...
...
Next Story

ఈ కొత్త తరంలో చిరంజీవికి బాగా నచ్చిన హీరో అతను.. డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కొల్లి కామెంట్స్

టాలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అనగనగా ఒక రాజు ఒకటి. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా డాకు మహరాజ్ డైరెక్టర్ బాబీ కొల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jan 31, 2026, 15:07:17 IST
Advertisement

సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది.

100 కోట్లకు పైగా గ్రాస్

ఈ కొత్త తరంలో చిరంజీవికి బాగా నచ్చిన హీరో అతను.. డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కొల్లి కామెంట్స్
ఈ కొత్త తరంలో చిరంజీవికి బాగా నచ్చిన హీరో అతను.. డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కొల్లి కామెంట్స్

డైరెక్టర్ మారి దర్శకత్వం వహించిన అనగనగా ఒక రాజు సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జనవరి 30) సాయంత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా దిల్ రాజు, బాబీ కొల్లి

ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, డాకు మహారాజ్, వాల్తేరు వీరయ్య సినిమాల దర్శకుడు బాబీ కొల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంతటి అద్భుతమైన చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ వేడుకలో జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ కొల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

టైమింగ్ బాగుండి అయిన హీరో

బాబీ కొల్లి మాట్లాడుతూ.. "టైమ్ బాగుంటే హీరో అవుతారు అంటుంటారు. కానీ, టైమింగ్ బాగుండి హీరో అయినవాడు నవీన్ పొలిశెట్టి. ఏడాది క్రితం నవీన్‌కి పెద్ద యాక్సిడెంట్ అయ్యి, తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు కూడా నాతో మాట్లాడుతూ.. నాకు మంచి రచయితలు కావాలి, బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి అంటున్నాడు. సినిమా అంటే అంత తపన తనకు" అని అన్నారు.

ఎనర్జీ వెనుక కష్టం, కసి

"ఇటీవల నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన నవీన్ గురించి మాట్లాడారు. నవీన్ నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా బాగుంది అంట కదా, ఎంత ఎనర్జీ ఉంటుంది ఆ అబ్బాయికి, ఈ కొత్త తరంలో నాకు (చిరంజీవి) బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పారు" అని బాబీ తెలిపారు.

సక్సెస్‌లో ఉండి కూడా

"చిరంజీవి గారు తన సినిమా సక్సెస్‌లో ఉండి కూడా నవీన్ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేశారు. నవీన్ పోలిశెట్టి మెగాస్టార్ చిరంజీవి గారి మెప్పు పొందాడు. దర్శకుడు మారికి, చిన్మయికి, చిత్ర బృందం అందరికీ నా శుభాకాంక్షలు" డైరెక్టర్ బాబీ కొల్లి తన స్పీచ్ ముగించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe