బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం (మార్చి 23) సాధారణంగా వసూళ్లలో తగ్గుదల కనిపించడం సహజం.

అయితే, ధురంధర్ 2 మాత్రం ఆ ప్రభావాన్ని తట్టుకుని నిలబడటమే కాకుండా, సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది. ఐదు రోజులు ముగిసేసరికి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 829.76 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
ఐదో రోజు వసూళ్ల వివరాలు
విడుదలైన ఐదో రోజు (మొదటి సోమవారం) ధురంధర్ 2 చిత్రం ఇండియాలో రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఆదివారం (మార్చి 22) నాటి రూ. 114.85 కోట్లతో పోలిస్తే ఇది 43.4 శాతం తగ్గుదల అయినప్పటికీ, వర్కింగ్ డే కావడంతో ఈ వసూళ్లు అత్యంత భారీగా పరిగణించవచ్చు.
దేశవ్యాప్తంగా 20,382 షోల ద్వారా ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషం. దీనితో కలిపి ఇప్పటివరకు ఐదు రోజుల్లో భారత్‌లో మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 519.12 కోట్లకు (గ్రాస్ రూ. 619.76 కోట్లు) చేరుకున్నాయి.
అంతర్జాతీయ వేదికపై 'ధురంధర్' సత్తా
కేవలం దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 210 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వెరసి ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ. 829.76 కోట్లు దాటాయి. ఈ దూకుడుతో షారుఖ్ పఠాన్, జవాన్, యశ్ కేజీఎఫ్: చాప్టర్ 2, రాజమౌళి ఆర్ఆర్ఆర్ వంటి భారీ పాన్-ఇండియా చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డులను కూడా ‘ధురంధర్ 2’ వెనక్కి నెట్టడం గమనార్హం.
వారాంతం గణాంకాలు ఒకసారి చూస్తే..
శనివారం (3వ రోజు): రూ. 135.15 కోట్ల గ్రాస్ (థియేటర్ల ఆక్యుపెన్సీ 81.6%)
{{/usCountry}}శనివారం (3వ రోజు): రూ. 135.15 కోట్ల గ్రాస్ (థియేటర్ల ఆక్యుపెన్సీ 81.6%)
{{/usCountry}}ఆదివారం (4వ రోజు): రూ. 137.43 కోట్ల గ్రాస్ (థియేటర్ల ఆక్యుపెన్సీ 79.7%)
సోమవారం (5వ రోజు): రూ. 77.79 కోట్ల గ్రాస్ (థియేటర్ల ఆక్యుపెన్సీ 43.1%)
కథా నేపథ్యం
ఇదిలా ఉంటే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 చిత్రం కరాచీలోని నేర సామ్రాజ్యం, రాజకీయ వ్యవస్థలోకి చొచ్చుకుపోయే భారతీయ గూఢచారి సాహసాల చుట్టూ తిరుగుతుంది. 26/11 దాడుల అనంతర పరిణామాలు, పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కోవడంలో హీరో జరిపిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తోపాటు అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు ఉండటం ధురంధర్ 2కి అదనపు బలాన్ని ఇచ్చింది. ఇక ప్రస్తుత దూకుడు చూస్తుంటే, మరికొద్ది రోజుల్లోనే ధురంధర్ 2 చిత్రం రూ. 1000 కోట్ల మార్కును కూడా సునాయాసంగా దాటేలా కనిపిస్తోంది.