Singeetham Srinivasa Rao Sing Geetham Teaser Response: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ దర్శకత్వం వహిస్తున్నారంటేనే అందరిలోనూ ఏదో తెలియని ఉత్కంఠ నెలకొంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తాజాగా విడుదలైన 'సింగ్ గీతం' టీజర్ ఆ ఉత్కంఠను రెట్టింపు చేసింది.
1 నిమిషం 22 సెకన్ల నిడివి

తన పేరులోని పదాలతోనే ఈ చిత్రానికి 'సింగ్ గీతం' అని టైటిల్ పెట్టడం విశేషం. 1 నిమిషం 22 సెకన్ల నిడివి ఉన్న సింగ్ గీతం టీజర్ ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లింది. మ్యూజికల్ ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 11న థియేటర్లలోకి రానుంది.
కథా నేపథ్యం ఏంటి?
ప్రతాప్ అనే యువకుడు ఒక పాత గని ప్రాంతానికి చేరుకోవడంతో ఈ కథ మొదలవుతున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. బంగారం కోసం వెతికే మనుషులు, అక్కడ కనిపించే వింత పరిస్థితుల మధ్య ప్రతాప్ ప్రయాణం ఎలా సాగింది? అభివృద్ధికి, ప్రకృతి పరిరక్షణకు మధ్య నలిగిపోయే ఒక వ్యవస్థలో అతను తీసుకున్న నిర్ణయాలేంటి? అనే పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు.
ట్రెండింగ్‌లో 'యంగ్' మైండ్ సింగీతం
ఇందులో అయాన్, అహల్యా బామ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తులసి, బెనర్జీ, శివనారాయణ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సింగ్ గీతం టీజర్ చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు సింగీతం విజన్‌కు ఫిదా అవుతున్నారు.
"ఈ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన మెదడు (Youngest Mind) నుంచి వచ్చిన అద్భుతం ఇది" అని నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కొనియాడారు. "94 ఏళ్ల వయసులో జెన్-జీ (Gen-Z) దర్శకులకు గట్టి పోటీ ఇస్తున్నారు" అని నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
మరోవైపు, ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన సంగీతంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. డీఎస్పీ నుంచి ఒక పవర్ ఫుల్ కమ్‌బ్యాక్ లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 'కల్కి 2898 ఏడీ' దర్శకుడు నాగ్ అశ్విన్ సమర్పణలో, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం మరో విశేషం.
ప్రయోగాల రారాజు ప్రస్థానం
{{/usCountry}}మరోవైపు, ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన సంగీతంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. డీఎస్పీ నుంచి ఒక పవర్ ఫుల్ కమ్‌బ్యాక్ లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 'కల్కి 2898 ఏడీ' దర్శకుడు నాగ్ అశ్విన్ సమర్పణలో, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం మరో విశేషం.
ప్రయోగాల రారాజు ప్రస్థానం
{{/usCountry}}1972లో 'నీతి నిజాయితీ' సినిమాతో దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినిమాకు ఎన్నో అపురూప చిత్రాలను అందించారు. మూకీ సినిమాగా'పుష్పక విమానం', టైమ్ ట్రావెల్ చిత్రంగా 'ఆదిత్య 369', జానపద కథగా 'భైరవద్వీపం', నవ్వుల పువ్వులు పూయించిన 'బృందావనం' వంటి చిత్రాలు సింగీతం శ్రీనివాసరావు సృజనాత్మకతకు నిదర్శనాలు.
2013లో వచ్చిన 'వెల్‌కమ్ ఒబామా' మూవీ తర్వాత సింగీతం శ్రీనివాసరావు చేసిన ఈ కొత్త ప్రయత్నం టాలీవుడ్ స్థాయిని మరోసారి పెంచుతుందనడంలో సందేహం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సింగీతం శ్రీనివాసరావు 'సింగ్ గీతం' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
ఈ మ్యూజికల్ ఫాంటసీ చిత్రం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
2. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.
3. 'సింగ్ గీతం' చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
4. సింగీతం శ్రీనివాసరావు వయస్సు ఎంత?
ప్రస్తుతం ఆయన వయస్సు 94 ఏళ్లు. ఈ వయస్సులోనూ ఆయన తన అద్భుతమైన పనితీరుతో సినీ రంగాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు.