తెలుగు ప్రేక్షకులకు 'దేశముదురు' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ హన్సిక మోత్వానీ గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు మార్చి 11న హన్సిక మోత్వానీ, ఆమె భర్త సోహైల్ ఖతూరియాకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి మాట్లాడిన హన్సిక మోత్వానీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై తనదైన శైలిలో స్పందించారు.

"జనానికి క్లిక్‌బైట్ వార్తలు కావాలి, అవి వారికి దొరికాయి. హెడ్ లైన్స్ కావాలనుకున్నారు, అవి కూడా వచ్చాయి. వీటిపై నేను ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు, ఇకముందు కూడా ఇవ్వను. ఎందుకంటే అవన్నీ నాకు అనవసరం" అని హన్సిక మోత్వానీ స్పష్టం చేశారు.
తప్పుడు ప్రయాణం కంటే విడిపోవడమే మేలు
విడాకుల నిర్ణయం వెనుక ఉన్న భావోద్వేగాలను పంచుకుంటూ హన్సిక మోత్వానీ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పారు. "మనం ఒకసారి తప్పుడు రైలు ఎక్కామని తెలిశాక, అందులోనే ఉండి బాధపడటం కంటే మధ్యలోనే దిగిపోవడం మంచిది. నా నిర్ణయం పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నాను" అని హన్సిక వివరించారు.
సాధారణంగా సెలబ్రిటీల విడాకుల వ్యవహారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తుంటాయి. కానీ, హన్సిక మాత్రం హుందాగా వ్యవహరిస్తూ, ఏం జరిగిందనేది కేవలం మా ఇద్దరికే తెలుసని, ఆ విషయాలను ప్రైవేటుగా ఉంచడమే అందరికీ శ్రేయస్కరమని పేర్కొన్నారు.
అండగా నిలిచిన కుటుంబం
కష్టకాలంలో తన తల్లి, సోదరుడు కొండంత అండగా నిలిచారని హన్సిక చెప్పుకొచ్చారు. నిరంతరం నవ్వుతూ ఉండే హన్సిక, పెళ్లి తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారట. ఆమె సుఖ సంతోషాలకే ప్రాధాన్యం ఇవ్వాలని వారు ప్రోత్సహించడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోగలిగినట్లు హన్సిక తెలిపారు. విడాకుల తర్వాత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆమె తన కుటుంబంతో కలిసి జపాన్ పర్యటనకు కూడా వెళ్లి వచ్చారు.
గ్రాండ్ వెడ్డింగ్ నుంచి విడాకుల వరకు..
హన్సిక, సోహైల్ ఖతూరియా వివాహం 2022 డిసెంబర్లో జైపూర్‌లోని ముండోటా కోటలో అత్యంత వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుక జియో హాట్‌స్టార్ లో హన్సిక లవ్ షాదీ డ్రామాగా ఓటీటీ స్ట్రీమింగ్ అయింది. ఇంత హంగామా మధ్య జరిగిన పెళ్లి, కేవలం ఏడాదిన్నరలోపే విడాకుల వరకు వెళ్లడం సినీ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
వృత్తిపరమైన జీవితం
{{/usCountry}}హన్సిక, సోహైల్ ఖతూరియా వివాహం 2022 డిసెంబర్లో జైపూర్‌లోని ముండోటా కోటలో అత్యంత వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుక జియో హాట్‌స్టార్ లో హన్సిక లవ్ షాదీ డ్రామాగా ఓటీటీ స్ట్రీమింగ్ అయింది. ఇంత హంగామా మధ్య జరిగిన పెళ్లి, కేవలం ఏడాదిన్నరలోపే విడాకుల వరకు వెళ్లడం సినీ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
వృత్తిపరమైన జీవితం
{{/usCountry}}ప్రస్తుతం హన్సిక తన కెరీర్‌పై పూర్తి దృష్టి సారించారు. ఇటీవల తమిళ చిత్రం 'గార్డియన్'లో కనిపించిన హన్సిక తెలుగులో 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2' షోకి జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె 'నషా' అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. పర్సనల్ లైఫ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, ప్రొఫెషనల్‌గా మాత్రం మునుపటి కంటే వేగంగా దూసుకుపోవాలని హన్సిక మోత్వానీ నిశ్చయించుకున్నారు.