...
...
Next Story

OTT:ఓటీటీలో ధురంధర్ ఆల్ టైమ్ రికార్డు-నెట్‌ఫ్లిక్స్‌లో తొలి వీకెండ్ లో అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీ-యానిమల్ ను దాటి!

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్' మూవీ ఓటీటీలోనూ రికార్డుల మోత మోగిస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆల్ టైమ్ రికార్డు ఖాతాలో వేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌ లో తొలి వీకెండ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన ఇండియన్ మూవీగా ధురంధర్ హిస్టరీ క్రియేట్ చేసింది.

Published on: Feb 6, 2026, 05:49:38 IST
Advertisement

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' విడుదలైనప్పటి నుంచి రికార్డులు బద్దలు కొడుతోంది. బాక్సాఫీస్‌ దగ్గర ఆధిపత్యం చెలాయించిన తర్వాత ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీని కూడా ఏలుతుంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వీకెండ్ లోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన ఇండియన్ మూవీగా ధురంధర్ నిలిచింది.

ధురంధర్ ఓటీటీ

ఓటీటీలో ధురంధర్ రికార్డు
ఓటీటీలో ధురంధర్ రికార్డు

థియేటర్లలో అదరగొట్టిన ధురంధర్ ఇప్పుడు ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. జనవరి 30న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. కేవలం ఒక వారంలోనే 'యానిమల్', 'ఫైటర్', 'పుష్ప 2: ది రూల్' వంటి భారీ చిత్రాలను దాటేసింది. పోస్ట్-థియేట్రికల్ హిందీ ఓటీటీ రిలీజ్ లో అత్యధిక ఫస్ట్ వీకెండ్ వ్యూస్ రికార్డు దక్కించుకుంది.

ధురంధర్ ఓటీటీ రికార్డు

'ధురంధర్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్', 'పుష్ప 2'లను అధిగమించింది. ధురంధర్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా 7.6 మిలియన్ వ్యూస్ రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్‌ లో ఫస్ట్ వీకెండ్ లోనే 7 మిలియన్ల వ్యూస్ ను దాటిన ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదే. ఈ చిత్రం రణ్‌బీర్ కపూర్ 'యానిమల్', హృతిక్ రోషన్ 'ఫైటర్', అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' సెట్ చేసిన బెంచ్‌మార్క్‌లను అధిగమించింది.

యానిమల్ ఇలా

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' నెట్‌ఫ్లిక్స్‌లో తొలి వీకెండ్ లో 6.2 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇప్పుడీ రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది. ‘ఫైటర్’ తొలి వారాంతంలో 5.9 మిలియన్ల వ్యూస్ నమోదు చేయగా, 'పుష్ప 2: ది రూల్' ఏమో 5 మిలియన్ల వ్యూస్ సాధించింది.

MoviesFirst Weekend Views
Dhurandhar7.6 million (3 days)
Animal6.2 million (3 days)
Fighter5.9 million (3 days)
Pushpa 2 The Rule5.8 million (3 days)
Raid 25.6 million (3 days)
Crew5.4 million (3 days)
Jawan5.2 million (3 days)
Idli Kadai5.2 million (5 days)
Lucky Bhaskar5.1 million (3 days)
Sikandar5.1 million (5 days)
View All

ధురంధర్ గురించి

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్' ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రణ్‌వీర్ సింగ్ భారత గూఢచారిగా నటించాడు. ఇండియాను టార్గెట్ చేసిన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించే లక్ష్యంతో పాకిస్థాన్‌లోని లైయారీ ముఠాలలోకి చొరబడతాడు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించగా, సారా అర్జున్, రాకేష్ బేడీ సహాయ పాత్రల్లో కనిపించారు. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇండియన్ బాక్సాఫీస్‌లో రూ. 1000 కోట్లు దాటిన మొదటి బాలీవుడ్ చిత్రంగా ధురంధర్ నిలిచింది. అభిమానులు ఇప్పుడు సీక్వెల్ ‘ధురంధర్: ది రివేంజ్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe