2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి మెగా హీరోలు వచ్చేస్తున్నారు. ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారుతో ఈ ఏడాదిని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ ఇయర్ లో మెగాస్టార్ మరో సినిమాతో రాబోతున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమ సినిమాలతో ఎంటర్ టైన్ చేయబోతున్నారు. వీళ్ల మూవీస్, రిలీజ్ డేట్లపై ఓ లుక్కేయండి.
అదరగొట్టిన మెగాస్టార్

2023లో భోళా శంకర్ తర్వాత రెండేళ్ల పాటు చిరంజీవి నుంచి ఒక్క మూవీ కూడా రాలేదు. 2024, 2025 గడిచిపోయాయి. అయితే ఆ లోటు తీర్చేస్తూ 2026 సంక్రాంతికే మన శంకర వరప్రసాద్ గారుతో బ్లాక్ బస్టర్ కొట్టారు మెగాస్టార్. రికార్డుల దుమ్ము దులిపిన ఈ మూవీ మరోసారి చిరు మేనియాను ప్రపంచానికి చాటింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
విశ్వంభరతో
మన శంకర వరప్రసాద్ గారుతో 2026ను బ్లాక్ బస్టర్ గా స్టార్ట్ చేసిన చిరంజీవి ఇదే ఏడాది మరో మూవీతో రాబోతున్నారు. అదే విశ్వంభర. వశిష్ఠ డైరెక్షన్ లో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా విశ్వంభర తెరకెక్కుతోంది. ఇందులో చిరంజీవి, త్రిష, కునాల్ కపూర్, ఆషిక రంగనాథ్ తదితరులు నటిస్తున్నారు. నిజానికి 2025 సంక్రాంతికే ఈ మూవీ రిలీజ్ కావాల్సింది. కానీ బెటర్ ఔట్ పుట్ కోసం పోస్ట్ పోన్ చేశారు. ఈ ఏడాది జులై 10న విశ్వంభర రిలీజ్ అయ్యే అవకాశముంది.
పవర్ స్టార్
2025లో హరిహర వీరమల్లు, ఓజీతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. హరిహర వీరమల్లు రిజల్ట్ కాస్త నిరాశపర్చినా.. ఓజీతో మాత్రం బాక్సాఫీస్ ను కుమ్మేశారు. ఈ సినిమా సక్సెస్ ఊపుతోనే వరుసగా మూవీస్ చేసేందుకు రెడీ అయిపోయారు పవర్ స్టార్. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ వచ్చేస్తున్నారు.
{{/usCountry}}2025లో హరిహర వీరమల్లు, ఓజీతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. హరిహర వీరమల్లు రిజల్ట్ కాస్త నిరాశపర్చినా.. ఓజీతో మాత్రం బాక్సాఫీస్ ను కుమ్మేశారు. ఈ సినిమా సక్సెస్ ఊపుతోనే వరుసగా మూవీస్ చేసేందుకు రెడీ అయిపోయారు పవర్ స్టార్. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ వచ్చేస్తున్నారు.
{{/usCountry}}ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26న రిలీజ్ కానుంది. దీనికి హరీష్ శంకర్ డైరెక్టర్. ఇందులో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు.
పెద్ది రిలీజ్ డేట్
రూరల్ క్రికెటర్ గా బిగ్ స్క్రీన్ పై రచ్చ చేయడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. నిజానికి మార్చి 27, 2026న పెద్ది మూవీని థియేటర్లకు తీసుకొస్తామని మేకర్స్ ముందే ప్రకటించారు. కానీ ఇప్పుడు బాబాయ్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అబ్బాయ్ రామ్ చరణ్ వెనక్కి తగ్గారు.
బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పెద్ది మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్. మరోవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా కొరియన్ కనకరాజు కూడా 2026లోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. సమ్మర్ లో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.