...
...
Next Story

సాంగ్ వాడినందుకు ఇళయరాజా కేసు వేశారా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ.. చిరంజీవి పేరు చెప్పాం, ఆ ప్రమాదం లేదంటూ!

మెగాస్టార్ చిరంజీవి, నయన తార హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న క్రమంలో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఇళయరాజా సాంగ్ వాడినందుకు కేసు వేశారా అనే ప్రశ్నకు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

Published on: Jan 14, 2026, 13:55:47 IST
Advertisement

మెగాస్టార్ చిరంజీవి, లేడి సూపర్ స్టార్ నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో మెరిశాడు.

మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్

సాంగ్ వాడినందుకు ఇళయరాజా కేసు వేశారా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ.. చిరంజీవి పేరు చెప్పాం, ఆ ప్రమాదం లేదంటూ!
సాంగ్ వాడినందుకు ఇళయరాజా కేసు వేశారా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ.. చిరంజీవి పేరు చెప్పాం, ఆ ప్రమాదం లేదంటూ!

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మూవీ బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా తొలి రోజే వరల్డ్ వైడ్‌గా రూ. 84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు.

ఇళయరాజా సుందరి సాంగ్

ఈ నేపథ్యంలో తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌లో సినిమాలో ఇళయరాజా సుందరి సాంగ్ వాడినందుకు ఆయన కేసు వేశారా అని జర్నలిస్ట్ ఓ ప్రశ్న వేశారు. దానికి అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

దళపతి మూవీలోనిది

"ఇళయరాజా గారు. ఈ సినిమాలో ఆయనది ఒక బ్యూటిపుల్ సాంగ్. దళపతి మూవీలోనిది సుందరి సాంగ్. చిరంజీవి గారు, నయన తార గారి లవ్ ట్రాక్‌లో చాలా బాగా యూజ్ చేసుకున్నాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్‌లాగా అనిపించింది నాకు అయితే. నేను చేసిన కథల్లో. చాలా క్యూట్‌గా ఉంటుంది" అని అనిల్ రావిపూడి అన్నారు.

కేసు వేసేస్తున్నారంటూ

"మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు. అంత గొప్ప మ్యూజిషియన్, మహానుభావుడి దగ్గరికి వెళ్లి.. సర్ మీ పాటను మేము ఇలా ఉపయోగించుకుందామనుకుంటున్నాం. మీరు మాకు పర్మిషన్ ఇస్తారా అని ఆయన్ను ఒక మాట అడిగితే.. ఆయన హ్యాపీగా ఒప్పుకుని దానికి ఏం చేయాలో మాట్లాడుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేసి చేయొచ్చు" అని అనిల్ రావిపూడి వివరించారు.

చిరంజీవి పేరు చెప్పి

"మేము ఏం చేశామంటే సింపుల్. మా ప్రొడ్యూసర్స్ వెళ్లి ఆయన్ను కలిశారు. కలిసి ఇలా మేము చిరంజీవి గారి సినిమాలో యూజ్ చేసుకుందామనుకుంటున్నాం అన్నారు. యూజ్ చేసుకోండి అన్నారు.. అయిపోయింది. ప్రాసెస్ నీట్‌గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు. మిగతా సినిమాల ప్రాసెస్ గురించి నాకు తెలియదు" అని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

ఆ ప్రమాదం లేదు

"మనోళ్లు చక్కగా వెళ్లి అడిగారు. ఆయన చక్కగా దానికి మాకు ఒప్పుకుని పర్మిషన్ ఇచ్చారు. మాకు ఆ ప్రమాదం (కేసు వేసే) లేదు" అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe