Rachita Ram Reacts To Fan Touches Cheek: కన్నడ సినీ పరిశ్రమలో 'డింపుల్ క్వీన్'గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రచితా రామ్‌కు తన పుట్టినరోజు వేడుకల్లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అక్టోబర్ 3న ఆమె జన్మదినం సందర్భంగా బెంగళూరులోని తన నివాసం వద్ద అభిమానులను కలిసి, శుభాకాంక్షలు అందుకున్నారు.
వైరల్‌గా అభిమాని ప్రవర్తన

వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో ఓపిగ్గా ముచ్చటిస్తూ, సెల్ఫీలకు కూడా ఫోజులిచ్చారు రచితా రామ్. ఈ క్రమంలోనే ఒక అభిమాని చేసిన ప్రవర్తన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.
సెల్ఫీ నెపంతో సరిహద్దులు దాటిన అభిమాని
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, రచితా రామ్ అభిమానులతో సరదాగా నవ్వుతూ ఫోటోలు దిగుతున్నారు. ఒక యువకుడు ఆమెతో సెల్ఫీ దిగిన వెంటనే, వెళ్తూ వెళ్తూ ఉన్నట్టుండి ఆమె బుగ్గ గిల్లి వెళ్లాడు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక రచిత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అయినప్పటికీ వెంటనే తేరుకుని, ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా నవ్వుతూనే మిగిలిన అభిమానులతో సంభాషించారు రచితా రామ్. ఈ దృశ్యాలు కెమెరాలో నిక్షిప్తమై సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారాయి.
నెట్టింట వ్యక్తమవుతున్న ఆగ్రహం.. హద్దులు ఉండాలి!
ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అభిమానం పేరిట నటీనటుల వ్యక్తిగత పరిధులను దాటడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. "ఇది ముమ్మాటికీ వేధింపుల కిందకే వస్తుంది. పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన వారి అనుమతి లేకుండా తాకడం సరైన పద్ధతి కాదు" అని ఒక నెటిజన్ తీవ్రంగా ఖండించారు.
ఎవరైనా సరే కనీస మర్యాద పాటించాలని, అభిమానం ఉంటే దూరంగా నిలబడి వ్యక్తపరచాలని హితవు పలుకుతున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ రచితా రామ్ సమయస్ఫూర్తితో, ప్రశాంతంగా వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక సందేశం
{{/usCountry}}ఎవరైనా సరే కనీస మర్యాద పాటించాలని, అభిమానం ఉంటే దూరంగా నిలబడి వ్యక్తపరచాలని హితవు పలుకుతున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ రచితా రామ్ సమయస్ఫూర్తితో, ప్రశాంతంగా వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక సందేశం
{{/usCountry}}ఇదిలా ఉంటే, తన పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం (అక్టోబర్ 4) రోజున రచితా రామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.
కన్నడ భాషలో ఉన్న ఆ పోస్ట్‌లో.. "అందరికీ నమస్కారం. నన్ను మీ ఇంటి ఆడపడుచులా భావించి, నా పుట్టినరోజు వేడుకలకు విచ్చేసి ఇంత ప్రేమతో, వైభవంగా జరిపించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరినీ కలవడం, నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలను ప్రత్యక్షంగా చూడటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది" అని రాసుకొచ్చారు.
చెడు ఉద్దేశంతో అలా చేయలేదు
అంతేకాకుండా, "నా పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా మార్చిన నా అభిమానులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నా జీవితాంతం మీరు నాపై కురిపించిన ఈ ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నాకూ, నా అభిమానులకు మధ్య ఉన్న ఈ అనుబంధం ఎప్పటికీ ఇలాగే బలంగా ఉండాలని, ఎలాంటి దిష్టి తగలకుండా ఎప్పుడు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని రచితా రామ్ ఆ సందేశంలో పేర్కొన్నారు.
అలాగే, అభిమాని తన చెంపలు గిల్లడంపై కూడా రచితా రామ్ చాలా పాజిటివ్‌గా స్పందించారు. "వాళ్లు చెడు ఉద్దేశంతో అలా చేయలేదు. ప్రేమగా చిన్న పిల్లల్ని తాకినట్లు ఆప్యాయంగా తాకారు. అందులో తప్పేం లేదు. అందుకే నేను కొప్పడలేదు. అది బ్యాడ్ టచ్ అయ్యుంటే నేను కచ్చితంగా ఖండించేదాన్ని" ప్రెస్ మీట్‌లో రచితా రామ్ చెప్పుకొచ్చారు.
'కూలీ' చిత్రంతో తమిళంలోకి గ్రాండ్ ఎంట్రీ
కాగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'కూలీ' ద్వారా రచితా రామ్ కోలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆమె పోషించిన 'కల్యాణి' పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్, మీమ్స్‌పై కూడా ఆమె సానుకూలంగా స్పందించిన తీరు అందరిని ఆకట్టుకుంది.
"కూలీ చిత్రంలో నా కల్యాణి పాత్రకు వస్తున్న స్పందన చూసి ఎంతో సంతోషిస్తున్నా. నన్ను ఆదరించిన మీడియాకు, సమీక్షకులకు, చివరికి మీమ్ క్రియేటర్లు, ట్రోలర్లకు నా ధన్యవాదాలు" అని రచితా రామ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.