అగస్త్యను కన్నకొడుకులా కాపాడుకున్న హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్- ఫొటోగ్రాఫర్లపై మహీకా శర్మ సీరియస్- అడ్డుగా నిలబడి!
Mahieka Sharma Protects Hardik Pandya Son Agastya: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించింది. మైదానంలో హార్దిక్ సేన అదరగొడితే, గ్యాలరీలో అతని గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ, హార్దిక్ కొడుకు అగస్త్యను కాపాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ముంబైలోని వాంఖడే స్టేడియం ఆదివారం (మార్చి 29) ఒక హై-వోల్టేజ్ పోరుకు సాక్ష్యంగా నిలిచింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, అజింక్యా రహానే సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఒక వింత రికార్డుకు స్వస్తి పలికింది.

అగస్త్యను కాపాడుతూ.. ఫోటోగ్రాఫర్లపై మహియికా అసహనం!
2012 ఏప్రిల్ 4 తర్వాత, అంటే దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్ సీజన్‌లో తన మొదటి మ్యాచ్‌లోనే ముంబై విజయం సాధించడం విశేషం. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో జరిగిన పోరాటం కంటే బయట జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కెమెరా ఫ్లాష్ లైట్ల ధాటికి
హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్, మోడల్ మహీకా శర్మ.. హార్దిక్ కుమారుడు చిన్నారి అగస్త్యను వెంటబెట్టుకుని స్టేడియం నుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు వారిని చుట్టుముట్టారు. కెమెరా ఫ్లాష్ లైట్ల ధాటికి అగస్త్య ఇబ్బంది పడటం చూసిన మహీకా ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.
అగస్త్య చేతిని గట్టిగా పట్టుకుని కారు వైపు తీసుకెళ్తున్న ఆమె, ఫోటోగ్రాఫర్లను ఉద్దేశించి.. "కొంచెం పక్కకు తప్పుకోండి, నేను అగస్త్యతో ఉన్నాను" (థోడా సైడ్ ప్లీజ్, అగస్త్య కే సాత్ హూ) అంటూ గట్టిగా చెప్పారు.
బాబు ఇబ్బంది పడుతున్నాడు
మరో వీడియోలో కెమెరా లైట్లు ఆపాలని కోరుతూ.. "లైట్లు వేయకండి సార్, బాబు ఇబ్బంది పడుతున్నాడు. ఆర్ యు ఓకే?" అని అగస్త్యను ప్రేమగా అడుగుతూ కనిపించారు. ఒక తల్లిలా అగస్త్యను కెమెరా వెలుతురు తగలకుండా అడ్డుగా నిలబడటం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
హార్దిక్-మహీకా బంధం
హార్దిక్ పాండ్యా, 25 ఏళ్ల మోడల్ మహీకా శర్మ గత ఏడాది నుంచి డేటింగ్‌లో ఉన్నారు. 2025లో మహీకా పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీరి బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి వరల్డ్ కప్ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌లోనూ మహీకా హార్దిక్‌ను ఉత్సాహపరుస్తూ స్టేడియంలో కనిపిస్తున్నారు. అంతకుముందు హార్దిక్ బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కో-పేరెంటింగ్ పద్ధతిలో అగస్త్య పెంపకం
హార్దిక్ పాండ్యా, అతని మాజీ భార్య, నటి నటాసా స్టాంకోవిచ్‌లకు జన్మించిన కుమారుడు అగస్త్య. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట 2024లో విడాకులు తీసుకున్నారు.
ప్రస్తుతం విడిపోయినప్పటికీ, అగస్త్య భవిష్యత్తు కోసం వీరిద్దరూ ‘కో-పేరెంటింగ్’ (ఉమ్మడి పెంపకం) పద్ధతిని అనుసరిస్తున్నారు. అగస్త్య తన తండ్రి హార్దిక్ పాండ్యా వద్ద ఉన్నప్పుడు మహీకా కూడా అతనితో ఎంతో చనువుగా మెలుగుతూ బాధ్యతగా వ్యవహరించడం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


