...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలును మెచ్చుకున్న ముంబై ముఖేష్- మనోజ్‌కు మళ్లీ డీలర్‌షిప్- గణ చేతికి శివ వీడియో

Gunde Ninda Gudi Gantalu Serial March 23rd Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 23 ఎపిసోడ్‌లో మనోజ్ ఆడిన డ్రామా గురించి, ముఖేష్ చెప్పింది అంతా చెబుతాడు బాలు. ఇంటికొచ్చిన ముఖేష్ ముందు మనోజ్‌ను తిట్టి, బాలు, సత్యంను మెచ్చుకుంటాడు. వాళ్లకోసమే మనోజ్‌కు తిరిగి మళ్లీ డీలర్‌షిప్ ఇస్తాడు.

Published on: Mar 23, 2026, 08:10:29 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో ముంబై ముఖేష్‌తో చాలా మాట్లాడాం, అంతా నిజం చెప్పేసాం కదా అని బాలు, రవి అంటారు. నువ్వు ఆడించిన నాటకం మొత్తం చెప్పేశామని రవి అంటాడు. నాటకం ఏంట్రా, ఎందుకు అంత కంగారుపడుతున్నారని సత్యం నిలదీస్తాడు.

మనోజ్ డ్రామా గురించి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 23 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 23 ఎపిసోడ్‌

దాంతో మనోజ్ డ్రామా గురించి బాలు చెబుతాడు. ముఖేష్ దగ్గర బిల్డప్ ఇచ్చారని శ్రుతి అంటుంది. మొత్తం కుటుంబాన్నే ఇలాంటి ఫ్రాడ్ పనిలోకి దింపావా అని సత్యం అంటాడు. నిన్ను మాత్రం చాలా మెచ్చుకున్నాడు నాన్న. అందుకే అబద్ధం చెప్పి మోసం చేయాలనిపించలేదు, అందుకే నిజం చెప్పానని బాలు అంటాడు.

బాలు కాలర్ పట్టుకుని నన్ను నిలువునా ముంచావు కదరా అని మనోజ్ అంటాడు. జెంటిల్ మెన్ అడిగితే చెప్పాలని నువ్వే అన్నావుగారా అని బాలు అంటాడు. అవును, నువ్వు చెప్పమంటేనే చెప్పాడు అని రవి అంటాడు. మరి నిజం తెలిసి కూడా అగ్రిమెంట్ పేపర్ ఇచ్చి వెళ్లిపోయాడేంటీ అని రోహిణి అంటుంది. దాంతో అగ్రిమెంట్ పేపర్‌ను సరిగ్గా చూస్తాడు మనోజ్.

ఏదైనా ఫ్రాడ్ జరిగి డీల్ క్యాన్సిల్ చేస్తే నేను వాళ్లకు రూ. 50 లక్షలు ఇవ్వాలని రాసి ఉంది. నిలువెల్లా నష్టపోయాను బాధతో అంటాడు మనోజ్. దాంతో అంతా షాక్ అవుతారు. రేయ్.. అందుకే తాగి ఉన్నప్పుడు ఎందుకురా. తర్వాత తీరిగ్గా చదివి సంతకం పెట్టరా అంటే.. జెంటిల్ మెన్ జెంటిల్ మెన్ అన్నావని బాలు అంటాడు. బాలును, రోహిణి, ప్రభావతి అంటే.. సత్యం అడ్డుపడతాడు.

జైలుకు వెళ్లాలి

కోట్ విప్పేసి వెళ్లిపోతాడు. అదే ఛాన్స్ అనుకున్న రోహిణి కోట్‌లో నుంచి బాలు ఫోన్ తీసుకుని తన బ్యాగ్‌లో పెట్టుకుంటుంది. మరోవైపు హాల్లో ప్రభావతి టెన్షన్ పడితే సత్యం ఓదారుస్తాడు. నా ఇంటికి శనిలా దాపురించావని, నువ్వు బయటకు వెళ్లినప్పుడే ఇల్లు బాగుపడుతుందని బాలును తిడుతుంది ప్రభావతి. ఇంతలో ముంబై ముఖేష్ సత్యం ఇంటికి వస్తాడు.

అబద్ధాలు చెప్పిన ఫ్రాడ్ ఎక్కడ అని అడుగుతాడు. ప్రభావతి వెళ్లి మనోజ్‌ను పిలుచుకు వచ్చేందుకు వెళ్తుంది. సర్ నాకు ఇదంతా నాకు తెలియదు. లేకుంటే అప్పుడే వద్దనేవాన్ని. మాకు ఉంది ఇంతే ఆస్తి. మీకు ఏదైనా ఎక్కువ చేసి చెప్పుంటే నేను క్షమించమని అడుగుతున్నాను అని సత్యం అంటాడు. మీ సంజాయిషీ కోసం రాలేదని ముఖేష్ అంటాడు.

ఒక్కో మెట్టు ఎక్కాలి

పైకి ఎదగడానికి ఆశపడి చేశానని మనోజ్ అంటాడు. పైకి రావాలంటే ఒక్కో మెట్టు ఎక్కాలి. అగ్రిమెంట్ చూసుకున్నారుగా. డీలర్‌షిప్ క్యాన్సిల్ చేస్తున్నా. 50 లక్షలు కట్టాలి అని ముఖేష్ అంటాడు.

మిమ్మల్ని మోసం చేయాలని కాదు, తొందరగా ఎదగాలని ఆశతో చేశాడు. 50 లక్షలు కట్టే పరిస్థితి వాడికి లేదు. నేను నిజం చెప్పినందుకు నేను క్షమాపణ కోరుతున్నా. వాడికి చాలా డిగ్రీలు ఉన్నా కలిసిరావడంలేదు. అందుకే నేను కూడా అబద్ధం ఆడాను. కానీ, మా నాన్న పెంపకం నిజం చెప్పించింది. నిజం చెబితే వాడికి ఏమవుతుందో ఆలోచించిక చెప్పాను. క్షమించండి సర్ అని బాలు చేతులెత్తి మొక్కుతాడు.

దాంతో బాలు భుజంపై చేయి వేసి మెచ్చుకుంటాడు ముంబై ముఖేష్. సత్యమేవ జయతే, సత్యం ఎల్లప్పుడు జయిస్తుంది. ఇదంతా మీ నాన్న పెంపకం గొప్పతనం. నేను మీకే క్షమాపణ చెబుతున్నాను. మీ పెంపకం బాగుంది. కానీ, అందరు కొడుకులు పాటించాలని రూల్ లేదు. కానీ, బాలు మాత్రం మీ మాట నిలబెడతాడు. మీ ఆశయాలు పాటిస్తాడు అని గొప్పగా చెబుతాడు ముఖేష్.

మనోజ్‌కు మళ్లీ డీల్

కోట్లు నష్టం వస్తుందన్న బాలు నిజం చెప్పాడు. బాలు చెప్పింది కరెక్ట్ ఎదగాలన్న ఆలోచన నిన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు. మొదటిసారి మోసం చేసినవాళ్ల మీద కోపం రావట్లేదు. అందుకు కారణం మీ కుటుంబం, మీ నాన్న, మీ బాలు. నువ్వు మీ అమ్మలా ఉన్నావ్, మీ నాన్నలా బాలు ఉన్నాడు అని ముఖేష్ అంటాడు.

ఈ అగ్రిమెంట్ పట్టుకుని నేను కోర్టుకు వెళ్లొచ్చు అని చెప్పిన ముఖేష్.. కానీ నేను వెళ్లట్లేదు. కుటుంబంలో ఒక్కరు పట్టాలు తప్పితే అంతా నాశనం అవుతుంది. అందుకే నీకు డీలర్‌షిప్ ఇస్తున్నాను. ఈ అగ్రిమెంట్ చింపేస్తున్నాను అని చింపేస్తాడు. కొత్త డీల్‌కు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తే మనోజ్ సంతకం చేస్తాడు. మీరు నిజంగా దేవుడు అని సత్యం అంటాడు.

తర్వాత ఇందాకా మా ఆయన్ను ఏదో అన్నారు. ఇప్పుడు ఏమంటారు అని మీనా అంటే.. నేను చచ్చినా వాడు మారడు అని వెళ్లిపోతుంది. దాంతో బాలు చిన్నబుచ్చుకుంటాడు. కిచెన్‌లో బాలు, మీనా మాట్లాడుకుంటారు. కడుపులో ఏది దాచుకోరు అని మీనా అంటుంది. మంచి జరుగుతుంది అంటే కొన్ని దాస్తాను. ఒకటి దాచాను. నీ క్షేమం కోసమే దాచాను అని బాలు అని బయటకు వెళ్తాడు.

గుణకు శివ వీడియో

తర్వాత బాలు తన ఫోన్ ఎక్కడ ఉందని మీనాను పిలిచి అడుగుతాడు. కోట్, ప్యాంట్‌ జేబుల్లో వెతకమంటాడు బాలు. మీనా వెళ్లి వెతుకుతుంది. మరోవైపు గుణకు శివ దొంగతనం వీడియో పంపిస్తుంది రోహిణి. బాలు దొరికార్రా అని గుణ అనుకుంటాడు. ఫోన్ పోతే పోయిందిరా అని సత్యం అంటే.. అందులో ముఖ్యమైన వీడియో ఉంది అని బాలు నోరుజారుతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe