...
...
Next Story

Janakiram: క్లాస్‌కి కామెడీ, మాస్‌కి యాక్షన్- తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ బాబీ శిష్యుడు జానకిరామ్

Director Janakiram Marella First Debut Comrade Kalyan: శ్రీవిష్ణు, మహిమా నంబియార్ నటించిన సినిమా కామ్రేడ్ కళ్యాణ్. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన జానకిరామ్ మారెళ్ల మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించారు. వినోదం, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మేళవించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.

Published on: Oct 18, 2026, 14:22:38 IST
Advertisement

Director Bobby Student Janakiram Marella First Debut Hit: తెలుగు చిత్రసీమలో తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకోవడం ఏ దర్శకుడికైనా అరుదైన ఘనత. దర్శకుడు జానకిరామ్ మారెళ్ల 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో ఆ ముచ్చట తీర్చుకున్నారు. మొదటి చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుని టాలీవుడ్ ప్రముఖులు, సినీ ప్రియుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

టైమింగ్‌తో నవ్వించిన కామెడీ మేజిక్

క్లాస్‌కి కామెడీ, మాస్‌కి యాక్షన్- తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ బాబీ శిష్యుడు జానకిరామ్
క్లాస్‌కి కామెడీ, మాస్‌కి యాక్షన్- తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ బాబీ శిష్యుడు జానకిరామ్

సినిమా విజయానికి బలమైన పునాది సహజమైన వినోదం. 'కామ్రేడ్ కళ్యాణ్'లో జానకిరామ్ చూపించిన కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వుల పూలు పూయించింది. అనవసరపు హడావుడి లేకుండా, కేవలం సంభాషణలతోనే ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకునేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు.

బాబీ శిష్యుడిగా యాక్షన్ సీక్వెన్స్‌లలో సత్తా

దైనందిన జీవితంలో చూసే సాధారణ ఘట్టాల నుంచే వినోదాన్ని రాబట్టడం ఈ దర్శకుడి ప్రత్యేకతను ఎలుగెత్తి చాటింది. కేవలం వినోదానికే పరిమితం కాకుండా, కమర్షియల్ హంగులను జోడించడంలో జానకిరామ్ తన మార్కు చూపించారు. తన గురువు, ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి మేకింగ్ శైలిని ఆదర్శంగా తీసుకుని యాక్షన్ సీక్వెన్స్‌లను భారీ స్థాయిలో డిజైన్ చేశారు.

క్లాస్‌కి కామెడీ, మాస్‌కి యాక్షన్

తెరపై ప్రతీ ఫ్రేమ్‌ను రిచ్‌గా చూపిస్తూ, యాక్షన్ లవర్స్ మైమరిచేలా మాస్ ఎలిమెంట్స్ పండించారు. ఒకవైపు క్లాస్ ప్రేక్షకులకు నచ్చే కామెడీ, మరోవైపు మాస్ ప్రేక్షకులను ఊపేసే యాక్షన్ మేళవించి కథనాన్ని వేగంగా ముందుకు నడిపించారు.

భవిష్యత్తు ప్రాజెక్ట్‌లపై పెరిగిన అంచనాలు

మాస్, క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథనాలను ఎంచుకోవడంలో జానకిరామ్ మారెళ్ల దిట్ట అని నిరూపించుకున్నారు. మొదటి సినిమాకే ఈ స్థాయిలో గుర్తింపు రావడంతో పరిశ్రమలో ఆయన తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే తరహా మేకింగ్ విజన్‌ కొనసాగిస్తే టాలీవుడ్‌లో అగ్ర దర్శకుల సరసన నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

హీరో హీరోయిన్లుగా శ్రీవిష్ణు, మహిమా నంబియార్

కామ్రేడ్ కళ్యాణ్ కథ విషయానికొస్తే.. కళ్యాణ్ అనే పాత్రలో శ్రీ విష్ణు నటించారు. ఊరిలో ఒక టాకీస్ నడుపుకుంటూ కాలం గడిపే కళ్యాణ్ తల్లి హీరో బాలకృష్ణకు హార్డ్‌కోర్ ఫ్యాన్. జీవితం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో, ఒడిశాకు చెందిన ఒక అమ్మాయితో కళ్యాణ్ లవ్‌లో పడతాడు.

కళ్యాణ్ గురించి తెలిసిన రహస్యం ఏంటీ?

మరోవైపు కళ్యాణ్ కోసం పోలీసులు వెతుకుతుంటారు. ఆ తర్వాత ఏమైంది, కళ్యాణ్ గురించి తెలిసిన రహస్యం ఏంటీ అనేదే మిగతా కథ. ప్రస్తుతం థియేటర్లలో నవ్వులతో అలరిస్తోంది కామ్రేడ్ కళ్యాణ్ సినిమా.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks