సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం 'ఇట్స్ ఓకే గురు'. మణికంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఇట్స్ ఓకే గురు ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్

అయితే, ఇట్స్ ఓకే గురు సినిమా డిసెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఇట్స్ ఓకే గురు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అతిథిగా డైరెక్టర్ మెహర్ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
బడ్జెట్‌తో సంబంధం లేకుండా
డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ.. "నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకి పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాను. బడ్జెట్‌తో సంబంధం లేకుండా సబ్జెక్ట్‌ని నమ్మి చేసిన సినిమా అది. ఆ సినిమా తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ గారు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు" అని అన్నారు.
మంచి సబ్జెక్ట్ ఉన్నట్టు
"ఈ సినిమా చూస్తుంటే నాకు మంచి సబ్జెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ మణికంఠ, టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. చిన్న సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు మెహర్ రమేష్.
ఓటీటీ వెబ్ సిరీస్ కూడా చేయాలని
"ఇందులో ఒక సాంగ్ నాకు చాలా నచ్చింది. మణికంఠ తీసిన కొత్త పెళ్లికూతురు షార్ట్ ఫిల్మ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాని కూడా చాలా కష్టపడి మంచి సబ్జెక్టు రాసుకొని తీసాడు. మేము కలిసి త్వరలోనే ఒక ఓటీటీ వెబ్ సిరీస్ కూడా చేయాలని ఉంది" అని తన మనసులో మాట చెప్పారు డైరెక్టర్ మెహర్ రమేష్.
మరో సినిమా రావాలని
{{/usCountry}}"ఇందులో ఒక సాంగ్ నాకు చాలా నచ్చింది. మణికంఠ తీసిన కొత్త పెళ్లికూతురు షార్ట్ ఫిల్మ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాని కూడా చాలా కష్టపడి మంచి సబ్జెక్టు రాసుకొని తీసాడు. మేము కలిసి త్వరలోనే ఒక ఓటీటీ వెబ్ సిరీస్ కూడా చేయాలని ఉంది" అని తన మనసులో మాట చెప్పారు డైరెక్టర్ మెహర్ రమేష్.
మరో సినిమా రావాలని
{{/usCountry}}"ఈ సినిమా హీరో చరణ్‌లో చాలా మంచి ఈజ్ ఉంది. తన పర్ఫామెన్స్ నాకు చాలా నచ్చింది. మణికంఠ తన కాంబినేషన్‌లో మరో సినిమా రావాలని కోరుకుంటున్నాను" అని దర్శకుడు మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.
చాలా పెద్ద జర్నీ
డైరెక్టర్ మణికంఠ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. మెహర్ రమేష్ గారికి ధన్యవాదాలు. ట్రైలర్ మీ అందరికి నచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇది చాలా పెద్ద జర్నీ. ఈ జర్నీలో నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అని అన్నారు.
ఇది ఒక మంత్ర
"మా హీరో హీరోయిన్స్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి వర్క్ చేశారు. అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇట్స్ ఓకే గురు అనేది ఒక మంత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా ఇట్స్ ఓకే అని ముందుకెళ్లిపోతే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. అదే ఈ సినిమాలో ఉంది" అని దర్శకుడు మణికంఠ తెలిపారు.
మన మనసుతో వైవా చేసుకుంటే
"మన మనసుతో మనం వైవా చేసుకుంటే ఎలా ఉంటుందో అదే మా సినిమా. అందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది" అని పేర్కొన్నారు ఇట్స్ ఓకే గురు డైరెక్టర్ మణికంఠ.