Haiku Movie Review And Rating In Telugu:

టైటిల్: హైకూ
నటీనటులు: శ్రీదేవి అపల్ల, ఏగన్, పెమీనా జార్జ్, మైమ్ గోపి, ఇందుమతి మణికందన్, అధిర్చి అరుణ్, సుబ్రమణ్య సేతు తదితరులు
దర్శకత్వం: యువరాజ్ చిన్నస్వామి
సంగీతం: సిద్దూ కుమార్,
సినిమాటోగ్రఫి: పియూష్ గురుస్వామి
ఎడిటింగ్: శకత్తి ప్రణేష్ పీ
నిర్మాతలు: డాక్టర్ అరుళానంధు, మ్యాథ్యూ అరుళానంధు
బ్యానర్: విజన్ సినిమా హౌస్
విడుదల తేది: 23 అక్టోబర్ 2026
సినిమా రంగంలో ప్రేమకథలకు కొదవలేదు. అయితే, బ్రేకప్ తర్వాత ఒక మనిషి ఆలోచనా విధానంలో వచ్చే మార్పులను, మానసిక పరిపక్వతను స్పృశిస్తూ సినిమాలు రావడం అరుదు. 'కోళిపణ్ణై చెల్లదురై' సినిమాలో పల్లెటూరి యువకుడిగా అలరించిన నటుడు ఏగన్.. ఈసారి సరికొత్త గ్లామరస్ లుక్‌తో హీరోగా చేసిన సినిమా 'హైకూ'.
కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి తమిళ డెబ్యూ
కోర్ట్ మూవీ ఫేమ్ శ్రీదేవి అపల్ల హీరోయిన్గా చేసింది. ఈ సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీలోకి శ్రీదేవి అడుగుపెట్టింది. ఆమెతోపాటు మరో హీరోయిన్గా ఫెమీనా జార్జ్ చేసింది. ఈ సినిమాకు యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వం వహించారు. "తొలి ప్రేమలో విఫలమైన వ్యక్తి, తన తప్పులను దిద్దుకుని రెండో ప్రేమలో మంచి భాగస్వామిగా మారగలడా?" అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇవాళ (అక్టోబర్ 23) థియేటర్లలో హైకూ మూవీ విడుదల కానుంది. అయితే, రిలీజ్‌కు ఒకరోజు ముందే హైకూ ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి హైకూ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
కోయంబత్తూర్‌కు చెందిన మనోహరన్ అలియాస్ మనో (ఏగన్) కథ ఇది. మనోహర్ గర్ల్స్ కాలేజీలో చేరతాడు. ఆ కాలేజీలో ఏకైక అబ్బాయి కావడంతో మనోను అమ్మాయిలు ర్యాగింగ్‌కు గురవుతాడు. ఈ క్రమంలో అదే కాలేజీలో చదువుకుంటున్న జాబిలి అలియాస్ కోడి (శ్రీదేవి అపల్ల)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లి బ్రేక్ పడుతుంది.
{{/usCountry}}కోయంబత్తూర్‌కు చెందిన మనోహరన్ అలియాస్ మనో (ఏగన్) కథ ఇది. మనోహర్ గర్ల్స్ కాలేజీలో చేరతాడు. ఆ కాలేజీలో ఏకైక అబ్బాయి కావడంతో మనోను అమ్మాయిలు ర్యాగింగ్‌కు గురవుతాడు. ఈ క్రమంలో అదే కాలేజీలో చదువుకుంటున్న జాబిలి అలియాస్ కోడి (శ్రీదేవి అపల్ల)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లి బ్రేక్ పడుతుంది.
{{/usCountry}}బ్రేకప్ తర్వాత జాబిలి జ్ఞాపకాలతో జీవిస్తున్న మనోకు తన కంపెనీలో అంప్రెటీస్గా చేరిన నివేదా (ఫెమినా జార్జ్) పరిచయం అవుతుంది. వీరి వర్క్ రిలేషన్ స్నేహంగా మారుతుంది. అప్పటికే లవ్ రిలేషన్షిప్ బ్రేకప్‌తో కుమిలిపోతున్న నివేదా, మనో ఇద్దరు లవ్‌లో పడుతారు.
ఆ తర్వాత ఏమైంది? నివేదాతో మనో సంతోషంగా ఉన్నాడా? ఇద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? అసలు జాబిలితో మనో లవ్‌కు ఎందుకు బ్రేక్ పడింది? అంతకుముందు వారిద్దరి ప్రేమ బలపడటానికి కారణాలు ఏంటీ? అసలు గర్ల్స్ కాలేజీలో మనో ఒక్కడే ఎందుకు చేరాల్సి వచ్చింది? రెండో లవ్ అయిన నివేదా కూడా మనోకు ఎందుకు దూరం కావాలనుకుంది? చివరికి జాబిలి, మనో, నివేదా బంధం ఎలా ముగిసింది? అనేదే హైకూ సినిమా.
విశ్లేషణ:
సాధారణంగా చాలా మంది జీవితాల్లో ప్రేమ, బ్రేకప్ వంటి ఘట్టాలు ఎదురవుతాయి. ఫస్ట్ లవ్, సెకండ్ లవ్ అంటూ పేర్లతో వివిధ రకాలుగా జీవితాలు గడిపేస్తుంటారు. అలా బ్రేకప్‌తో కొట్టుమిట్టాడుతున్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి తిరిగి ప్రేమలో పడితే ఏంటనేదే ఈ సినిమా కథ.
స్టోరీ పరంగా కొన్ని సన్నివేశాలు సాధారణంగా అనిపించినప్పటికీ, రిలేషన్‌షిప్‌ను దర్శకుడు యువరాజ్ చిన్నస్వామి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌లో మనోహర్, జాబిలిల కాలేజ్ ప్రేమకథ, ర్యాగింగ్, గర్ల్స్ కాలేజీలో మనో చేరడానికి కారణాలను, సామాజిక కట్టుబాట్ల నడుమ మనో, జాబిలి ఆలోచనలను బాగా ఆవిష్కరించారు.
ఎమోషనల్ గ్రాఫ్‌తో సెకండాఫ్
అందంగా సాగుతున్న మనో, జాబిలి ప్రేమలో ప్రతి జంటకు ఎదురయ్యే డామినేషన్ పాయింట్ తలెత్తుతుంది. ప్రతి ప్రేమకథలో బ్రేకప్ పడేందుకు కారణమయ్యే అదే పాయింట్‌ను ఇందులో కూడా డైరెక్టర్ చూపించారు. అయితే, మొదటి ప్రేమలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా రెండో ప్రేమను హీరో ఎలా నిలబెట్టుకున్నాడన్నది ఇంట్రెస్టింగ్గా చూపించారు.
సెకండాఫ్‌లో నివేదా పాత్ర ప్రవేశంతో కథలోని ఎమోషనల్ గ్రాఫ్ పెరుగుతుంది. గతంలో ఎదురైన ప్రేమ వైఫల్యాలు మనుషులను ఏ స్థాయిలో భయపెడతాయో, కొత్త బంధంలోకి వెళ్లకుండా ఎలా అడ్డుపడతాయో చాలా సహజంగా చూపించారు. పెళ్లి దాకా వెళ్లిన బంధం తెగిపోవడం, ఆ తర్వాత ఏర్పడే కొత్త పరిచయం మధ్య నలిగే ఒక యువకుడి మానసిక స్థితిని చక్కగా ఆవిష్కరించారు. క్లైమాక్స్ బాగుంది.
ఆకట్టుకునే విజువల్స్, సంగీతం
సినిమాటోగ్రాఫర్ పియూష్ గురుస్వామి విజువల్స్ ప్లజెంట్‌గా బాగున్నాయి. సిద్దూ కుమార్ అందించిన నేపథ్య సంగీతం కథలోని ఎమోషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది. సంక్లిష్టమైన పాత్రలు, విభిన్నమైన టైమ్‌లైన్స్ ఉన్నప్పటికీ ఎడిటర్ శకత్తి ప్రణేష్ ఎక్కడా గందరగోళం లేకుండా సన్నివేశాలను సమర్థవంతంగా కూర్చారు.
విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై నిర్మాతలు డాక్టర్ అరుళానంధు, మ్యాథ్యూ అరుళానంధు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇకపోతే యంగ్ హీరో ఏగన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరు ప్రియురాళ్ల మధ్య నలిగిపోయే భగ్న ప్రేమికుడిగా, నటనలో ఎంతో పరిణతి చూపించాడు.
ఎవరెలా చేశారంటే?
శ్రీదేవి తన పాత్ర పరిధి మేర ఎంతో పద్ధతిగా, మెచ్యూర్డ్‌గా నటించి మెప్పించింది. రెండో భాగంలో ఫెమీనా జార్జ్ ఎంట్రీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. గత బంధం నుంచి బయటపడలేక, కొత్త ప్రేమను స్వీకరించలేక తల్లడిల్లే యువతిగా ఆమె పండించిన భావోద్వేగాలు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ముగ్గురు నటీనటులు తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్‌గా చెప్పాలంటే సహజమైన ప్రేమకథలు, నేటితరం బంధాలలో ఎదురయ్యే సమస్యల ఆధారంగా రూపుదిద్దుకున్న 'హైకూ' ఒక మంచి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. బ్రేకప్ అనేది జీవితానికి ముగింపు కాదు, అది అనుభవాల పాఠం అని చాటిచెప్పే హైకూ నేటితరం ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది.