...
...
Next Story

Raakaasa: ముందుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం కథ అనుకున్నాం, అందులోనే తేడా ఉంటుంది.. రాకాస డైరెక్టర్ మానస శర్మ కామెంట్స్

Director Manasa Sharma On Raakaasa Movie And Netflix OTT: సంగీత్ శోభన్ సోలో హీరోగా వస్తున్న తెలుగు సినిమా రాకాస. హారర్ కామెడీ ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి ఓటీటీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించారు. కొణిదెల నిహారిక నిర్మాతగా చేసిన రాకాస విశేషాలను మానస శర్మ పంచుకున్నారు.

Published on: Mar 24, 2026, 19:56:21 IST
Advertisement

మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా రాకాస. హారర్ కామెడీ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీ సిరీస్ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించారు. రాకాసలో సంగీత్ శోభన్‌కు జోడీగా హీరోయిన్ నయన్ సారిక నటించింది.

మెగా డాటర్ నిహారిక కొణిదెల

ముందుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం కథ అనుకున్నాం, అందులోనే తేడా ఉంటుంది.. రాకాస డైరెక్టర్ మానస శర్మ కామెంట్స్
ముందుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం కథ అనుకున్నాం, అందులోనే తేడా ఉంటుంది.. రాకాస డైరెక్టర్ మానస శర్మ కామెంట్స్

పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మాతలగా నిర్మించిన రాకాస సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రాకాస సినీ ఇంట్రెస్టింగ్ విశేషాలను డైరెక్టర్ మానస శర్మ పంచుకున్నారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి?

మానస శర్మ : మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తరువాత ఓటీటీ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా పని చేశాను. ఆ తరువాత మరో ‘బెంచ్ లైఫ్’ అనే ఓటీటీ సిరీస్‌ని చేశాను. ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్. ఫాంటసీ, అడ్వెంచర్‌లతో తీసిన ‘రాకాస’ చాలా కొత్తగా ఉండబోతుంది.

‘రాకాస’లో ప్రధాన అంశం ఏంటి?

మానస శర్మ : ‘రాకాస’ని ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ జోనర్‌లో తీశాం. ఇప్పటికే అందరూ మా టీజర్‌ని చూసి ఉంటారు. త్వరలోనే రాకాస ట్రైలర్ రానుంది. అప్పుడు మా సినిమా గురించి ఇంకా చాలా క్లియర్‌గా తెలుస్తుంది. కామెడీని ప్రధాన అంశంగా, కొద్దిగా హారర్ ఎలిమెంట్స్‌తో పూర్తి ఫాంటసీ, అడ్వెంచర్‌గా ఈ మూవీని తీశాం.

సంగీత్ శోభన్ ఈ కథలోకి ఎలా వచ్చారు?

మానస శర్మ : ఓటీటీ వెబ్ సిరీస్‌కి, సినిమాకి ఒకే రకమైన ఛాలెంజ్ ఉంటుంది. మేకింగ్ ఒకేలా ఉంటుంది.. కానీ, రైటింగ్‌లోనే తేడా ఉంటుంది. షూటింగ్ పరంగా, చిత్రీకరణ సమయంలో ఎలాంటి తేడాలుండవు. ఈ సినిమా అవుట్ పుట్ నిహారిక గారికి నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. ఈ కథని పదిహేను నిమిషాలు నెరేట్ చేసిన తరువాత నిహారిక గారికి చాలా కాన్పిడెంట్ వచ్చేసి ఓకే చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe