గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా వండిన చేపల పులుసు తినడానికి రెడీ అవుతారు. ప్రభావతిని మీనా రమ్మంటుంది. ఇంతలో మనోజ్ వస్తాడు. బయటకు వెళ్లి మాట్లాడుతారు. ఇచ్చావా, తెచ్చావా, సమస్య రాదుగా అని ప్రభావతి అంటే.. నాకైతే రాదు. అదే మనకేం రాదు అని మనోజ్ అంటాడు. ఏదో జరుగుతుంది అని మీనా డౌట్‌గా అంటుంది.
మళ్లీ ఏం మింగావురా

దాంతో మనోజ్‌ను లక్షలు మింగినోడా. మళ్లీ ఏం మింగి చచ్చావురా అని బాలు పిలుస్తాడు. ప్రభావతి, మనోజ్ వస్తారు. బయట ఇద్దరే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మాట్లాడితే ఏమైందని మీనా అడుగుతుంది. మళ్లీ కొంప మీదకు ఏం తీసుకొచ్చారు అని సత్యం అంటాడు. ఏం లేదని చెప్పిన ప్రభావతి రోహిణిని తీసుకురమ్మని మనోజ్‌కు చెప్పి పంపిస్తుంది.
మరోవైపు రోహిణి సంతోషపడుతుంటుంది. మనోజ్ రాగానే నాలుగు లక్షల ఫర్నిచర్ అమ్మడం ఏంటీ. లక్ష లాభం రావడం ఏంటీ సంతోషిస్తుంది. దానికి మనోజ్ షాక్ అవుతాడు. బిజినెస్‌లో పండిపోయావ్ అని రోహిణి అంటే పండానో, ఎండిపోయానో అని మనోజ్ అనుకుంటాడు. లాభం వచ్చిన లక్ష ఏది అని రోహిణి అడిగితే తీసి ఇస్తాడు మనోజ్.
అబ్బా ఇలాంటి రోజు.. రోజు రావాలి. ఈ లక్షతో గోవాకు వెళ్దాం. నిన్ను తక్కువ చేసినవాళ్లకు ఈ లక్ష చూపించి నోళ్లు మూయించాలి. ముఖ్యంగా బాలుకు అని కిందకు మనోజ్‌ను తీసుకెళ్తుంది రోహిణి. వంట గురించి ప్రభావతిని తిడుతూ మీనాను పొగుడుతాడు సత్యం. ఇంతలో రోహిణి వచ్చి సర్‌ప్రైజ్ అని చెబుతుంది. రోహిణి పెద్ద షో చేసి లక్ష చూపిస్తుంది.
లక్ష లాభమంటూ రోహిణి షో
నాలుగు లక్షల ఫర్నిచర్ సేల్ చేసి లక్ష లాభం తెచ్చాడు అని రోహిణి అంటుంది. ప్రభావతికి పొలమారుతుంది. లక్ష లాభం అంటే నాలుగు లక్షలకు వచ్చిందా. మొత్తం ఐదు లక్షల అని మీనా అడుగుతుంది. అంతేగా అని రోహిణి అంటుంది. కాదు. నాలుగు లక్షల్లో మిగిలిన లక్ష లాభం అని మనోజ్ అంటాడు. ప్రభావతి సైలెంట్‌గా ఉండేసరికి అందరికి అనుమానం వస్తుంది.
{{/usCountry}}నాలుగు లక్షల ఫర్నిచర్ సేల్ చేసి లక్ష లాభం తెచ్చాడు అని రోహిణి అంటుంది. ప్రభావతికి పొలమారుతుంది. లక్ష లాభం అంటే నాలుగు లక్షలకు వచ్చిందా. మొత్తం ఐదు లక్షల అని మీనా అడుగుతుంది. అంతేగా అని రోహిణి అంటుంది. కాదు. నాలుగు లక్షల్లో మిగిలిన లక్ష లాభం అని మనోజ్ అంటాడు. ప్రభావతి సైలెంట్‌గా ఉండేసరికి అందరికి అనుమానం వస్తుంది.
{{/usCountry}}లేదు. నాకు ఇందాకే చెప్పాడు. దిష్టి తగులుతుందని మనసులోనే దాచుకున్నాను అని ప్రభావతి అంటుంది. అత్తయ్య మీరు స్లీపింగ్ పార్టనర్ కదా. ఇది మీ లాభం అని ఆ లక్ష ప్రభావతికి ఇస్తుంది రోహిణి. అది తీసుకుని మనోజ్‌ను ఏంట్రా ఇదంతా. ఇవి మీనా నగలు అమ్మి తీసుకొచ్చినవని తెలిస్తే చేపలు కోసినట్లు కోస్తారు. భయంతో వణికి చస్తున్నాను అని ప్రభావతి అంటుంది.
మరుసటి రోజు ఉదయం కాఫీ పెట్టి అందరిని పిలవాలని తెలియదా అని మీనాపై అరుస్తుంది ప్రభావతి. దాంతో బాలు విజిల్ ఊదుతు అందరిని పిలుస్తాడు. దాంతో భరించేక అందరూ కిందకు వస్తారు. బాలు జరిగింది చెబుతాడు. ఇకనుంచి ఇలాగే అందరిని పిలు అని మీనాకు బాలు చెబితే సరేనంటుంది. ఇంతలో సత్యం వస్తాడు. సుశీల కాల్ చేస్తుంది.
సుశీల 75వ బర్త్ డే
నాకు తెలుసు నువ్వెందుకు కాల్ చేశావో. నీకు 75వ పుట్టినరోజు వస్తుంది అని సత్యం మాట్లాడుతాడు. బాలు తీసుకుని మాట్లాడుతాడు. ప్రభావతిపై కౌంటర్స్ వేస్తుంటారు. ఆరు పుష్కరాలు చూశాను. వచ్చే ఏడాదికి ఉంటానో ఉండనో. మీ అందరితో పుట్టినరోజు జరుపుకోవాలని ఉంది. అందరిని తీసుకురా సత్యం అని సుశీల అంటుంది. అందరూ సైలెంట్ అవుతారు.
అందరికి కుదరాలిగా అని సత్యం అంటాడు. తలో ఒకరు కారణం చెబుతారు. అందరం రావడానికి బదులు మీరు ఒక్కరే వస్తే బాగా పుట్టినరోజు జరుపుకోవచ్చు అని మీనా చెబుతుంది. సత్యం, బాలు, శ్రుతి కూడా అదే అంటారు. దాంతో సుశీల వస్తానని ఒప్పుకుంటుంది. అయ్యయ్యో ఈవిడేంటీ ఇంత ఈజీగా ఒప్పుకున్నారు. మళ్లీ అత్త పోరు తప్పదా అని ప్రభావతి మనసులో భయపడుతుంది.
కరిగిన మీనా నగలు
తర్వాత బామ్మ పుట్టినరోజుకు మంచి గొలుసు చేయిద్దామనుకున్నాను. ఈ పుట్టినరోజుకు ఇస్తే బాగుంటుంది అని బాలు చెబితే అత్తయ్య దగ్గర పెట్టిన మన నగలను తాకట్టు పెట్టి అమ్మమ్మకు చైన్ కొనివ్వండి అని మీనా చెబుతుంది. ఆ మాటలు విన్న మనోజ్ వెళ్లి ప్రభావతికి చెబుతాడు. వెంటనే నగలు తీసుకురారా అని ప్రభావతి అంటే నగలను కరిగించేశారట అని మనోజ్ చెబుతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.