...
...
Next Story

Im Game Collection: 3 ఏళ్ల తర్వాత మలయాళ సినిమా.. దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Im Game Box Office Collection Day 2: మూడేళ్ల తర్వాత మలయాళంలోకి రీఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా 'ఐయామ్ గేమ్' రెండు రోజుల్లో ఇండయాలో రూ. 10 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. థియేటర్లలో మిశ్రమ స్పందన వస్తోన్న ఐయామ్ గేమ్ సినిమా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Sep 5, 2026, 10:30:20 IST
Advertisement

Im Game 2 Days Worldwide Box Office Collection: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మలయాళ క్రైమ్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఐయామ్ గేమ్'. గురువారం (సెప్టెంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లతో ప్రయాణాన్ని ప్రారంభించింది.

3 ఏళ్ల తర్వాత మలయాళ సినిమా.. దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
3 ఏళ్ల తర్వాత మలయాళ సినిమా.. దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

ఐయామ్ గేమ్ మూవీ టాక్‌లో కొద్దిగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవడంతో రెండో రోజు వసూళ్లలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. అయినప్పటికీ, రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 10 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి పర్వాలేదనిపించింది.

రెండో రోజు బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం ఐయామ్ గేమ్ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 4) రెండో రోజు ఇండియాలో రూ. 4.60 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు సాధించిన రూ. 5.40 కోట్లతో పోలిస్తే వసూళ్లలో దాదాపు 14.8 శాతం తగ్గుదల నమోదైంది.

శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా ప్రదర్శించిన 3145 షోలలో సగటున 37 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు పుంజుకుంటే తప్ప రాబోయే పనిదినాల్లో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం సవాలుగా మారనుంది.

దుల్కర్ గత సినిమాలతో పోలిస్తే ఎలా ఉందంటే?

తెలుగు ప్రేక్షకులకు 'లక్కీ భాస్కర్', 'సీతా రామం' చిత్రాలతో ఎంతో చేరువైన దుల్కర్ సల్మాన్, తన గత సినిమాల ఓపెనింగ్స్‌తో పోల్చి చూస్తే ఈ చిత్రంతో సమంగానే రాణిస్తున్నారు. 2024లో వచ్చిన సంచలన విజయం సాధించిన 'లక్కీ భాస్కర్' మొదటి రెండు రోజుల్లో రూ. 13.90 కోట్లు వసూలు చేయగా, 2025లో వచ్చిన తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం 'కాంత' రూ. 9.35 కోట్లు రాబట్టింది.

రెండో రోజున ఒక్కరోజే ఓవర్సీస్‌లో ఐయామ్ గేమ్ సినిమాకు రూ. 9.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. అందులో ఇండియా నుంచి రూ. 5.35 కోట్లు ఉంటే.. ఓవర్సీస్ ద్వారా రూ. 4 కోట్లు ఉన్నాయి. ఇక రెండు రోజుల్లో ఓవర్సీస్‌లో ఈ సినిమాకు రూ. 8.50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

పోటీగా 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' హవా

బాక్సాఫీస్ రేసులో 'ఐయామ్ గేమ్' చిత్రానికి గిరీష్ ఏడీ దర్శకత్వంలో వచ్చిన 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నివిన్ పోలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ ఓనం కానుకగా వచ్చిన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ చిత్రం 15 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా రూ. 108 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా మొదటి రెండు రోజుల వసూళ్లే రూ. 12.05 కోట్లు కావడం గమనార్హం.

కాన్సెప్ట్ ఏంటి? ఎవరు నటించారు?

నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన 'ఐయామ్ గేమ్' చిత్రాన్ని వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ కలసి నిర్మించారు. ఒక గ్యాంబ్లర్ జీవితంలో జరిగిన ఊహించని సంఘటన అతని బతుకుని ఎలా మలుపు తిప్పింది అనే కథాంశంతో ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు.

ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్, సంయుక్త విశ్వనాథన్, కతీర్, వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. మరి రాబోయే రెండు రోజుల్లో ఐయామ్ గేమ్ సినిమాపై ప్రేక్షకుల ఆదరణ ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe