...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: విల్లా విజయ్ అరెస్ట్-బాలు మీనాపై నిందలు- రోహిణికి ప్రభావతి సపోర్ట్-శ్రుతి తిట్లు

Gunde Ninda Gudi Gantalu Serial October 13th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 13వ తేది ఎపిసోడ్‌లో మురళితో వెళ్లి బాలు, అక్కడ విద్య మీనాలను చూసి షాక్ అవుతాడు. నలుగురు జరిగింది చెప్పుకుంటారు. ఇంతలో విల్లా విజయ్ దంపతులు వస్తే వారిని బాలు, మీనా పట్టుకుంటారు. పోలీసులకు అప్పగిస్తారు.

Published on: Oct 13, 2026, 07:33:08 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మురళితో విల్లా చూసేందుకు వెళ్తాడు బాలు. మీనా, విద్య వస్తారు. మీనాను చూసి మురళి, విద్యను చూసి బాలు ఇద్దరు షాక్ అవుతారు. మీనా కూడా ఆశ్చర్యపోతుంది. నలుగురు నువ్వా మీరు అనుకుంటారు.

నా భార్యకే లైన్ వేశావ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 13 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 13 ఎపిసోడ్

ఏంటీ తమ్ముడు.. నా దగ్గర సలహాలు అడిగి.. నా భార్యకే లైన్ వేశావ్. ఇప్పుడు నా అన్న భార్య ఫ్రెండ్ ఈ పిల్ల ఫ్రాడ్‌ కోసం సలహాలు అడిగి సెట్ చేసుకున్నావా. ఈ పిల్లా ఫ్రాడ్ ఎలా పరిచయం అని బాలు అంటాడు. రోహిణి చేసిన తప్పులకు విద్యను అనడం కరెక్ట్ కాదండి అని మీనా అంటుంది. మీ ఇద్దరికి ఇదివరకే పరిచయం ఉందా అని విద్య అడుగుతుంది.

నా దగ్గర సలహాలు అడిగి నా కొంపే ముంచబోయాడని. చాలా పెద్ద రహస్యం ఉంది. చెబితే ఇక్కడే లాగిపెట్టి కొట్టి వెళ్లిపోతావ్ అని బాలు అంటాడు. అంత పెద్ద ఫ్రాడా అని విద్య అంటే.. నీకన్నా, ఆ పార్లరమ్మా కంటే పెద్ద ఫ్రాడ్ కాదులే అని బాలు అంటాడు. అసలు ఏం చేశాడని విద్య అడిగితే.. నీకంటే ముందు నా దగ్గర సలహాలు అడిగి నా భార్యకే లైన్ వేశాడు. పెళ్లి చేసుకుంటానని ఏకంగా ఇంటికే వచ్చాడని బాలు చెబుతాడు.

దాంతో మురళి భయపడిపోతాడు. అంతా నవ్వుతారు. నన్ను ఫ్రాడ్ అంటావేంటీ అని విద్య అంటే.. రోహిణి గురించి దాచావుగా. ఇంకేమైనా ఉన్నాయా అని బాలు అడుగుతాడు. చింటు తల్లి అని తెలిస్తే ఇంకా దాచడానికి రహస్యాలు ఏముండవు అని విద్య మనసులో అనుకుంటుంది. రోహిణిలాగా విద్యకు అబద్ధాలు చెప్పడం రాదని మీనా అంటుంది.

దొరికిపోయిన విల్లా విజయ్

విజయ్, భార్య లోపలికి వస్తారు. నాకు టైమ్ లేదు. త్వరగా అడ్వాన్స్ ఇస్తే పేపర్స్ మీద సంతకం చేసి వెళ్లిపోతానని అని విజయ్ అంటాడు. విజయ్‌ని బాలు, మీనా చూసి షాక్ అవుతారు. ఓహో ఇక్కడ టెండర్ వేశారా అని బాలు అనుకుంటాడు. మీనా వెళ్లి డోర్ వేస్తుంది. బాలును చూసి షాక్ అవుతారు విల్లా విజయ్ దంపతులు. ఏరా ఈ ఇల్లు కూడా నీదేనా అని బాలు అంటాడు.

మనోజ్, రోహిణిలను మోసం చేసింది వీళ్లే. మీరు మమ్మల్ని కలవడం నయమైందని బాలు అంటాడు. విల్లా విజయ్ పారిపోతుంటే బాలు, మీనా, విద్య పట్టుకుంటారు. రేయ్ 30 లక్షలు ఎక్కడరా అని బాలు అడిగితే.. ఎక్కడి 30 లక్షలు అని బుకాయిస్తాడు విజయ్. దాంతో విజయ్‌ని బాలు, అతడి భార్యను మీనా ఇద్దరు చితకబాదుతారు.

బాలు, మీనాపై రోహిణి, మనోజ్ నిందలు

బాలు పోలీసులకు ఫోన్ చేస్తాడు. విద్యను రోహిణికి చేయమంటాడు. మనోజ్, రోహిణి వస్తారు. రూ. 30 లక్షలు ఎక్కడరా అని అడుగుతారు. నలుగురు కలిసి ఇద్దరిని చితకబాదుతారు. ఇంతలో పోలీసులు వస్తారు. ఎంత అడిగిన డబ్బు గురించి చెప్పట్లేదని మీనా అంటుంది. ఇంతలో ఇంటి అసలు ఓనర్ వస్తాడు. మీ ఇంటిని ఇతను అమ్ముతాడట. కొంటారా అని బాలు అడుగుతాడు.

విల్లా విజయ్ దంపతులను పోలీసులు తీసుకెళ్తారు. ఈ బాలు ఒకడు. అనవసరంగా పోలీసులను పిలిచాడు. పోలీసులు రాకుంటే డబ్బులు వసూలు చేసుకునేవాళ్లం కదా. అన్నింట్లో దూరి సర్వనాశనం చేస్తాడు ఛీ అని రోహిణి మనసులో అనుకుంటుంది. నలుగురు ఇంటికెళ్తారు. ఏమైందని సత్యం అడిగితే.. మాకు అదృష్టం ఎదురైనా వీళ్లిద్దరు ఎదురై చెడగొడతారు అని మనోజ్ అంటాడు.

ఏం చేశార్రా అని ప్రభావతి అంటే.. మీ పెద్దకొడుకు 30 లక్షలు మింగేశామని మీనా కౌంటర్ ఇస్తుంది. 30 లక్షలు రాకుండా చేశారుగా అని రోహిణి అంటుంది. ఆ మాట అనడానికి మీకైనా ఉండాలి పడటానికి మాకైనా ఉండాలని మీనా అంటుంది. ఏంటీ సిగ్గా.. రోహిణికి లేదుగా. సిగ్గు వదిలేసి తిరుగుతోందిగా అని గట్టి కౌంటర్ ఇస్తుంది శ్రుతి. అసలు ఏమైందిరా అని సత్యం అడుగుతాడు.

రోహిణికి సిగ్గు లేదు

జరిగింది చెబుతాడు బాలు. వాడు రూపాయి ఇవ్వకముందే వీడు పోలీసులకు అప్పజెప్పాడు అని మనోజ్ అంటాడు. వాడు డబ్బు ఇస్తే మేము ఎక్కడ బాగుపడిపోతామో అని వాడిని డబ్బు అడగకముందే పోలీసులకు అప్పజెప్పారు అని రోహిణి అంటుంది. శ్రుతి నువ్వు చెప్పింది నిజమే. సిగ్గులేదు. ఆ డబ్బులో మాకు వాటా ఉంది. మీ కష్టార్జితమే అన్నట్లు ఇద్దరు మాట్లాడతారేంటని మీనా ఫైర్ అవుతుంది.

రోహిణి మీద అరుస్తున్నావ్ ఏంటని సపోర్ట్‌గా మాట్లాడుతుంది ప్రభావతి. ఏంటీ డబ్బు పేరు వినగానే మలేషియా మంత్రగత్తె మీద ప్రేమ కురుస్తోందా. ఇదే ఇంకెవరైనా అయితే మా పూల బ్యాచ్‌ని తీసుకొచ్చి బుద్ధి చెప్పి ఉండేదాన్ని. తోడికోడలు కాబట్టి బతికిపోయిందని మీనా అంటుంది. నేను అన్నదాంట్లో తప్పేముందని రోహిణి అంటుంది.

మీనా ఇంత తిట్టినా సిగ్గురాలేదా. అదేం విచిత్రమైన జన్మ రోహిణి నీది అని శ్రుతి అంటుంది. పోలీసులకు అప్పగిస్తే మొత్తం డబ్బు రికవరీ చేసి ఇస్తారని బాలు అంటాడు. ఇంకెక్కడ రికవరీ చేస్తారు. మొత్తం డబ్బు తిన్నామని చెబుతున్నారని రోహిణి అంటుంది. అలా అయితే పోలీసులకు అప్పగించకుంటే మీరేలా వసూలు చేస్తారు. ఓసారి నీ మొగుడు కళ్లు పోగొట్టుకున్నాడు. నువ్వు చేతులు ఊపుకుంటూ వచ్చావని శ్రుతి అంటుంది.

బాలు మీనా చేసిందే కరెక్ట్

మాకు అప్పజెప్పి ఉంటే సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేసి రాబట్టేవాళ్లమని రోహిణి, మనోజ్ అంటారు. ఆపండి. బాలు మీనా చేసిందే కరెక్ట్. వాడు డబ్బు కొట్టేసి 4 నెలలు అవుతుంది. వాడి దగ్గర ఎందుకుంటుంది. పోలీసులకు అప్పగిస్తే జైలుకు పంపిస్తారని భయపడి ఏ ఆస్తులు అమ్మైనా సరే డబ్బు కడతారు. ఏదైనా చట్ట ప్రకారమే చేశారు అని సత్యం అండగా నిలబడతాడు.

మీరు ఎంత గింజుకు చచ్చినా విల్లా విజయ్ నుంచి రూపాయి రాదు. వచ్చినా మా ఇద్దరికి వాటా రాదు. అది నాన్న రిటైర్‌మెంట్ డబ్బు. ఇప్పటివరకు పట్టించుకోలేదు. కానీ మా ఇద్దరిది తప్పు అంటున్నారు కాబట్టి న్యాయంగా మాకు రావాల్సిన దాని గురించే మాట్లాడుతాం అని బాలు అంటాడు. ఇకనుంచి మిమ్మల్ని పాపం అనకూడదు. ఏం చేసిన మా మెడకే చుట్టుకుంటుంది అని మీనా అంటుంది.

అనకండి. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండని రోహిణి పొగరుగా సమాధానం ఇస్తుంది. చీటర్, ఫ్రాడ్, డాన్‌వి, దొంగవి. అలా దొంగలాగే దూరం ఉంచాలి. నీకు మనోజ్ వేస్ట్. ఆంటీనే కరెక్ట్. బయటకు గెంటేస్తే బాలు, మీనాలే తీసుకొచ్చేలా చేశారు. సిగ్గుశరం లేకుండా వాళ్లనే అంటున్నారు అని శ్రుతి తిట్లదండకం చదివితే రవి ఆపి తీసుకెళ్తాడు.

రోహిణి నన్ను అవమానించింది

తిట్టాల్సిన తిట్టాక తీసుకెళ్లాడు. రవికి కూడా మేమంటే కోపమే అని రోహిణి అంటుంది. శ్రుతి అనే పద్ధతి సరిగ్గా లేకున్నా కరెక్టుగానే అందని సత్యం అంటాడు. ఇంతకీ 30 లక్షలు దొరకలేదని ఈసడించుకుని ప్రభావతి వెళ్లిపోతుంది. మనోజ్ డబ్బు రానందుకు ఫీల్ అయితే.. రోహిణి శ్రుతి తిట్టినందుకు అవమానంగా ఫీల్ అవుతుంది. బాలు, మీనాల వల్లే డబ్బు రాలేదని మళ్లీ నిందలు వేస్తుంది రోహిణి.

ఏం చేసిన సరే వాడి నుంచి డబ్బు రాబట్టాలి. ఆ బాలు గాడి వల్ల ఎప్పుడు నష్టమే. బిజినెస్ నడవట్లేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. క్రెడిట్ కార్డ్ బిల్స్ పెండింగ్ పడుతున్నాయి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదని, ఆర్థిక కష్టాల గురించి మనోజ్ బాధపడుతుంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks