గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కారులో ప్రభావతి, సత్యం కలిసిపోవడం గురించి మాట్లాడుకుంటారు. తల్లి చెప్పడంతో ప్రభావతికి సత్యం బొట్టు పెడతాడు. అంతా చప్పట్లు కొడతారు. ఇంట్లో మూడు జంటలు ఉన్నాయి. మీరు ఆదర్శంగా ఉండాలంటుంది సుశీల. తప్పు తాను చేసిన రవినే సారీ చెప్పాలన్న కండిషన్ మీదే పెళ్లి చేసుకున్నామని శ్రుతి చెబుతుంది.
సర్దిచెప్పితే రవిగాడిని కన్నారు

ఇదివరకు ఓ సారి ఇలాగే గొడవ పడితే సర్దిచెప్పాను. తర్వాత రవిగాడిని కని చేతిలో పెట్టారని సుశీల అంటుంది. దాంతో ఇప్పుడు సత్యం, ప్రభావతి మరోకరిని కంటారు అనేలా మొహాలు పెడతారు. ఇప్పుడు కూడా సర్దిచెప్పావుగా. ఇంకో పది నెలల్లో తమ్ముడు పుడతాడా అని బాలు అంటాడు. అంతా నవ్వుతారు. ఇవాళ నా చేత్తో మీకు వండిపెడతాను అని సుశీల అంటుంది.
మరోవైపు సంజు ఫంక్షన్‌కు వెళ్తే భార్యతో కూడా రమ్మన్నారుగా. తీసుకెళ్లు అని తల్లి చెబుతుంది. నా స్టేటస్ ఏమైపోవాలని సంజు అంటుంది. దాంతో సంజును తిట్టి మౌనిక వెళ్లేలా చేస్తుంది అత్త. కాస్ట్‌లీ చీర కట్టుకుని రమ్మంటాడు సంజు. దాంతో మౌనిక చీర మార్చుకుని వస్తుంది. సంజు, మౌనిక ఇద్దరు వెళ్తారు. ఇదే ఏడుపు మొహం పెట్టుకుని ఉండకు, కాస్ట్‌లీ చీర కట్టుకోమంటే మా అమ్మ పనిమనిషికి ఇచ్చే చీర కట్టుకున్నావ్ అనేసి వెళ్లిపోతాడు సంజు.
అప్పుడే అక్కడికి ప్యాసెంజర్‌ను దింపడానికి వచ్చిన బాలు మౌనికను చూసి లోపలికి వెళ్తాడు. మౌనిక పర్స్ మర్చిపోయిందని చెల్లి కోసం చూస్తాడు. ఇంతలో బాలును సంజు చూస్తాడు. మౌనిక దగ్గరికి బాలు వెళ్లి మాట్లాడుతాడు. వాళ్లను పక్క ఉండి చూస్తాడు సంజు. పర్స్ తీసుకుని మౌనిక వెళ్లిపోతుంది. బాలు వెంటపడతాడు. తర్వాత గుడిలో జరిగింది తలుచుకుని సారీ చెబుతాడు బాలు.
బాలుకు అవమానం
సంజు దూరంగా ఉండి చూడటం గమనిస్తుంది మౌనిక. బాలు మాట్లాడుతుండగా.. పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఏంటీ సమస్య అని అడుగుతాడు. మా చెల్లెలితో మాట్లాడుతున్నాంటాడు బాలు. నిజంగా మీ బ్రదరేనా అని సెక్యూరిటీ అతను అడిగితే.. ఇతనెవరో తెలియదు. ఇక్కడి నుంచి వెళ్లమని చెప్పండి అని మౌనిక చెప్పేసి వెల్లిపోతుంది.
{{/usCountry}}సంజు దూరంగా ఉండి చూడటం గమనిస్తుంది మౌనిక. బాలు మాట్లాడుతుండగా.. పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఏంటీ సమస్య అని అడుగుతాడు. మా చెల్లెలితో మాట్లాడుతున్నాంటాడు బాలు. నిజంగా మీ బ్రదరేనా అని సెక్యూరిటీ అతను అడిగితే.. ఇతనెవరో తెలియదు. ఇక్కడి నుంచి వెళ్లమని చెప్పండి అని మౌనిక చెప్పేసి వెల్లిపోతుంది.
{{/usCountry}}దాంతో బాలును సెక్యూరిటీ గెంటేస్తాడు. ఎవడో ఒకడు తినడానికి, కొట్టేయడానికి వస్తారు అని బాలును మెడపట్టి గెంటేస్తాడ సెక్యూరిటీ గార్డ్. అది చూసిన క్షమించమని అంటుంది మౌనిక. ఇది కదా నాకు కావాల్సింది. నీ చెల్లెలితోనే నిన్ను గెంటించాను. ఇదే మొదలు. నీకు ఇక అన్ని అవమానాలే అని సంజు అనుకుంటాడు. మరోవైపు పురిటి నొప్పులకు డబ్బింగ్ చెప్పింది శ్రుతి గుర్తు చేసుకుని భయపడుతుంది.
రవి వచ్చి హగ్ చేసుకుంటే అరుస్తుంది. రవి చెంపచెల్లుమనిపిస్తుంది. రవికి దూరంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ, డెలివరి నొప్పుల గురించి చెప్పి దూరంగా ఉండమంటుంది శ్రుతి. ఎప్పటికీ నేను పిల్లలను కనను. ఆ బాధను నేను భరించలేను అని శ్రుతి అంటుంది. మనకు పిల్లలు వద్దా అని రవి అంటాడు. సరోగసీకి వెళ్దాం. ఇంకొకరి గర్భంలో పుట్టిన మన బేబీ అవుతుందా అని శ్రుతి అంటుంది.
శ్రుతి సరోగసీ పద్ధతి
పెద్దవాళ్లకు చెప్పకుండా ఎలా ఈ పద్ధతి ట్రై చేస్తామని రవి అంటే.. వాళ్ల ఒపినీయన్ గురించి ఎవడు అడిగాడు. పిల్లల గురించి మాట్లాడితే మాత్రం నేను నో అనే చెబుతాను అని శ్రుతి అంటుంది. ఇంటికి వచ్చిన బాలు బయట మెట్లపై కూర్చొంటాడు. జరిగింది తలుచుకుని ఏడుస్తాడు. మీనా వచ్చి అడుగుతుంది. అదోలా ఉన్నారని అడిగితే మౌనిక గురించి చెబుతాడు బాలు.
నా గుండె ఆగినంత పని అయింది. తను ఎందుకు అలా అర్థం కాలేదని బాధపడతాడు బాలు. మీనా ఓదారుస్తుంది. తర్వాత రాజేష్‌కు తన కారు రెంట్‌కు ఇచ్చినట్లు ఇంట్లో చెబుతాడు బాలు. ఇలాంటివే 200 కారులు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని రాజేష్ అంటాడు.
బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే స్ట్రేచర్ ఉండాలంటాడు మనోజ్. బంగారం ఎత్తుకెళ్లి అమ్మితే వస్తుందా. మీరు చూడండి మరో కొన్ని రోజుల్లో నా భర్త అని మీనా చిటికెలు వేస్తూ శపథం చేయబోతుంది. కానీ, దాన్ని బాలు ఆపుతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.