Risk Devudu Varamandisthe Song Release And Contest: టాలీవుడ్‌లో ఒకప్పుడు చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో అలరించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన సరికొత్త అవతారంలో మెగా ఫోన్ పట్టి, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ 'రిస్క్'.
జూన్ 26న రిస్క్ రిలీజ్

జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై సందీప్ అశ్వ, సాన్యా ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రిస్క్ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.
ప్రామిసింగ్ కంటెంట్
ఇప్పటికే విడుదలైన రిస్క్ మూవీ ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కంటెంట్ చాలా ప్రామిసింగ్‌గా ఉండటంతో ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి.
త్రినాథ్ రావు నక్కిన చేతుల మీదుగా సాంగ్ లాంచ్
ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, ఈ సినిమాలోని మోస్ట్ అవేటెడ్ మెలోడీ సాంగ్ “దేవుడు వరమందిస్తే”ను తాజాగా విడుదల చేసింది. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన ఈ ప్రత్యేకమైన పాటను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ఇన్‌స్టా, యూట్యూబ్ షార్ట్స్‌లలో
మెలోడీ కింగ్ ఘంటాడి కృష్ణ కంపోజ్ చేసిన ఈ సాంగ్ వినసొంపుగా ఉండటంతో శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటకు అప్పుడే మంచి వ్యూస్ వస్తున్నాయి.
ప్రమోషనల్ ఈవెంట్‌లో నిర్మాతలు
{{/usCountry}}మెలోడీ కింగ్ ఘంటాడి కృష్ణ కంపోజ్ చేసిన ఈ సాంగ్ వినసొంపుగా ఉండటంతో శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటకు అప్పుడే మంచి వ్యూస్ వస్తున్నాయి.
ప్రమోషనల్ ఈవెంట్‌లో నిర్మాతలు
{{/usCountry}}ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో దర్శకుడు ఘంటాడి కృష్ణ, హీరో సందీప్ అశ్వలతో పాటు నిర్మాతలు రావి సురేష్ రెడ్డి, గుర్రం నర్సింహులు, సహ నిర్మాత గడ్డం రవి కుమార్, కో-డైరెక్టర్ బన్సీ కోయల్ కార్ తదితరులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
రీల్స్ చేయండి.. నగదు బహుమతులు గెలవండి!
రిస్క్ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన కాంటెస్ట్‌ను అనౌన్స్ చేసింది. “దేవుడు వరమందిస్తే” సాంగ్‌కు ఉన్న హుక్ స్టెప్‌ను బేస్ చేసుకుని డ్యాన్స్ వీడియోలు లేదా క్రియేటివ్ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
కచ్చితంగా వాడాల్సిన హ్యాష్ ట్యాగ్స్
వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు #DevuduVaramandisthe, #RISKMovie, #SandeepAshwa అనే హ్యాష్ ట్యాగ్‌లను కచ్చితంగా వాడాలి. ఈ రీల్స్‌లో బెస్ట్‌గా నిలిచిన వీడియోలను సెలెక్ట్ చేసి, సదరు క్రియేటర్లకు చిత్ర యూనిట్ ప్రత్యేక నగదు బహుమతులను అందజేయనుంది.
లవ్, సస్పెన్స్ ఎలిమెంట్స్
ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా లవ్, ఫ్రెండ్‌షిప్, యూత్ ఎమోషన్స్, ఊహించని సస్పెన్స్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమాను రూపొందించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా ఈ 'రిస్క్' కంటెంట్ థ్రిల్ చేస్తుందని మేకర్స్ నమ్మకంగా చెప్తున్నారు.