గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు బయట మందు తాగుతున్నాడని మనోజ్ అంటే.. ఆయన ఎందుకు బయటకు వెళ్లాలో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఇక్కడే నేనే అని ఆగిపోతుంది మీనా. ఎక్కడికి వెళ్లాడని సుశీల అంటే వస్తారని మీనా అంటుంది. అన్నయ్య కూడా గిఫ్ట్ కొనడానికి వెళ్లినట్లున్నాడు అని రవి అంటాడు.
200కి బేరాలు

పుట్‌పాత్ మీద దొరికే 500న గిఫ్ట్‌ను 200లకు బేరాలు ఆడి తీసుకొస్తాడు అని అవమానిస్తాడు మనోజ్. అత్తింటి సొమ్ముతో షాప్ పెట్టుకున్న మీరు కూడా మాట్లాడుతున్నారే. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తానాను నీ భార్యకు ఏనాడైనా మూరెడు మల్లెపూలు కొన్నారా అని మీనా అంటుంది. అది మా పర్సనల్ అని రోహిణి అంటే.. మరి నా మొగుడు గురించి అనడం ఎందుకని మీనా అంటుంది.
కరెక్టే కదా. భర్తను అంటే ఎవరైనా అంటారు. అందరూ అత్తయ్యలా మావయ్యను ఏమన్నా చూస్తు ఉన్నట్లు ఉండలేరుగా అని శ్రుతి అంటుంది. అబ్బా ఎంత బాగా అర్థం చేసుకున్నావ్ అని కామాక్షి మెచ్చుకుంటుంది. వాడు ఏదో తెస్తాడని కాదు నా ప్రతి పుట్టిన రోజుకు వాడు ఉండేవాడు. ఇప్పుడు లేకపోయేసరికి ఏమైందో అని భయంగా ఉందని సుశీల అంటే అలాంటిదేం జరగదు అని మీనా అంటుంది.
బాలు వచ్చే గ్యాప్‌లో గిఫ్ట్స్ చూడమని సత్యం చెబుతాడు. దాంతో మనోజ్ తెచ్చిన నెక్లెస్ ఇస్తాడు. రవి షుగర్‌లెస్ కేక్ చేసినట్లు రవి చెబుతాడు. అలాంటిది తొలిసారిగా చేసినట్లు చెబుతాడు రవి. అంతా చప్పట్లు కొడతారు. శ్రుతి ఫోన్ గిఫ్ట్‌గా ఇస్తుంది. సుమతితో చీర ఇప్పిస్తుంది పార్వతి. 200, 300లు పెట్టి కొన్నారా అని అమానిస్తుంది ప్రభావతి.
ప్రభావతి టీవీ గిఫ్ట్
చీర చాలా బాగుందని సుశీల అంటుంది. మీనాను సుశీల, మౌనిక పొగుడుతారు. తర్వాత సుశీలకు టీవీ గిఫ్ట్‌గా ఇస్తుంది ప్రభావతి. వెళ్లొస్తామని పార్వతి, సుమతి వెళ్లిపోతారు. బాలు గురించి సుశీల అడిగేలోపు బాలు వస్తాడు. ఎక్కడికి వెళ్లావ్ అని సుశీల అడిగితే బ్లౌజ్ పీస్ తీసుకురావడానికి అని మనోజ్ అవమానిస్తాడు. అందరూ ఏమిచ్చారో గొప్పగా చెబుతారు.
{{/usCountry}}చీర చాలా బాగుందని సుశీల అంటుంది. మీనాను సుశీల, మౌనిక పొగుడుతారు. తర్వాత సుశీలకు టీవీ గిఫ్ట్‌గా ఇస్తుంది ప్రభావతి. వెళ్లొస్తామని పార్వతి, సుమతి వెళ్లిపోతారు. బాలు గురించి సుశీల అడిగేలోపు బాలు వస్తాడు. ఎక్కడికి వెళ్లావ్ అని సుశీల అడిగితే బ్లౌజ్ పీస్ తీసుకురావడానికి అని మనోజ్ అవమానిస్తాడు. అందరూ ఏమిచ్చారో గొప్పగా చెబుతారు.
{{/usCountry}}ఇక వీడియో మొదలుపెట్టనా అని మీనా అంటే.. అందరు ఆగేలా లేరు మొదలెట్టు అంటాడు బాలు. సుశీల కళ్లు మూస్తాడు బాలు. ఇంతలో సుశీల చిన్ననాటి ఫ్రెండ్ సుబ్బులు వస్తుంది. సుబ్బులును చూసి సుశీల తెగ సంబరపడిపోయి కౌగిలించుకుంటుంది. నీ బాల్యాన్ని నీకు గుర్తు చేయడానికే నాకోసం వెతుక్కుంటూ వచ్చాడు. నీ మనవడు నీకిచ్చే బర్త్ డే గిఫ్ట్ ఇదేనే అని సుబ్బులు అంటుంది.
తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది సుశీల. తర్వాత సుశీల మరో ఇద్దరు ఫ్రెండ్స్ రాజీ, సత్యవతి ఒక్కొక్కరిగా వస్తారు. వాళ్లందరిని చూసి సుశీల సంబరపడిపోతుంది. అదంతా మీనా వీడియో తీస్తుంది. అలా సుశీల ఆఖరి కోరికను బాలు నెరవేర్చుతాడు. నీ మనవడు మహా తెలివైనవాడే. నీకు మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చాడే అని సత్యవతి అంటుంది.
బాలు సర్‌ప్రైజ్
వీళ్లు నీకెలా తెలుసురా అని సుశీల అడిగితే.. మీనా చెప్పిందని బాలు అంటాడు. ఉదయం సుశీల చెప్పిన వీడియో ఆయనకు పంపించానని మీనా చెబుతుంది. అంటే నా సంతోషానికి కారణం మీరిద్దరు అన్నమాట అని సుశీల అంటుంది. తన కుటుంబాన్ని ఫ్రెండ్స్‌కు సుశీల పరిచయం ఇస్తుంది. గ్రేట్ సర్‌ప్రైజ్ అని బాలును పొగుడుతుంది శ్రుతి.
సత్యవతి భర్త గోపాలం కూడా వచ్చాడని చెబుతుంది. దానికి సిగ్గేస్తుందని సుశీల అంటుంది. సుశీలను మా ఆయన ప్రేమించి చచ్చాడులే అని సత్యవతి చెబుతుంది. అంతా సుశీల లవ్ స్టోరీ గురించి అడుగుతారు. అది వన్ సైడ్ లవ్ స్టోరీ అని, సుశీల వెంట పడుతుంటే నా వెంట పడుతున్నాడని మురిసిపోయేదాన్ని అని సత్యవతి చిన్నప్పుడు జరిగింది చెబుతుంది.
తర్వాత సుశీల కేక్ కట్ చేస్తుంది. తన మనసులోని కోరికను తీర్చిన బాలుకే తన గిఫ్ట్ ఇస్తానని చెబుతుంది సుశీల. అలాగే ఇస్తుంది. దాంతో ప్రభావతి, మనోజ్, రోహిణి అంతా నిరాశపడతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.