...
...
Next Story

OTT Today: ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- కారు ఈఎమ్ఐ కట్టలేక పిల్లలు వద్దనుకునే జంట- ఎక్కడంటే?

OTT Telugu Release Today: ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా ఈఎమ్ఐ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. లవ్, ఎమోషనల్‌ సీన్లతో తెరకెక్కిన ఈ సినిమా ఈఎమ్ఐ చుట్టూ సాగుతుంది. ఈఎమ్ఐ కోసం పిల్లలను కూడా వద్దనుకునే జంట కథగా ఉండే ఈఎమ్ఐ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Mar 8, 2026, 13:40:52 IST
Advertisement

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇటీవల కాలంలో తెలుగులోనూ అదిరిపోయే కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. వాటిలో ప్రతి ఆదివారం అచ్చ తెలుగు నేపథ్యంతో, అతి తక్కువ రన్‌టైమ్‌తో మూవీస్ ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.

రిచ్ పీపుల్ వరకు

ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- కారు ఈఎమ్ఐ కట్టలేక పిల్లలు వద్దనుకునే జంట- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- కారు ఈఎమ్ఐ కట్టలేక పిల్లలు వద్దనుకునే జంట- ఎక్కడంటే?

ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (మార్చి 8) తెలుగు ఫ్యామిలీ లవ్ ఎమోషనల్ డ్రామా చిత్రం ఒకటి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే ఈఎమ్ఐ. సాధారణంగా ఈఎమ్ఐ అంటే ఈక్వెటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్. మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్ వరకు ఈ ఈఎమ్ఐ ఏంటో తెలుసు.

కానీ, కొన్నిసార్లు ఇదే ఈఎమ్ఐ చాలా మందికి శాపంగా మారుతుంది. అది ఎలా అనే ఒక ఉదాహరణగా తెరకెక్కిన సినిమానే ఈఎమ్ఐ. ఇక్కడ ఈఎమ్ఐ అంటే ఎవ్రీ మంత్ ఇన్‌సెక్యూర్ (ప్రతి నెల అభద్రత) అనే క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. అంటే, ప్రతి నెల కట్టే ఒక మనిషికి ఎంతటి అభద్రత భావాన్ని తీసుకొస్తుందో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

చేతిలో చిప్ప

ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవనం సాగిస్తుంటారు. ఇంతలో ఇద్దరికి ఉద్యోగం పోతుంది. దాంతో వారికి కష్టాలు మొదలు అవుతాయి. ఇంటి ఖర్చులకు మించి కారు ఈఎమ్ఐ, క్రెడిట్ కార్డ్స్ వంటి ఆర్థిక వ్యవహారాలు చాలా బారంగా మారుతాయి. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటాయి.

కారు ఈఎమ్ఐ కట్టలేకపోవడం, తదితర ఆర్థిక పరిస్థితులతో పిల్లలను కనడం వద్దనుకుంటారు ఆ జంట. మరి ఆ తర్వాత ఏమైంది?, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా? మధ్య తరగతి వారికి ఈఎమ్ఐ ఎందుకు బారంగా మారుతోంది? అనే అంశాలను ప్రస్తావిస్తూ ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈఎమ్ఐ సినిమాను రూపొందించారు.

ఈఎమ్ఐ సినిమాకు కిరణ్ తుమ్మ దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఖాళీ టైమ్ మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు నరేన్ ఆర్కే సిద్ధార్థ్ సంగీతం అందించారు. ఈఎమ్ఐ మూవీలో అభినవ్ మణికంఠ, నేహా పఠాన్ హీరో హీరోయిన్లుగా నటించారు.

ఈటీవీ విన్ ఓటీటీలో

వారితోపాటు ఈఎమ్ఐ చిత్రంలో రాధా కృష్ణ తేలు, దీపక్ మేర్ల, సర్కార్, దువ్వాసి మోహన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ కిరణ్ తుమ్మ రచించిన ఈ సినిమాకు ఎడిటర్‌గా సూర్య తేజ లంక వ్యవహరించారు. కేవలం 39 నిమిషాల రన్‌టైమ్‌తో ఉన్న ఈఎమ్ఐ ఓటీటీలోకి ఇవాళ (మార్చి 8) వచ్చేసింది.

అచ్చ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో నేటి నుంచి ఈఎమ్ఐ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ఈఎమ్ఐ ఓటీటీ రిలీజ్ అయింది. ఈటీవీ విన్ ఓటీటీ వీక్లి సిరీస్ కథా సుధాలో భాగంగా ఈఎమ్ఐ మూవీని ఓటీటీ ప్రీమియర్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe