...
...
Next Story

Songs: దర్శకుల సంఘంలో గూగుల్ మై ఫ్రెండ్ సాంగ్స్ లాంచ్- తెలుగు, మరాఠీలో మూవీ- రామానాయుడులా కంకణం కట్టుకున్నారంటూ!

Google My Friend Song Launch In Directors Members Association: బహు భాషల్లో పలు హిట్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోవింద్ వరాహ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా గూగుల్ మై ఫ్రెండ్. తాజాగా డైరెక్టర్స్ ఆసోసియేషన్ సమక్షంలో ఘనంగా గూగుల్ మై ఫ్రెండ్ సాంగ్స్‌ని లాంచ్ చేశారు.

Published on: Mar 29, 2026, 17:48:31 IST
Advertisement

ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "గూగుల్ మై ఫ్రెండ్". ఈ చిత్రాన్ని డాలర్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బహు భాషల్లో పలు హిట్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోవింద్ వరాహ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తెలుగు, మరాఠీ భాషల్లో

దర్శకుల సంఘంలో గూగుల్ మై ఫ్రెండ్ సాంగ్స్ లాంచ్- తెలుగు, మరాఠీలో మూవీ- రామానాయుడులా కంకణం కట్టుకున్నారంటూ!
దర్శకుల సంఘంలో గూగుల్ మై ఫ్రెండ్ సాంగ్స్ లాంచ్- తెలుగు, మరాఠీలో మూవీ- రామానాయుడులా కంకణం కట్టుకున్నారంటూ!

"గూగుల్ మై ఫ్రెండ్" సినిమాకు టి. వెంకటేష్ రెడ్డి, బి.ప్రసన్నాంజనేయులు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, మరాఠీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, సాయి రాజేశ్, వి సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్ కుమార్ చేతుల మీదుగా గూగుల్ మై ఫ్రెండ్ చిత్ర సాంగ్స్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు.

ప్రొడ్యూసర్‌కు డబ్బులు రావాలని

ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. "మా దర్శకుల సంఘం సభ్యులు, మా ఆత్మీయులు గోవింద్ డైరెక్ట్ చేస్తున్న గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్, టీజర్ ఇతర కంటెంట్ చూశాం. ఈ కంటెంట్ అంతా ప్రామిసింగ్‌గా ఉంది. ఒకేసారి తెలుగు, మరాఠీ భాషల్లో ఆయన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మంచి రిలీజ్ కుదిరి ప్రొడ్యూసర్‌కు డబ్బులు, గోవింద్ గారికి పేరు రావాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు చేయాలని

డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. "గూగుల్ మా ఫ్రెండ్ సినిమాను మా ఫ్రెండ్ గోవింద్ వరాహ రూపొందిస్తున్నారు. ఆయన బహు భాషల్లో సినిమాలు రూపొందించిన దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగు, మరాఠీ భాషల్లో త్వరలో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. అలాగే గోవింద్ వరాహ గారు మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్" అని తెలిపారు.

అన్ని భాషల్లో గుర్తింపు, విజయం రావాలి

"రామానాయుడు గారు అన్ని భాషల్లో సినిమాలు నిర్మించాలని ఎలా కంకణం కట్టుకున్నారో, గోవింద్ గారు కూడా బహు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. తెలుగు, మలయాళం, ఒరస్సా, మరాఠీ ఇలా వివిధ భాషల్లో సినిమాలు రూపొందిస్తున్నారు. గూగుల్ మై ఫ్రెండ్ సినిమా రిలీజ్ చేసిన ప్రతి భాషలో విజయం సాధించాలి" అని దర్శకుడు కొండా విజయ్ కుమార్ పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe