Feb OTT: ఈ నెలలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు, సిరీస్‌లు-సంక్రాంతి మూవీస్‌తో పాటు అదిరే బ్లాక్‌బ‌స్ట‌ర్లు-హార‌ర్‌, రొమాన్స్

ఫిబ్రవరి నెల వచ్చేసింది. ఈ మంత్ లో ఓటీటీ లవర్స్ కు పండగే. సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఈ నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే మరెన్నో బ్లాక్ బస్టర్ మూవీస్, సిరీస్ లు రెడీగా ఉన్నాయి. 

Published on: Feb 1, 2026, 22:03:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిబ్రవరి నెలలో ఓటీటీలో సందడి మామూలుగా ఉండదు. కొత్త సినిమాలు, సిరీస్ లతో డిజిటల్ స్ట్రీమింగ్ అదిరిపోనుంది. సంక్రాంతి 2026 సినిమాలు ఈ నెలలోనే ఓటీటీలోకి వస్తున్నాయి. వీటితో పాటు ఇంకా మరెన్నో బ్లాక్ బస్టర్లు రెడీగా ఉన్నాయి.

ఫిబ్రవరి ఓటీటీ
ఫిబ్రవరి ఓటీటీ

సంక్రాంతి సినిమాల ఓటీటీ

సంక్రాంతి 2026 సందర్భంగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు, తమిళం కలిసి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో వా వాతియార్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఫిబ్రవరి 4న ప్రైమ్ వీడియోలో, ప్రభాస్ ది రాజాసాబ్ ఫిబ్రవరి 6న జియోహాట్ స్టార్ లో, పరాశక్తి ఫిబ్రవరి 7న జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.

అలాగే ఈ సంక్రాంతి సినిమాలైన మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ణ‌ప్తి, అనగనగా ఒక రాజు సినిమాలు కూడా ఈ ఫిబ్రవరిలోనే ఓటీటీలోకి రాబోతున్నాయి.

డెత్ విస్పరర్ 3

అతీంద్రియ దుష్ట శక్తుల నుంచి తన చెల్లెలిని కాపాడేందుకు ప్రయత్నించే ఓ అన్న స్టోరీతో వస్తున్న సిరీస్ డెత్ విస్పరర్ సీజన్ 3. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 4 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ది లింకన్ లాయర్ సీజన్ 4

మైఖేల్ కాన్నెల్లీ నవల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ది లింకన్ లాయర్ సీజన్ 4. డిఫెన్స్ న్యాయవాది లాయర్ మిక్కీ హాలర్ కార్లో డెడ్ బాడీ దొరుకుతుంది. అతను జైలు శిక్ష అనుభవిస్తాడు. కానీ నిర్దోషిగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. ఇది నెట్ ఫ్లిక్స్ లోకి ఫిబ్రవరి 5న రానుంది.

కొహ్రా సీజన్ 2

ఇది కూడా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. అత్యంత క్రూరంగా హత్యలు చేసే క్రిమినల్స్ ను పట్టుకోవడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతుంది.

ది కంజురింగ్: లాస్ట్ రైట్స్

అత్యంత భయంకరమైన హారర్ థ్రిల్లర్లలో కంజురింగ్ ఒకటి. ఇప్పుడు ఇందులో ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సారి దుష్టశక్తిని పూర్తిగా అంతం చేయడానికి ప్రయత్నించడం చుట్టూ కథ సాగుతుంది. ఇది ఫిబ్రవరి 13 నుంచి జియోహాట్ స్టార్ లో అందుబాటులో ఉంటుంది.

ది బ్లఫ్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సముద్రపు దొంగగా నటిస్తున్న సినిమా ది బ్లఫ్. ఇందులో ఫైట్లతో ప్రియాంక అదరగొట్టనుంది. ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది.

బ్రిడ్జర్టన్ సీజన్ 4: పార్ట్ 2

ఇది రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో ల్యూక్ థాంప్సన్, మెరీన్ హా, నికోలా తదితరులు నటించారు. ఈ సీజన్ 4లోని పార్ట్ 2 ఫిబ్రవరి 26న నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More