనేది తెలియాలంటే ఈ ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను చూడాల్సిందే.
విశ్లేషణ:
హత్యలు జరిగాక కేసు సాల్వ్ చేయడం అనేది రెగ్యులర్ స్టోరీనే. కానీ, ఏకంగా మూడు హత్యలు జరగబోతున్నాయని ముందే పోలీసులకు తెలిసి వాటిని చేధించే దిశగా సాగే స్టోరీతో వచ్చిన సినిమాలు, ఓటీటీ సిరీస్‌లు చాలా అరుదు. బలమైన కథనం ఉంటే ఎప్పటికీ సక్సెస్ సాధిస్తాయని మరోసారి నిరూపించిన సిరీస్ ఇది.
గతేడాది డిసెంబర్ 5 నుంచి ఒక్కో ఎపిసోడ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ తాజాగా 20వ ఎపిసోడ్‌తో కేస్ 1 సాల్వ్ అయింది. కేస్ 1 త్రీ హెడ్స్ టైటిల్‌తో ఓటీటీ రిలీజ్ అయిన ఈ ధూల్‌పేట పోలీస్ స్టేషన్ సిరీస్ ఆద్యంతం గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్‌గా సాగుతుంది.
కథనం, మేకింగ్
{{/usCountry}}గతేడాది డిసెంబర్ 5 నుంచి ఒక్కో ఎపిసోడ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ తాజాగా 20వ ఎపిసోడ్‌తో కేస్ 1 సాల్వ్ అయింది. కేస్ 1 త్రీ హెడ్స్ టైటిల్‌తో ఓటీటీ రిలీజ్ అయిన ఈ ధూల్‌పేట పోలీస్ స్టేషన్ సిరీస్ ఆద్యంతం గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్‌గా సాగుతుంది.
కథనం, మేకింగ్
{{/usCountry}}ఈ సిరీస్‌లోని ప్రధాన బలం దాని కథనం. ఒక సంక్లిష్టమైన కేసును పోలీసులు ఛేదించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను చాలా సహజంగా చూపించారు. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగుతూ, తదుపరి ఏం జరుగుతుందో అన్న ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు విజయం సాధించారు. కథా గమనం, ఎక్కడా పట్టు కోల్పోకుండా పక్కాగా సాగడం వల్ల ఇది ఒక పర్ఫెక్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు.
నటీనటుల ప్రతిభ
3 హత్యలను చేధించేందుకు ఇద్దరు ఏసీపీలు నియామకం కావడం అనేది డిఫరెంట్ పాయింట్. అది చాలా బాగా చూపించారు. ఈ ఏసీపీ పాత్రల్లో నటించిన అశ్విన్ కుమార్, గురు లక్ష్మణ్ పోలీసు అధికారుల పాత్రల్లో ఒదిగిపోయారు. కేసును ఛేదించే క్రమంలో వారు చూపించిన హావాభావాలు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తాయి.
అలాగే, కానిస్టేబుల్‌గా చేసిన పద్మినీ కుమార్ అద్భుతమైన నటనతో సిరీస్‌కు ఎమోషనల్ డెప్త్‌ను తీసుకొచ్చారు. ఆమె పాత్ర పండించిన భావోద్వేగాలు కథలో కీలకం అవుతాయి.
బోర్ కొట్టకుండా
కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ ఓటీటీ సిరీస్ మరోసారి నిరూపించింది. కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా, లోతైన ఇన్వెస్టిగేషన్, పాత్రల మధ్య సంఘర్షణ, రాజకీయాలు, పగ ప్రతికారం వంటి అంశాలను అద్భుతంగా ఆవిష్కరించారు. 20 ఎపిసోడ్స్‌తో లాంగ్ ఫార్మాట్‌లో వచ్చినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ మొదటి కేసును ముగించడం బాగుంది.
డైరెక్టర్ జె జస్విన్ టేకింగ్, బ్రహ్మ జీ దేవ్ కథనం బాగా ఆకట్టునేలా ఉన్నాయి. అశ్వత్ అందించిన సంగీతం క్రైమ్ థ్రిల్లర్‌కు పర్‌ఫెక్ట్ అనేలా ఉంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
కేస్ 1 క్లోజ్.. కేస్ 2 లోడింగ్!
మొత్తం 20 ఎపిసోడ్‌ల పాటు సాగిన మొదటి కేసు అధికారికంగా ముగిసింది. అయితే ఈ కేస్ 1 తర్వాత రెండో కేస్ కూడా రానున్నట్లు క్లైమాక్స్‌లో మేకర్స్ ట్విస్ట్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఎంగేజ్ చేసే పర్‌ఫెక్ట్ ఆహా ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ కేస్ 1 త్రీ హెడ్స్‌పై లుక్కేయొచ్చు.