OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన ఫ్యామిలీ మిస్టరీ డ్రామా- తెలుగులో స్ట్రీమింగ్- అడల్ట్ కంటెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో!
East Of Eden OTT Streaming In Telugu: జాన్ స్టెయిన్‌బెక్ నవల ఆధారంగా తెరకెక్కిన ఓటీటీ సిరీస్ 'ఈస్ట్ ఆఫ్ ఈడెన్' ఇవాళ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఫ్యామిలీ మిస్టరీ డ్రామాతోపాటు అడల్ట్ కంటెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న ఈస్ట్ ఆఫ్ ఈడెన్ తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అదెక్కడో చూద్దాం.
East Of Eden OTT Release In Telugu From Today: హాలీవుడ్ క్లాసిక్ నవలల ఆధారంగా వచ్చే వెబ్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగానే కాకుండా తెలుగు ఓటీటీ ప్రియుల్లోనూ మంచి ఆదరణ ఉంటుంది. గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం మరో ప్రతిష్టాత్మక ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా సిరీస్‌తో ఇవాళ (అక్టోబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

వరల్డ్ వైడ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
ప్రసిద్ధ రచయిత జాన్ స్టెయిన్‌బెక్ 1952లో రాసిన విశిష్ట నవల 'ఈస్ట్ ఆఫ్ ఈడెన్' (East of Eden) ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ లిమిటెడ్ ఓటీటీ సిరీస్ అక్టోబర్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది.
హాలీవుడ్ అగ్ర నటి, 'ఒపెన్‌హైమర్', 'డ్యూన్ 2' చిత్రాల ఫేమ్ ఫ్లోరెన్స్ ప్యూ ఇందులో ప్రధాన పాత్ర పోషించడంతో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ సిరీస్‌పై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఎపిసోడ్‌ల సమాచారం, ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్, కథాంశంపై ఇక్కడ తెలుసుకుందాం.
ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు?
మొత్తం ఏడు ఎపిసోడ్‌లతో ఒకేసారి నెట్‌ఫ్లిక్స్‌లో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ ఓటీటీలోకి వచ్చేసింది. సాధారణంగా వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున విడుదల చేసే విధానానికి స్వస్తి పలికి, బింజ్ వాచింగ్ (Binge-watching) సౌలభ్యాన్ని అందిస్తున్నారు.
గురువారం (అక్టోబర్ 1) ఉదయం నుంచి నెట్‌ఫ్లిక్స్ చందారులు ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇది లిమిటెడ్ సిరీస్ కావడంతో సీజన్ 2 ఉండే అవకాశం లేదని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. అయితే, ఒక్క ఇంగ్లీష్‌లోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం వంటి 4 భాషల్లో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
తరతరాల కుటుంబ కథ.. ఆకట్టుకునే నాటకీయత
అమెరికన్ అంతర్యుద్ధం నాటి నుంచి మొదటి ప్రపంచ యుద్ధం వరకు జరిగే సుదీర్ఘ కాలక్రమంలో ట్రాస్క్ కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కథానాయిక క్యాథీ ఏమ్స్ (ఫ్లోరెన్స్ ప్యూ) జీవితం, ఆమెతో ముడిపడిన ఆడమ్ ట్రాస్క్, చార్లెస్ ట్రాస్క్ అనే సోదరుల అనుబంధం, వైరం ఈ సిరీస్‌కు ప్రధాన బలం.
విశిష్టమైన సినీ వారసత్వం
మంచితనం, చెడు, మానవ నిర్ణయాల వెనుక ఉండే ఘర్షణను ప్రతిబింబిస్తూ ఆధునిక శైలిలో ఈ కథను మలిచారు. ఈ ఓటీటీ సిరీస్ వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ప్రసిద్ధ నటి, రచయిత్రి జో కజాన్ ఈ సిరీస్‌కు షోరన్నర్, స్క్రిప్ట్ రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. 1955లో జేమ్స్ డీన్ కథానాయకుడిగా వచ్చిన 'ఈస్ట్ ఆఫ్ ఈడెన్' దిగ్గజ సినిమాకు దర్శకత్వం వహించిన ఏలియా కజాన్ మనవరాలే జో కజాన్.
హైలెట్‌గా దర్శకత్వం, నటీనటులు
ఈ ఏడు ఎపిసోడ్‌ల సిరీస్‌ను ఇద్దరు ప్రముఖ దర్శకులు తెరకెక్కించారు. మొదటి నాలుగు ఎపిసోడ్‌లను 'లయన్', 'మేరీ మెగ్డలీన్' చిత్రాల దర్శకుడు గార్త్ డేవిస్ రూపొందించగా, మిగిలిన మూడు ఎపిసోడ్‌లను లార్ దే క్లర్‌మాంట్-టోనెరే తెరకెక్కించారు.
ఫ్లోరెన్స్ ప్యూతో పాటు క్రిస్టోఫర్ అబాట్ (ఆడమ్ ట్రాస్క్), మైక్ ఫైస్ట్ (చార్లెస్ ట్రాస్క్), హూన్ లీ, ట్రేసీ లెట్స్, మార్తా ప్లింప్టన్, కియారాన్ హిండ్స్ కీలక పాత్రలు పోషించారు.
అడల్ట్ కంటెంట్ కూడా
కథలోని సంక్లిష్ట భావోద్వేగాలను, క్లాసిక్ డ్రామాను ఇష్టపడే ఓటీటీ వీక్షకులకు ఈ సిరీస్ మంచి వినోదాన్ని అందిస్తు అనడంలో సందేహం లేదు. అలాగే, పేరుకు పీరియాడికల్ ఫ్యామిలీ మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన ఈస్ట్ ఆఫ్ ఈడెన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్‌లో అడల్ట్ కంటెంట్‌తోపాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ యూత్‌ను మెప్పిస్తాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


