...
...
Next Story

Killer: గుప్పెడంత మనసు జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా కిల్లర్- క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీతో పోల్చారన్న దర్శకుడు,నటుడు పూర్వజ్

Director Poorvaj About Jyothi Killer Movie: గుప్పెడంత మనసు సీరియల్ నటి జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా కిల్లర్. దర్శకత్వం, నిర్మాత, నటుడు వంటి మూడు బాధ్యతలను చేపట్టారు పూర్వజ్. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానున్న కిల్లర్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు పూర్వజ్.

Published on: Oct 27, 2026, 22:42:42 IST
Advertisement

Director Poorvaj About Jyothi Poorvaj Killer Movie: స్టార్ మాలో సూపర్ హిట్‌గా దూసుకుపోయిన గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా అలరించిన నటి జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్లిల్లర్ మూవీ కిల్లర్. ఈ సినిమాకు పూర్వజ్ దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాలో ప్రధాన పాత్ర కూడా పోషించారు.

అక్టోబర్ 30న కిల్లర్ రిలీజ్

గుప్పెడంత మనసు జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా కిల్లర్- క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీతో పోల్చారన్న దర్శకుడు,నటుడు పూర్వజ్
గుప్పెడంత మనసు జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా కిల్లర్- క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీతో పోల్చారన్న దర్శకుడు,నటుడు పూర్వజ్

వీరిద్దరితోపాటు కిల్లర్ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాను పూర్వాజ్, పద్మనాభ రెడ్డి ఏ నిర్మించగా.. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

"కిల్లర్" సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఓవర్సీస్‌లో "కిల్లర్" మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. తాజాగా ఈ రోజు (అక్టోబర్ 27) జరిగిన ఇంటర్వ్యూలో కిల్లర్ మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వజ్.

రక్తం చూస్తే నా కళ్లు తిరుగుతాయి

- "కిల్లర్" రిచ్ కంటెంట్ ఉన్న సినిమా. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. యు సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చూశాక సెన్సార్ వాళ్ల మొహాలు ఆహ్లాదకరంగా కనిపించాయి. అంటే మా మూవీ వారికి నచ్చిందని అనుకున్నాం. మా సినిమాలో బ్లడ్ షెడ్ లేదు. రక్తం చూస్తే నాకే కళ్లు తిరుగుతాయి.

-కథలో హింస ఉన్నా, అది పాత్రలు ఎదుర్కొనే దాంట్లో కనిపించాలి గానీ పాత్రలను చిత్రహింసలు పెట్టినట్లు చూపించడం నాకు నచ్చదు. వాంపైర్ పాత్రను కూడా అలాగే అందరు చూసేలా ట్రీట్ చేశాం. మూవీలో టెర్రరిస్ట్ పాత్ర పది నిమిషాలు కనిపిస్తుంది మళ్లీ కనిపించదు. స్పై, వాంపైర్ పాత్రలు కూడా అలాగే ఉంటాయి. మళ్లీ ఆ పాత్రలు ఎక్కడా కనిపించవు.

క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీతో పోల్చారు

-కొన్నేళ్ల కిందట నేను స్క్రూడ్ అనే కాన్సెప్ట్‌తో కథ రాసుకున్నాను. అది అప్పటికి నాకున్న రిసోర్సెస్‌కు రూపొందించడం కుదరలేదు. అదే స్క్రిప్ట్‌ను ఇప్పుడున్న ఆడియెన్స్ టేస్ట్‌కు తగినట్లు మార్పులు చేసి కిల్లర్ సినిమా రూపొందించాను. విజువల్‌గా ప్రేక్షకులు తెరపై చూసే ఏదైనా మంచి క్వాలిటీతో ఉండాలనేది మేకర్‌గా నా అభిప్రాయం. సినిమాకు కంప్లీట్ స్క్రిప్ట్ అయ్యాకే మిగతా వాటి గురించి ఆలోచిస్తా. ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీ.

మూడు బాధ్యతలు తీసుకున్నా

-కిల్లర్ సినిమాలో ప్రతి పాత్ర ఆర్ లెటర్ తోనే స్టార్ట్ అవుతాయి. ప్రాజెక్ట్ రూట్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంగా ఈ సినిమా ఉంటుంది. హీరోయన్ జ్యోతి పూర్వజ్ చేసిన రక్తిక, రనైన, రియా..ఇలా పేర్లు ఆర్‌తో ఉంటాయి. ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాత, నటుడిగా మూడు బాధ్యతలు తీసుకున్నాను.

-ఏ పని చేస్తున్నప్పుడు ఆ బాధ్యతనే నిర్వర్తించాను. చిత్ర పరిశ్రమలో నాకున్న అనుభవం ఈ మూడు రోల్స్ ప్లే చేసేలా ఉపయోగపడ్డాయి. ఇంకో ఆరేడు క్రాఫ్ట్స్ డీల్ చేయాలన్నా చేస్తాను. అది సినిమా మేకింగ్ మీద నాకున్న ప్యాషన్.

డిఫరెంట్ రోల్స్‌లో ఆకట్టుకుంటారు

-జ్యోతి పూర్వజ్ కిల్లర్ సినిమాలో పూర్తిగా కొత్తగా చూస్తారు. ఆమె డిఫరెంట్ రోల్స్‌లో ఆకట్టుకుంటారు. సింగిల్ టేక్‌లో యాక్షన్ సీక్వెన్సులు చేశారు జ్యోతి. ఆమె ప్రతి పాత్రకు తగినట్లు మేకోవర్ అయ్యారు. ఆడియెన్స్ ఆమెను తెరపై చూస్తూ థ్రిల్ అవుతారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks