Gandhari OTT Release Today: ఒకప్పుడు తెలుగులో హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటిఫుల్ తాప్సీ పన్ను ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితం అయిపోయింది. బాలీవుడ్‌లో సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటోంది.
ఓటీటీలోకి గాంధారి

అలాంటి తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటించిన హై-వోల్టేజ్ ఎమోషనల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గాంధారి. తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 3) నేరుగా గాంధారి ఓటీటీలోకి వచ్చేసింది. కంటిచూపు పోగొట్టుకున్న కూడా కూతురు ఎక్కడుందో కనిపెట్టేందుకు పోరాటం చేసే తల్లి పాత్రలో తాప్సీ నటించింది.
ఒక తల్లి ప్రాణాల తెగింపు కథ
ఈ చిత్ర కథ అంతా 'బాణి' (తాప్సీ) అనే తల్లి చుట్టూ తిరుగుతుంది. రద్దీగా ఉండే ఒక రైల్వే స్టేషన్‌లో ఆమె చిన్న కూతురు హఠాత్తుగా మాయమవుతుంది. కంటిపాపలా చూసుకునే పాప కనిపించకుండాపోవడంతో బాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
తన చిన్నారి కోసం వెతుకుతున్న క్రమంలోనే బాణిపై దారుణమైన దాడి జరుగుతుంది. ఈ ప్రమాదంలో బాణి తాత్కాలికంగా కంటిచూపును పోగొట్టుకుంటుంది. శరీరం సహకరించకపోయినా, కంటిచూపు లేకపోయినా తన కూతురిని వెతికేందుకు ప్రయాణం మొదలుపెడుతుంది బాణి.
క్రిమినల్ గ్యాంగ్‌పై కంటిచూపులేని తల్లి పోరాటం
ఈ క్రమంలోనే 'జైపుర్రా' అనే ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఒక పెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ (పిల్లల అక్రమ రవాణా) నెట్‌వర్క్ వెలుగులోకి వస్తుంది. అంధురాలైన ఒక సాధారణ తల్లి, సమాజంలో పేరుకుపోయిన క్రిమినల్ గ్యాంగ్‌ను ఎదురించి తన కూతురితో పాటు మిగతా పిల్లలను ఎలా కాపాడిందనేదే ఈ గాంధారి సినిమా కథ.
హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్!
'హసీన్ దిల్రుబా', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా', 'మన్మర్జియా' వంటి విజయవంతమైన ఓటీటీ చిత్రాల తర్వాత తాప్సీ, ప్రముఖ రచయిత్రి-నిర్మాత కనికా ధిల్లాన్ కాంబినేషన్లో వచ్చిన నాలుగో ప్రాజెక్ట్ ఇది. ప్రయోగాత్మక కథలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన దేవాశిష్ మఖీజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
{{/usCountry}}'హసీన్ దిల్రుబా', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా', 'మన్మర్జియా' వంటి విజయవంతమైన ఓటీటీ చిత్రాల తర్వాత తాప్సీ, ప్రముఖ రచయిత్రి-నిర్మాత కనికా ధిల్లాన్ కాంబినేషన్లో వచ్చిన నాలుగో ప్రాజెక్ట్ ఇది. ప్రయోగాత్మక కథలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన దేవాశిష్ మఖీజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
{{/usCountry}}గతంలో 'అజ్జీ', 'భోంస్లే' వంటి తీవ్రమైన సామాజిక అంశాలతో కూడిన సినిమాలను అందించిన దేవాశిష్, ఈసారి తాప్సీని మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతారంలో నిలబెట్టారు.
బలమైన తారాగణం.. కేవలం 50 రోజుల్లోనే పూర్తి
ఇందులో బాణి చిన్న కూతురి పాత్రలో మైరా శివన్ నటించగా, ఈశ్వక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తిక ముఖర్జీ, మితా వశిష్ట్, జతిన్ సర్నా, ప్రశాంత్ నారాయణన్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. షార్ పోలీస్, క్లింటన్ సెరెజో, బియాంకా గోమ్స్ సంగీతం అందించగా, కౌసర్ మునీర్ పాటలు రాశారు. అమిత్ రాయ్ కెమెరా పనితనం కథలోని తీవ్రతను ప్రతిబింబిస్తుంది.
2024 డిసెంబర్ నుంచి 2025 మార్చి మధ్య కేవలం 50 రోజుల్లోనే ముంబై, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో గాంధారి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేశారు. మాతృత్వంలోని ఆవేదనను, ప్రతీకార తీవ్రతను జోడించి తీసిన ఈ సర్వైవల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గాంధారి ఓటీటీ ప్రియులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు వచ్చేసింది.
గాంధారి ఓటీటీ స్ట్రీమింగ్
డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ గాంధారి ఓటీటీ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 3 అర్థరాత్రి 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో గాంధారి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా, హిందీతోపాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్ వంటి 4 భాషల్లో గాంధారి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.