Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ కిందకు వచ్చి తల్లి గురించి అడిగితే లేదని మీనా చెబుతుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చానని మనోజ్ అడిగితే.. మావయ్య, ఆయన తీసుకొచ్చారని మీనా చెబుతుంది. ఆకలేస్తుందా, మజ్జిగ ఇవ్వనా అని మీనా అడిగితే వద్దని, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అంటాడు మనోజ్.
మీనాకు బాలు గోరుముద్దలు

మనోజ్‌కు డోర్ తీయరాదు. మీనా వెళ్లి తీస్తుంది. మనోజ్ వెళ్తాడు. తర్వాత బాలు వస్తాడు. మనోజ్ గురించి చెబుతుంది మీనా. బాలు భోజనం తీసుకొస్తాడు. మీనా చేయి సరిగా లేదని భోజనం తీసుకొచ్చినట్లు బాలు చెబుతాడు. తర్వాత మీనాకు బాలు తినిపిస్తాడు. మీనా గోరుముద్దల గురించి మాట్లాడితే ముద్దుల గురించి బాలు అంటాడు.
తర్వాత ఇంట్లో ఎవరు లేరు.. పార్లరమ్మా రూమ్‌లో ఏమైనా దొరుకుతాయేమో చూద్దామా అని బాలు అంటాడు. ముందు ఒప్పుకోని బాలు టాస్ వేస్తానంటాడు. బాలు చెప్పినట్లే బొమ్మ పడుతుంది. దాంతో బాలు, మీనా వెళ్లి రోహిణి గదిలో వెతుకుతారు. ఎవరు రాకుండా బాలు డోర్ మూస్తానంటే.. దానికి బదులు గుమ్మం మూస్తే సరిపోతుందిగా అని మీనా అంటుంది.
అమ్మగారే నెంబర్ వన్ అని బాలు వెళ్తాడు. అయ్యాగారే నెంబర్ వన్ టీవీలో విన్నానే. ఈ అమ్మగారే నెంబర్ వన్ ఎవరు కొత్తగా అని మీనా అంటుంది. బాలు డోర్ వేసి వచ్చి చూస్తారు. బీరువాలో చూస్తే చింటు డ్రెస్ కనిపిస్తుంది. అవి ఎవరి బట్టలు అని ఇద్దరు ఆలోచిస్తారు. ఇలా ఎవరైనా దాచారంటే కచ్చితంగా రహస్యమే. ఈ బట్టల వెనుక ఏదో కథ ఉంది. లేదంటే మనోజ్ గాడు కొనేసి రోహిణి బట్టల్లో దాచి ఉంటాడా అని బాలు అంటాడు.
మనోజ్ కొడుకే చింటు
చింటుతో వాడు తిరిగాడు కదా. చింటు మనోజ్ గాడి కొడుకని నీకు డౌట్ వచ్చిందిగా అని బాలు అంటాడు. అవును, ఇవి మన చింటుకి బాగా సూట్ అవుతాయని, తన డౌట్ మరింత బలపడిందని మీనా అంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ కొట్టడంతో బట్టలు బీరువాలో పెట్టి కిందకు వెళ్తారు. మనోజ్ వస్తాడు. చెప్పకుండా ఎందుకు వెళ్లావురా అని బాలు అడుగుతాడు.
{{/usCountry}}చింటుతో వాడు తిరిగాడు కదా. చింటు మనోజ్ గాడి కొడుకని నీకు డౌట్ వచ్చిందిగా అని బాలు అంటాడు. అవును, ఇవి మన చింటుకి బాగా సూట్ అవుతాయని, తన డౌట్ మరింత బలపడిందని మీనా అంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ కొట్టడంతో బట్టలు బీరువాలో పెట్టి కిందకు వెళ్తారు. మనోజ్ వస్తాడు. చెప్పకుండా ఎందుకు వెళ్లావురా అని బాలు అడుగుతాడు.
{{/usCountry}}నీ పర్మిషన్ అడిగి వెళ్లాలా. నువ్వెవ్వరా అడగడానికి అని మనోజ్ పొగరుగా మాట్లాడుతాడు. మనోజ్‌కు జరిగింది అంతా చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది మీనా. బయటకు ఎందుకు వెళ్లావని బాలు అడిగితే.. ఆకలేసింది, ఎవరు వండిపెట్టలేదు వెళ్లాను అని మనోజ్ పైకి వెళ్తాడు. మనోజ్ చెప్పింది చెప్పి, అనవసరంగా పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చారు. అక్కడే వదిలేయాల్సిందని మీనా అంటుంది.
మరుసటి రోజు ఉదయం సుశీల గురించి మాట్లాడుకుంటారు బాలు, మీనా. తర్వాత రోహిణి మోసం చేసి ఉండొచ్చు కానీ మనోజ్‌ను ప్రేమించింది. రోహిణి వల్ల మనోజ్ ఎదిగారు. అలాంటి రోహిణిని పంపించడం ఎందుకో తప్పనిపిస్తుందని మీనా అంటుంది. అది మనోజ్ వింటాడు. రోహిణి గురించి గొప్పగా చెబుతుంది మీనా. ఇంతలో మనోజ్ వచ్చి అరుస్తాడు.
నేను దొరకడమే రోహిణికి అదృష్టం
నేను రోహిణికి దొరకడం తన అదృష్టంరా. నా విలువ తెలియకుండా మాట్లాడుతున్నారు. నేను ఈ స్థాయికి వచ్చింది నా వల్ల. రోహిణి జస్ట్ రైట్ హ్యాండ్‌లా ఉంది అంతే. మోసం చేసిన తన గురించి ఎందుకు ఆలోచించాలని మనోజ్ అంటాడు. మనోజ్‌కు పంచ్ ఇచ్చి పంపిస్తాడు బాలు. మరోవైపు శ్రుతికి రోహిణి కాల్ చేస్తుంది.
నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నేను ఎందుకు అబద్ధం చెప్పానో ఇంట్లో ఎవరు కూడా వినలేదు అంటూ తన తప్పేం లేదన్నట్లుగా రోహిణి మాట్లాడుతుంది. శ్రుతి మాత్రం రోహిణికి తెలియకుండా రవితో సెటైర్లు వేస్తుంది. నీకున్న బ్రాడ్ మైండ్‌సెట్ ఆ ఇంట్లో ఎవరికి లేదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని రోహిణి అంటుంది.
అమ్మమ్మ గారు వస్తే అందరిన సెట్ చేస్తారని సుశీల వస్తున్న విషయం చెబుతుంది శ్రుతి. పేషంట్ పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నప్పుడు ఫారెన్ నుంచి డాక్టర్ వస్తారుగా అలాగే ఇంట్లో పరిస్థితి క్రిటికల్‌గా ఉందిగా అందుకే అమ్మమ్మ గారు వస్తున్నారని సుశీల ఫారెన్ డాక్టర్‌లా చెబుతుంది శ్రుతి. ఇంతకీ ఈ విషయంలో నా మీద నీ ఒపినీయన్ ఏంటని రోహిణి అడుగుతుంది.
రోహిణి సపోర్ట్ ప్లాన్ ఫెయిల్
ఇలాంటి విషయాల్లో ఎవరి కారణాలు వారికి ఉంటాయి. నేను కేవలం ఆడియెన్‌ను మాత్రమే అని శ్రుతి కాల్ కట్ చేస్తుంది. రోహిణి నాకు సపోర్ట్ ఇవ్వమని ఇన్‌డైరెక్ట్‌గా అడగడానికి కాల్ చేసిందని, నేను ఇవ్వనని అలాగే చెప్పానని రవితో శ్రుతి అంటుంది. శ్రుతిని నా వైపు తిప్పుకుందామనుకున్నాను కానీ తను చాలా క్లియర్‌గా ఉంది. శ్రుతి సపోర్ట్ దొరకడం కష్టమే. అదే మీనా అయితే సపోర్ట్ చేసి ఉండేదని కానీ శ్రుతి రివర్స్‌లో ఇవ్వను అన్నట్లుగా చెప్పిందని రోహిణి అంటుంది.
ఇప్పుడు నువ్వు ఒంటరి పోరాటం చేయాల్సిందే. పైగా అమ్మమ్మ వస్తుందన్నావ్. ముఖా ముఖా ఉంటుంది చూసుకో అని విద్య హెచ్చరిస్తుంది. మరోవైపు షీలా డార్లింగ్ వచ్చేస్తుంది. బాలు, మీనా సంతోషిస్తారు. మనోజ్ కూడా సంతోషంగా పలకరిస్తే.. ఎవడ్రా నువ్వు, మా ఇంట్లో ఉన్నావేంటి. వాడు మానేశాడు నువ్వు తాగడం మొదలెట్టావా అని నిలదీస్తుంది సుశీల.
వీడే అలవాటు చేశాడని బాలుపై తోసేస్తాడు మనోజ్. ఇటు చూసి చెప్పురా అని సత్యం అంటాడు. ఈ విషయంలో నాన్నను కష్టపెడతావా. నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు అని మనోజ్‌ను తిడుతుంది. నీ వల్లే మనశ్శాంతి లేకుండా పోతుందని అంటుంది. అంతా రోహిణి వల్లే అని మనోజ్ అంటాడు. ప్రభావతి గురించి అడుగుతుంది. ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకుని అలా ఎలా వెళ్తుందని కోప్పడుతుంది సుశీల.
ఆంటీకి గడ్డి పెడుతుంటే చూడాలి
ఇంతలో శ్రుతి, రవి వచ్చి పలకరిస్తారు. మనోజ్‌ను రోహిణి గురించి అడుగుతుంది. ఇంతకాలం నిన్ను భరించందంటే మహాసాద్వి అయింటుంది. మీ అమ్మ వెళ్లగొట్టగానే చూస్తూ ఊరుకున్నావా. రోహిణికి ఫోన్ చేసి ఇంటికి రమ్మను అని సుశీల అంటుంది. మనోజ్ సరేనని పైకి వెళ్తాడు. ప్రభావతిని రమ్మనమని సత్యంకు కూడా చెబుతుంది.
అమ్మమ్మ అందరిని కలిపే వెళ్తుందని మీనా అంటుంది. ఆంటీకి గడ్డి పెడుతుంటే చూడాలనుంది. ఇంత పచ్చగడ్డి అని శ్రుతి అంటుంటే రవి నోర్మూసి పైకి తీసుకెళ్తాడు. మనోజ్ ఫోన్ కోసం రోహిణి ఎదురుచూస్తుంది. కచ్చితంగా చేస్తాడని విద్యతో పొగరుగా మాట్లాడుతుంది రోహిణి. ఇంతలో రోహిణికి మనోజ్ కాల్ చేస్తాడు. కానీ, రోహిణి లిఫ్ట్ చేయదు.
దాంతో విద్య తిడుతుంది. మనోజ్ మళ్లీ కాల్ చేస్తాడు. నేను ఎలా ఉన్నానో తనలో భయం కలగాలి. అలా ఇంకెప్పుడు వదులుకోవద్దనిపించాలి. అందుకే లిఫ్ట్ చేయట్లేదని రోహిణి అంటుంది. దీన్ని ప్రేమ అనుకుంటున్నావా. నేను దీన్ని టార్చర్ అంటాను. సైకోయిజం అంటారు అని విద్య అంటుంది. ఎన్నిసార్లు కాల్ చేసిన రోహిణి లిఫ్ట్ చేయట్లేదని మనోజ్ చెబుతాడు.
మనోజ్ నెంబర్ నుంచే చేయాలి
తన నెంబర్ నుంచి చేయమని బాలు అంటే.. వద్దని మనోజ్ నెంబర్ నుంచే చేయమని సుశీల అంటుంది. మరి నీ భార్య సంగతేంటని సత్యంను అడిగితే.. ముందు రోహిణి అయితే రాని అని అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.