...
...
Next Story

Dhurandhar 2 First Review: ధురంధర్ 2 చూశాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి, ఊహకు అందని అద్భుతం- డైరెక్టర్ భార్య ఫస్ట్ రివ్యూ

Dhurandhar 2 The Revenge First Review By Yami Gautam: రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) పై దర్శకుడి భార్య, హీరోయిన్ యామీ గౌతమ్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూశాక తాను ఎంతటి ఉద్వేగానికి లోనయ్యారో వివరిస్తూ ధురంధర్ 2పై ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

Published on: Feb 28, 2026, 11:05:40 IST
Advertisement

భారతీయ చలనచిత్ర రంగంలో 2026లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘ధురంధర్ 2’ ఒకటి. రణ్‌వీర్ సింగ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ రూపొందిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ గురించి తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అతిథి పాత్రలో కనిపిస్తారని

ధురంధర్ 2 చూశాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి, ఊహకు అందని అద్భుతం- డైరెక్టర్ భార్య ఫస్ట్ రివ్యూ
ధురంధర్ 2 చూశాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి, ఊహకు అందని అద్భుతం- డైరెక్టర్ భార్య ఫస్ట్ రివ్యూ

ధురంధర్ 2 ది రివేంజ్ సినిమాలో డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య, హీరోయిన్ యామీ గౌతమ్ అతిథి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న యామీ గౌతమ్ ధురంధర్ 2 మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

యామీ గౌతమ్ రివ్యూ

యామీ గౌతమ్ ఇప్పటికే ‘ధురంధర్ 2’ చూశారట. సినిమా చూశాక తన అనుభూతిని పంచుకుంటూ ధురంధర్ ది రివేంజ్ సినిమాపై డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య యామీ గౌతమ్ రివ్యూ ఇచ్చారు.

కళ్లలో నీళ్లు తిరిగాయి.. మాటలు రాలేదు!

"నేను ఇప్పటికే ధురంధర్ 2 చూశాను. ఇది ఒక అసాధారణమైన చిత్రం. సినిమా చూశాక నేను చాలా ఎమోషనల్ అయ్యాను. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో నేను ఫ్లైట్ ఎక్కాల్సి ఉండటంతో ఆదిత్యతో ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ ప్రయాణం పొడవునా ఆ సినిమా గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. చివరికి విమానం దిగాక ఆదిత్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఊహించలేనంత గొప్ప అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది" అని యామీ గౌతమ్ వివరించారు.

ప్రాణాన్ని పణంగా పెట్టి

మార్చి 19న మీ సినిమా ఏదైనా విడుదలవుతోందా? అని యామీ గౌతమ్‌ని ధురంధర్ 2లో నటించడంపై ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్నించగా.. ఆమె చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు.

"ధురంధర్ చిత్రానికి సంబంధించిన ఏ ప్రధాన సమాచారమైనా ఆదిత్యనే స్వయంగా వెల్లడిస్తారు. అందరిలాగే ఆ రోజు నాకు కూడా సినిమా హాల్‌లో ఒక ఇంపార్టెంట్ అపాయింట్‌మెంట్ ఉంది. అక్కడే మిమ్మల్ని కలుస్తాను" అని చెబుతూ తన అతిథి పాత్రపై వస్తున్న వార్తలను ధృవీకరించకుండానే సస్పెన్స్ మెయింటైన్ చేశారు యామీ గౌతమ్.

బాక్సాఫీస్ రికార్డుల వేట

ఇదిలా ఉంటే, మొదటి భాగం ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. దాంతో హిందీ చిత్ర పరిశ్రమలో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

మార్చి 19న సందడి

ఇప్పుడు అదే ఊపుతో వస్తున్న సీక్వెల్ ‘ధురంధర్ 2’ లో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ హై-ఓల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks