Ameer Log Press Meet Director Ramana Reddy On Malayalam Movies: టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ హైదరాబాదీ చిత్రం అమీర్ లోగ్. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ముగ్గురు యంగ్ హీరోలు నటించిన ఈ సినిమాలో వేధా జలంధర్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు.
రానా దగ్గుబాటి సంస్థ నుంచి విడుదల

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తొలి చిత్రంగా అమీర్ లోగ్‌ని నిర్మించారు. అలాగే, ఈ మూవీకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' విడుదల చేస్తోంది.
అమీర్ లోగ్ ప్రెస్ మీట్
అమీర్ లోగ్ సినిమాను తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా అంటే రేపు థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో బుధవారం (ఆగస్ట్ 19) అమీర్ లోగ్ మూవీ యూనిట్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రమణా రెడ్డి, నిర్మాత మాధవి రెడ్డి, హీరో హరి, నటుడు యోగి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కచ్చితంగా హిట్ బొమ్మ
దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ .. "‘అమీర్ లోగ్’ సినిమాని ఇప్పటికి చాలా సార్లు చూశాం. కచ్చితంగా హిట్టు బొమ్మ. ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు. అలాంటి ఓ గొప్ప అటెంప్ట్ నేను చేశాను. ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే మేం హిట్ కొట్టేశాం, మేం అనుకున్నది సాధించేశాం అని అర్థమైంది" అని అన్నారు.
మలయాళంలో తీసినట్లుగా రావడం లేదంటారు
"మలయాళంలో తీసినట్టుగా మన దగ్గర రావడం లేదు అని అంటుంటారు కదా.. ఇకపై హైదరబాద్ ఎరా స్టార్ట్ అయింది. ఆగస్ట్ 21న నైజాంలో స్టార్ట్ అయ్యే సౌండ్.. అన్ని వుడ్‌లకు (అన్ని చిత్రపరిశ్రమలకు అన్న అర్థంలో) చేరుకుంటుంది" అని దర్శకుడు రమణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఒక ఎమోషన్‌ను ఇంటికి తీసుకెళ్తారు
{{/usCountry}}"మలయాళంలో తీసినట్టుగా మన దగ్గర రావడం లేదు అని అంటుంటారు కదా.. ఇకపై హైదరబాద్ ఎరా స్టార్ట్ అయింది. ఆగస్ట్ 21న నైజాంలో స్టార్ట్ అయ్యే సౌండ్.. అన్ని వుడ్‌లకు (అన్ని చిత్రపరిశ్రమలకు అన్న అర్థంలో) చేరుకుంటుంది" అని దర్శకుడు రమణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఒక ఎమోషన్‌ను ఇంటికి తీసుకెళ్తారు
{{/usCountry}}"నన్ను ముందు నిలబెట్టి నడిపిస్తున్న నా భర్త రమణ గారికి థాంక్స్. ఆయనే రైటర్, డైరెక్టర్, నిర్మాతగా అన్నీ పనులు చూసుకున్నారు. ఆయన ఈ ‘అమీర్ లోగ్’ సినిమాని అందమైన పెయింటింగ్‌గా తీర్చి దిద్దారు. ఈ సినిమా చూసి బయటకు వెళ్లేటప్పుడు ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక ఎమోషన్‌ను ఇంటికి తీసుకు వెళ్తారు" అని ప్రొడ్యూసర్ మాధవి రెడ్డి చెప్పారు.
ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునేవాళ్లం
హీరో ఎంసీ హరి మాట్లాడుతూ .. "‘అమీర్ లోగ్’ సినిమా నాకు మంచి అవకాశాన్ని, కుటుంబాన్ని, అనుభవాన్ని ఇచ్చింది. రోహిత్ అన్న ఎడిటింగ్ అదిరిపోతుంది. స్మరణ్ అన్న అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. మనోజ్, శశి, నేను కలిసి సెట్‌లో ఎంతో సరదాగా ఉండేవాళ్లం. సెట్‌లో రోజూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునేవాళ్లం" అని అన్నాడు.
థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి
"ఈ జర్నీలో సపోర్ట్ చేసిన సందీప్ అన్న, ఎస్వీకే అన్నకి, మాధవి గారికి, రమణ అన్నకి థాంక్స్. ప్రీమియర్లు వేసిన ప్రతీ చోటా థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఆగస్ట్ 21న కూడా మాకు అదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం" అని హీరో ఎంసీ హరి ఆకాంక్షించారు.
ఏపీలో మంచి రెస్పాన్స్ వచ్చింది
నటుడు యోగి మాట్లాడుతూ .. "హైదరాబాద్ మీద రమణన్న తనకున్న ప్రేమను ఈ ‘అమీర్ లోగ్’ సినిమాతో చూపించబోతోన్నారు. ఏపీలో వేసిన ప్రీమియర్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కరీంనగర్, వరంగల్‌లో వేసిన ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది" అని చెప్పుకొచ్చారు.