డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ కామెడీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో బ్యూటిపుల్ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. ఇప్పటికే విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
డైరెక్టర్ పవన్ కామెంట్స్
ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా భర్త మహాశయలకు విజ్ఞప్తి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పవన్ బాసంసెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. "నేను రవితేజ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన నాకు ఇన్సిపిరేషన్ (స్ఫూర్తి). రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ఏ డ్రింక్ లేదు. ఈ సినిమా చాలా మంచి ఫన్ రైడ్" అని అన్నారు.
ఆ తపనతో చేశారు
"నిర్మాత సుధాకర్ గారు రాజీ పడకుండా సినిమాని నిర్మించే ప్రొడ్యూసర్. కచ్చితంగా కిషోర్ గారు బ్లాక్ బస్టర్ కొట్టాలని తపనతో పని చేశారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ యూనిట్ అందరూ పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది" అని దర్శకుడు పవన్ బాసంసెట్టి పేర్కొన్నారు.
ఇదే ఈవెంట్‌లో హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. డైరెక్టర్ హరీశ్ శంకర్ గారిని ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాలో నేను చేసిన బాలమణి క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా కొత్తదనం ఆడియన్స్ ఫీల్ అవుతారు" అని తెలిపింది.
రవితేజతో రెండో సినిమా
{{/usCountry}}ఇదే ఈవెంట్‌లో హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. డైరెక్టర్ హరీశ్ శంకర్ గారిని ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాలో నేను చేసిన బాలమణి క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా కొత్తదనం ఆడియన్స్ ఫీల్ అవుతారు" అని తెలిపింది.
రవితేజతో రెండో సినిమా
{{/usCountry}}"మా నిర్మాత సుధాకర్ గారు సినిమాని అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమాలోని పాటలన్నీ చాలా బాగా హిట్ అయ్యాయి. రవితేజ గారితో ఇది నాకు రెండో సినిమా. ఆయనతో నటించడం చాలా ఆనందాన్నిచ్చింది డైరెక్టర్ గారు సినిమాని అద్భుతంగా తీశారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది" అని ధీమా వ్యక్తం చేసింది హీరోయిన్ డింపుల్ హయాతి.
మూవీ డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను" అని చెప్పారు.
కెమిస్ట్రీ అద్భుతం
"భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో పనిచేస్తున్న ప్రతి యాక్టర్ వాళ్ల మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. జనవరి 13న తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను" అని కోరారు డైరెక్టర్ కిషోర్ తిరుమల.