TV Show: ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ షోలను అందించడంలో పాపులర్ తెలుగు ఛానెల్ ఈటీవీ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఈ టీవీ ఛానెల్ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ ఎంటర్ టైన్మెంట్ షో సీజన్ 2తో బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఆ షోనే ‘ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2’.
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2

ఈటీవీలో సూపర్ హిట్ గా నిలిచిన ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ షో ‘ఫ్యామిలీ స్టార్స్’ నుంచి ఇప్పుడు రెండో సీజన్ వచ్చేస్తోంది. తాజాగా ఈ సీజన్ 2 లాంఛ్ ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. ఇందులో మరోసారి సుడిగాలి సుధీర్ తన యాంకరింగ్ తో అదరగొట్టనున్నాడు. అతని మరదళ్లుగా స్రవంతి చొక్కారపు, అషు రెడ్డి మరోసారి సందడి చేయనున్నారు.
ఎప్పుడంటే?
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ షో జనరల్ గా మధ్యాహ్నం వచ్చేది. కానీ ఈ సీజన్ 2 టైమింగ్స్ ను మార్చారు. ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఈటీవీలో వస్తుంది. సండే ప్రైమ్ టైమ్ కు ఈ షోను షిప్ట్ చేశారు. మరి సుధీర్ మ్యాజిక్ మరోసారి షోను సూపర్ హిట్ గా నిలబెడుతుందేమో చూడాలి.
లాంఛ్ ప్రోమో
ఈటీవీ తాజాగా ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 లాంఛ్ ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో ఇద్దరు మరదళ్లు స్రవంతి, అషుతో సుధీర్ పంచ్ లు ఎప్పటిలాగే అదిరిపోయాయి. ఇక సెలబ్రిటీలతో ఆటలు కూడా మరోసారి ఎంటర్ టైన్ చేసేలా ఉన్నాయి. ఈ లాంఛ్ ఎపిసోడ్ కు అంబటి అర్జున్, నిఖిల్, ప్రియాంక, తేజస్విని గౌడ, యష్మి తదితర సెలబ్రిటీలు వచ్చారు.
ఇక లాంఛ్ ఎపిసోడ్ కు బ్యూటీఫుల్ హీరోయిన్ సీరత్ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా సుధీర్ తో కలిసి హోస్టింగ్ కూడా చేసింది. సుధీర్ పై పంచ్ లు కూడా వేసింది.
యష్మి కౌంటర్
{{/usCountry}}ఇక లాంఛ్ ఎపిసోడ్ కు బ్యూటీఫుల్ హీరోయిన్ సీరత్ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా సుధీర్ తో కలిసి హోస్టింగ్ కూడా చేసింది. సుధీర్ పై పంచ్ లు కూడా వేసింది.
యష్మి కౌంటర్
{{/usCountry}}ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 లాంఛ్ ఎపిసోడ్ లో యష్మి కౌంటర్లు బాగా పేలాయి. సుధీర్ దగ్గరకు వచ్చి.. ఇలా ఎవరైనా దగ్గరకు వచ్చి నువ్వు అందంగా ఉన్నావని చెప్పారా అని యష్మి అడుగుతుంది. లేదు అని సుధీర్ అంటాడు. అలా చెప్తే నమ్మకు అని యష్మి కౌంటర్ వేస్తుంది. దీంతో ఇక ప్రతి సండే రాత్రి 7.30 గంటలకు ఫ్యామిలీ స్టార్స్ తో ఎంటర్ టైన్మెంట్ పక్కా అనే కామెంట్లు వస్తున్నాయి.