...
...
Next Story

ENE Repeat Review: ఈ నగరానికి ఏమైంది 2 రివ్యూ-తరుణ్ భాస్కర్ మార్క్ డైలాగ్స్-విశ్వక్ సేన్, అభినవ్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

Ee Nagaraniki Emaindi Repeat Review And Rating In Telugu: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కల్ట్ హిట్ ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈఎన్‌ఈ రిపీట్ నేడు విడుదలైంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఈ నగరానికి ఏమైంది రిపీట్ రివ్యూలో చూద్దాం.

Published on: Nov 19, 2026, 09:45:11 IST
Advertisement

Ee Nagaraniki Emaindi 2 Review In Telugu And Rating:

ఈ నగరానికి ఏమైంది 2 రివ్యూ-తరుణ్ భాస్కర్ మార్క్ డైలాగ్స్-విశ్వక్ సేన్, అభినవ్ మ్యాజిక్ రిపీట్ అయిందా?
ఈ నగరానికి ఏమైంది 2 రివ్యూ-తరుణ్ భాస్కర్ మార్క్ డైలాగ్స్-విశ్వక్ సేన్, అభినవ్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

టైటిల్: ఈ నగరానికి ఏమైంది రిపీట్

నటీనటులు: విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, జీవన్, కరుణకుమార్, ప్రియదర్శిని రామ్, మహేశ్ భాస్కర్ తదితరులు

దర్శకత్వం: తరుణ్ భాస్కర్

సంగీతం: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్

ఎడిటింగ్: రవితేజ గిరిజాల

నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి

విడుదల తేది: 19 నవంబర్ 2026

ఎనిమిదేళ్ల క్రితం విడుదలై తెలుగు యువతకు ఒక ఎమోషన్‌లా మారిపోయిన సూపర్ హిట్ సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. వివేక్, కౌశిక్, ఉపేంద్ర, కార్తీక్.. ఈ నలుగురు స్నేహితుల పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలో రెఫ్లెక్ట్ అవుతూ మీమ్స్‌గా, రియల్ లైఫ్‌కి దగ్గరైన డైలాగ్స్‌తో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది ఈ నగరానికి ఏమైంది సినిమా.

ఈ నగరానికి ఏమైంది రిపీట్ రివ్యూ

అలాంటి ఈ నగరానికి ఏమైంది సినిమా నుంచి సీక్వెల్ వస్తుందంటే ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమాకు సీక్వెల్‌గా ఈ నగరానికి ఏమైంది రిపీట్ ఇవాళ (నవంర్ 19) థియేటర్లలో విడుదల అయింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ముఖ్య పాత్రలతో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పటి మ్యాజిక్‌ను రిపీట్ చేసిందా లేదా అనేది నేటి ఈ నగరానికి ఏమైంది 2 రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

అయితే, ఉప్పి కజిన్ అయిన కీర్తన (శివాత్మిక రాజశేఖర్), కార్తీక్ ప్రేమలో పడతారు. అప్పటికే కీర్తనకు పెళ్లి ఫిక్స్ అవుతుంది. కీర్తనను పెళ్లి చేసుకునే అంకిత్ (సింగర్ శ్రీరామచంద్ర) బ్యాచిలర్ పార్టీ ఇస్తాడు. ఈ పార్టీతో నలుగురు ఫ్రెండ్స్ అంతా కలుస్తారు. కానీ, ఆ పార్టీలో గొడవ జరిగి అంకిత్‌ను కొడతారు. దాంతో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది.

ఆ తర్వాత ఏమైంది? అంకిత్‌తో నలుగురికి ఎందుకు గొడవ జరిగింది? కీర్తన తండ్రి ఏమని బెదిరించాడు? వివేక్ చేసిన ఛాలెంజ్ ఏంటీ? కీర్తన కార్తీక్ లవ్ స్టోరీ ఏంటీ? మళ్లీ నలుగురు ఫ్రెండ్స్ కలిసి సినిమా తీయడానికి కారణాలు ఏంటీ? అవకాశాలు రాక సినిమాలకు దూరంగా ఉన్న వివేక్ ఎలాంటి మూవీ తీశాడు? తీసి డైరెక్టర్‌గా హిట్ కొట్టాడా? చివరికీ ఏమైంది? అనేదే ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమా కథ.

విశ్లేషణ:

మొదటి సినిమా ఎండింగ్ నుంచే ఈ సీక్వెల్ ప్రారంభమవుతుంది. మొదటి పార్ట్ లాగే ఈ సీక్వెల్‌కి కూడా అతిపెద్ద బలం కౌశిక్ పాత్ర. అభినవ్ గోమటం తన మార్క్ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించారు. ఆయన హావభావాలు, విచిత్రమైన డైలాగ్ డెలివరీ, స్నేహితులతో సాగే సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.

అడవి నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్, అందులో ఎలుగుబంటితో కౌశిక్ ఎదుర్కొనే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయారు. సినిమా మేకింగ్ పట్ల వివేక్ చూపించే మొండితనం, బీచ్‌లో కౌశిక్‌ను డైరెక్ట్ చేసే సింగిల్ షాట్ ఎపిసోడ్ బాగా పండాయి.

వివేక్ వైపు ఉండాలో, మిగతా స్నేహితులకు మద్దతు ఇవ్వాలో తెలియక ఉప్పి పడే గందరగోళాన్ని వెంకటేష్ కాకుమాను చక్కగా పండించారు. శివాత్మిక రాజశేఖర్ తన పరిధి మేరకు ఆకట్టుకోగా, ప్రియదర్శిని రామ్, మహేష్ భాస్కర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. బార్ సీన్, బీచ్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. వీటికి తోడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, నటుల అతిథి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సర్‌ప్రైజ్ చేస్తాయి.

మారిన కార్తీక్ పాత్ర

తొలి భాగం తరహాలోనే ఇందులోనూ నలుగురు స్నేహితులు చిక్కుల్లో పడటం, తమను తాము నిరూపించుకోవడానికి మళ్లీ సినిమా తీసే సవాల్ ఎదుర్కోవడం వంటి పాత ఫార్ములానే దర్శకుడు ఎంచుకున్నారు. కామెడీకి స్కోప్ ఉన్నప్పటికీ, కథలో బలమైన సంఘర్షణ లోపించడంతో మొదటి సినిమాలో ఉన్న కొత్తదనం ఇందులో కనిపించదు.

వివేక్ పాత్రలో గతంలో ఉన్న ఆ అల్లరి, ఊహించని తత్వం ఇందులో కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. ఆర్థిక కష్టాలు, అసహనంతో వివేక్ పాత్రను కాస్త నెమ్మదిగా చూపించడం వల్ల స్నేహితుల మధ్య జరగాల్సినంత రచ్చ జరగలేదు. గతంలో కార్తీక్ పాత్రలో మెప్పించిన సాయి సుశాంత్ రెడ్డి స్థానంలో మాగంటి శ్రీనాథ్ నటించారు.

అలరించని క్లైమాక్స్

శ్రీనాథ్ తన నటనతో మెప్పించినప్పటికీ, పాత నటుడికి అలవాటు పడ్డ ప్రేక్షకులకు మొదట్లో కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ చివరి వరకు వచ్చేసరికి కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి మెప్పిస్తాడు. అనీషా ఆంబ్రోస్, కరుణ కుమార్ పాత్రలకు సరైన ప్రాధాన్యత దక్కలేదు.

అయితే, క్లైమాక్స్ అంతగా అలరించదు. కథలోని ప్రధాన సమస్యను హడావుడిగా ముగించినట్లు అనిపిస్తుంది. కీర్తన తండ్రి మనసు మారే సన్నివేశం అంత సహజంగా ఫీల్ అయ్యేలా ఉండదు. తొలి భాగంలో నలుగురు స్నేహితుల మధ్య ఉన్న గాఢమైన అనుబంధం, ఎమోషన్ ఇందులో కాస్తా లోపించినట్లుగా ఉంటుంది.

సాంకేతిక విభాగం పనితీరు ఎలా ఉందంటే..

తనదైన సహజ సిద్ధమైన డైలాగ్స్, విచిత్రమైన పరిస్థితులతో నవ్వించడంలో తరుణ్ భాస్కర్ మరోసారి తన పెన్ను పవర్ చూపించారు. అయితే పాత్రల మధ్య భావోద్వేగాలను మరింత లోతుగా రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. తొలి భాగానికి వివేక్ సాగర్ అందించిన పాటలు ఇప్పటికీ మారుమోగుతుంటాయి. కానీ, ఈ సీక్వెల్‌లో పాటలు అంతగా గుర్తుండిపోయేలా లేవు.

నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ థాయ్‌లాండ్ అందాలను, అవుట్‌డోర్ లొకేషన్లను కళ్లకు కట్టినట్లు చూపించింది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే

మొత్తం మీద 'ఈఎన్‌ఈ రిపీట్' అక్కడక్కడా నవ్వించే ఒక ఫ్రెండ్లీ కామెడీ డ్రామా. అభినవ్ గోమటం కామెడీ, విశ్వక్ సేన్ నటన, బీచ్, బార్, ఎలుగుబంటి ఎపిసోడ్లు ప్రేక్షకులను అలరిస్తాయి. బలమైన ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, హడావుడిగా ముగిసే క్లైమాక్స్ సినిమాకు మైనస్‌గా మారాయి. ఫైనల్‌గా చెప్పాలంటే మొదటి సినిమాతో పోల్చుకోకుండా స్నేహితులతో కలిసి సరదాగా రెండు గంటలు నవ్వుకోవాలనుకునే వారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్.

రేటింగ్: 3/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks