Anurag Kashyap Wedding With Shubhra Shetty: బాలీవుడ్‌లో తనదైన వినూత్న సినిమాలతో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వ్యక్తిగత జీవితం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. గత పదేళ్లుగా శుభ్రా శెట్టితో డేటింగ్‌లో ఉన్న ఆయన, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమ బంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పెళ్లిపై నమ్మకం లేదు.. ఆమెతో ఉంటే చాలు!

ప్రధానంగా వీరిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసంపై సోషల్ మీడియాలో తరచూ వచ్చే విమర్శలు, పెళ్లి ప్రణాళికలపై ఆయన మనసు విప్పి మాట్లాడారు. ప్రస్తుతం 53 ఏళ్ల వయసులో ఉన్న అనురాగ్ కశ్యప్.. 30 సంవత్సరాల ఏజ్ గల శుభ్రాతో పెళ్లి ఆలోచన ఉందా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆమెకు పెళ్లిపై పెద్దగా నమ్మకం లేదని తెలిపారు.
"నాకు ఆమెతో కలిసి ఉండటమే ముఖ్యం. దానికి ఏది అవసరమైతే అది చేస్తాను. ఆమెకు పెళ్లిపై నమ్మకం లేదు. కానీ మా బంధానికి ఓ ట్యాగ్ ఇవ్వడానికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. వయసు పైబడే కొద్దీ ఒక రకమైన అభద్రతా భావం వస్తుంది. నాకంటే చిన్నదైన, నేను ఎంతగానో ప్రేమించే వ్యక్తి కంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలనేదే నా ఆశ" అని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.
"ఆమె వచ్చాకే చావంటే భయం వేసింది"
తమ మధ్య ఉన్న ప్రేమబంధం దక్కడం తన అదృష్టమని, ఈ అనుబంధాన్ని ఏమాత్రం కోల్పోవడం తనకు ఇష్టం లేదని అనురాగ్ చెప్పుకొచ్చారు. శుభ్రాతో ప్రేమలో పడకముందు తన జీవితం ఎలా ఉండేదో అనురాగ్ గుర్తుచేసుకున్నారు. ఒకసారి శుభ్రా సరదాగా ప్రేమలో పడటం తన జీవిత లక్ష్యాల్లో ఒకటని, అది నెరవేరింది కాబట్టి ఇక చనిపోయినా బాధలేదని అన్నప్పుడు అనురాగ్ కన్నీళ్లు పెట్టుకున్నారట.
"ఆమెను కలవకముందు నాకు చావంటే అసలు భయమే లేదు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినా పట్టించుకునేవాడిని కాదు. కానీ మొదటిసారి నా జీవితంలో బతకడానికి ఒక బలమైన కారణం దొరికింది" అని అనురాగ్ శుభ్రాతో అన్నట్లు ఆమె వెల్లడించారు.
వయసు తేడాతో వచ్చిన ఇబ్బందులు
{{/usCountry}}"ఆమెను కలవకముందు నాకు చావంటే అసలు భయమే లేదు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినా పట్టించుకునేవాడిని కాదు. కానీ మొదటిసారి నా జీవితంలో బతకడానికి ఒక బలమైన కారణం దొరికింది" అని అనురాగ్ శుభ్రాతో అన్నట్లు ఆమె వెల్లడించారు.
వయసు తేడాతో వచ్చిన ఇబ్బందులు
{{/usCountry}}గతంలో తాము తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నామని, ఒక దశలో తాను చాలా ఆత్మరక్షణలో పడిపోయానని అనురాగ్ చెప్పారు. "కాలం గడుస్తున్న కొద్దీ నాకు వయసు పైబడుతోంది, కానీ శుభ్రా ముఖంలో ఆ తేడా అస్సలు కనిపించదు. ఆమె వయసును పట్టించుకోదు. నేను కూడా ఆలోచించను. ఇప్పటికీ ఆమె చిన్నదానిలాగే కనిపిస్తుంది. ఆమె పక్కన నేను పెద్దవాడిగా కనిపించినప్పుడు మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించేది" అని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చారు.
అయితే కాలక్రమేణా అలాంటి విమర్శలను పట్టించుకోవడం మానేశామని, తన వయసు ఎంత పెరుగుతున్నా తనలాగే ఉంటానని అనురాగ్ కశ్యప్ అన్నారు. అయితే, అనురాగ్ కశ్యప్ నిర్మించిన 'ఫాంటమ్ ఫిల్మ్స్' నిర్మాణ సంస్థలో శుభ్రా శెట్టి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు.
అనురాగ్ కశ్యప్ పెళ్లిళ్లు, విడాకులు
ఆ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 2015లో మొదటిసారి కలిసి కనిపించిన ఈ జంట, 2018లో తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు ఎడిటర్ ఆర్తీ బజాజ్‌ను అనురాగ్ 1997లో వివాహం చేసుకుని 2009లో విడిపోయారు. వీరికి అలియా కశ్యప్ అనే కుమార్తె ఉంది.
ఆ తర్వాత 2011లో నటి కల్కి కోచ్లిన్‌ను పెళ్లి చేసుకుని 2015లో విడాకులు తీసుకున్నారు. వీరికి దేవ్ డీ సినిమా సమయంలో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకున్న రెండేళ్లకే విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం శుభ్రాతో సహజీవనం చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.